YSR Congress Party (@YSRCParty) header
YSR Congress Party (@YSRCParty) profile picture

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Joined February 2011
Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)Photo by YSR Congress Party (@YSRCParty)
వైయస్‌ఆర్‌సీపీ తరఫున మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
7
42
306
39,073
విజయవాడ - పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి అక్రమాలు - అయినా మరోసారి చోద్యం చూస్తూ ఉండిపోయిన ఎస్ఈసీ - ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం తప్పదు : వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎస్ఈసీని కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అక్రమాలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం ) నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, కొమ్మూరి కనకారావు, నలమారు చంద్రశేఖర్ రెడ్డి.. విజయవాడ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలిదశ, మున్సిపల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా పోలీసులు, ఎన్నికల అధికారుల సాయంతో కూటమి అక్రమాలు నిరాటంకంగా కొనసాగాయని, అయినా ఎస్ఈసీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం ) నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలపై ఎస్ఈసీని కలిసి మరోసారి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్ఈసీ ఇప్పటికైనా చర్యలు తీసుకుపోతే న్యాయపోరాటం తప్పదని వారు హెచ్చరించారు. ప్రెస్ మీట్లో వైఎస్సార్సీపీ నేతలు ఏం మాట్లాడారంటే.. - ఎస్ఈసీ స్పందించకపోతే న్యాయపోరాటం : వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం. రాష్ట్రంలో ఎన్నికల్ని చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్దమవుతోంది. పోలీసులే వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని ఎలా అడ్డుకుంటున్నారో అందరూ చూస్తున్నారు. ఎన్నికల ఏజెంట్ గా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారిని ఇవాళ హౌస్ అరెస్టు చేశారు. రాప్తాడులో 200 బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోతే, ఎవరు తీసుకెళ్లారో తెలియదని ఆర్వో చెప్తున్నారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే మహిళలపై కార్లు పోనిచ్చేస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ గారు రిగ్గింగ్ ల మీద రిగ్గింగ్ లు చేయిస్తున్నారు. అంటే మంగళగిరిలో కూడా గెలుపు మీద నమ్మకం లేదన్నమాట. అటువంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు, నేరుగా మీ పార్టీ నేతల్నే విజేతలుగా ప్రకటించుకుంటే సరిపోయేదిగా. ఎన్నికల కమిషన్ గానీ, స్థానిక ఎన్నికల అధికారులు కానీ మా ఫిర్యాదుల్ని మొక్కుబడిగా తీసుకోవడమే తప్ప చర్యలు లేవు. ఓ ఎమ్మెల్యే కారుతో గుద్దేస్తే, ఆమెకు మద్దతుగా టీడీపీ నాయకులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారంటే అంతకన్నా అరాచకం ఎక్కడన్నా ఉంటుందా? ఎమ్మెల్యే స్థానిక ఓటర్లపై దాడులు చేస్తుంటే మందలించాల్సింది పోయి ఎదురు ఫిర్యాదులు చేస్తారా? ఓ పక్క డబ్పుప్రయోగం, మరోపక్క అధికారుల అండతో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసినా తిరస్కరించేలా చేయడం చేస్తున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి మచ్చగా మారిపోయాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు మందలించినా అధికారుల్లో మార్పులు కనిపించడం లేదు. ఏ ఒక్క అధికారిపై అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? గతంలో వైఎస్సార్సీపీ హయాంలో తప్పు చేయకపోయినా ఎంతో మంది అధికారుల్ని మార్చేసారు. ఇవాళ తప్పు చేస్తున్నా అధికారులపై చర్యల్లేవు. వైఎస్సార్సీపీ అభ్యర్ధులు గెలుస్తున్నా డిక్లరేషన్ ఫారాలు మాత్రం టీడీపీ వాళ్లకు ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల వైఫల్యంలో, అరాచకంలో, రౌడీయిజం, గూండాయిజంలో తప్ప పాలనలో నంబర్ వన్ గా లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే మేం న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. - నిరాటంకంగా కొనసాగుతున్న అక్రమాలు : కొమ్మూరి కనకారావు, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ జరిగిన పంచాయతీ తొలిదశ, మున్సిపల్ రెండో దశ ఎన్నికల్లో కూటమి అక్రమాలు నిరాటంకంగా సాగాయి. అయినా ఎస్ఈసీ నుంచి ఎలాంటి చర్యల్లేవు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల కమిషన్ పూర్తిగా చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అర్థమవుతోంది. సహజంగా చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలంటే భయం. ప్రతిపక్షంలో ఉంటే ఎన్నికల్ని బహిష్కరించాడు. అధికారంలో ఉండగా ఎన్నికల కమిషన్ ను తన చెప్పుచేతల్లో ఉంచుకుని నామినేషన్ల నుంచి ఎన్నికల వరకూ ప్రతీ చోటా అక్రమాలకు పాల్పడుతున్నాడు. పోలీసులు, ఎన్నికల వ్యవస్థల్ని అడ్డుపెట్టి చంద్రబాబు ఎన్నికల్ని నెగ్గాలని చూస్తున్నాడు. అభివృద్ధి చేస్తున్నా, సూపర్ సిక్స్ ఇస్తున్నా అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్నికల నిర్వహణలో మాత్రం ఎందుకు విఫలమవుతున్నారో చెప్పాలి. మంగళగిరి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధికి ఏజెంట్ అయిన దొంతిరెడ్డి వేమారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. లోకేష్ నియోజకవర్గంలో 39, 40 పోలింగ్ బూత్ ల్లో రిగ్గింగ్ చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ అధికారం చేతుల్లో ఉందని చంద్రబాబు గెలిచినట్లు చెప్పుకుంటున్నారే తప్ప ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. ఇవి సక్రమంగా జరిగిన ఎన్నికలే కావు. ఎస్ఈసీ చంద్రబాబు జేబు సంస్థగా మారిపోవడం సిగ్గుచేటు. - ఇంత అన్యాయంగా ఎన్నికలు నిర్వహిస్తారా? : నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం) ఇవాళ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లాం. ఎస్ఈసీకి 46 వినతిపత్రాలు ఇచ్చాం. రాయచోటి, శ్రీకాళహస్తి, గురజాల, మంగళగిరి, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో టీడీపీ గూండాలు ఎలా రిగ్గింగ్ చేసుకున్నారు, మా వాళ్లపై ఎలా దాడులు చేశారన్న దానిపై ఫిర్యాదులు చేసినా ఎస్ఈసీ పట్టించుకోలేదు. మా వినతిపత్రాల్ని అధికారులకు ఫార్వార్డ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఎస్ఈసీ ఉండటం సిగ్గుచేటు. నామినేషన్ల దగ్గరి నుంచీ ప్రతీ చోటా కూటమి నేతలు రకరకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇంత దుర్మార్గంగా ఎన్నికలు జరుగుతుండటం చూస్తుంటే రాక్షసపాలన ఎలా ఉందో అర్దమవుతోంది. అనంతపురం జిల్లా రాప్తాడులో 200 బ్యాలెట్ పేపర్లు టీడీపీ వ్యక్తి ఎత్తుకుపోయాడని ఫిర్యాదు చేస్తే రీపోలింగ్ కు ఆదేశించకుండా ఎస్ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇంత బహిరంగంగా బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోతుంటే, అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు, అంత న్యాయంగా మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నారని అర్దమవుతోంది. ఇంత రిగ్గింగ్ జరుగుతున్నా అక్కడున్న అధికారులు, పోలీసులు అడ్డుకోకపోగా.. మా వాళ్లను అడ్డుకుని కేసులు పెడుతున్నారు. మీ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అందరు అభ్యర్ధులు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేలా చేసి అప్పుడు గెలుపు గురించి మాట్లాడండి.
11
72
2,674
ఓటర్లను చంపుతామంటూ మళ్లీ బెదిరింపులు. పోలింగ్‌ ఏజెంట్లపై మళ్లీ దాడులు, పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డగింతలు. పోలింగ్‌ కేంద్రాల నుంచి మళ్లీ బ్యాలెట్‌ పత్రాల చోరీ. పోలీసుల సహకారంతో మళ్లీ యథేచ్ఛగా రిగ్గింగ్‌. @ncbn గారూ, మీ ప్రభుత్వ హయాంలో ఈ రోజు జరిగిన ఘటనలకు మీకు సిగ్గనిపించడం లేదా? రెండో విడత మున్సిపల్‌ ఎన్నికలు, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులను, ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకుని వైయస్సార్‌సీపీ నాయకులను, అభ్యర్థులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మీ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడింది. ఎన్నికల్లో మీరు గెలవాలనుకుంటున్నది ఇలాగేనా? అహోబిలంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాన్వాయ్‌లోని ఒక వాహనం వైయస్సార్‌సీపీ మద్దతుదారులపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు గాయపడ్డారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగంపేటలో కూటమి మద్దతుదారులు పోలింగ్‌ ఏజెంట్లపై దాడిచేసి, ఒక ఏజెంట్‌ చేయి విరగ్గొట్టారు. ప్రసన్నాయనపల్లిలో టీడీపీ నాయకులు అధికారులను బెదిరించి బ్యాలెట్‌ పత్రాలను ఎత్తుకెళ్లారు. నరసంపల్లిలో ఇద్దరు వ్యక్తులు బ్యాలెట్‌ బాక్సుల్లో ఇంకు పోయడంతో రెండు వార్డుల్లో పోలింగ్‌ నిలిచిపోయింది. వెల్లటూరులో టీడీపీ వర్గీయులు పోలింగ్‌ కేంద్రం తలుపులు మూసేసి, పోలీసుల కళ్లెదుటే బయటి వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పట్టపగలే బహిరంగంగా ఒకే ఓటర్లను వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు తిప్పుతూ ఓట్లు వేయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతిపక్ష నాయకులను అపహరించడం, గృహనిర్బంధం చేయడం ద్వారా ఎన్నికలకు దూరంగా ఉంచారు. పోలింగ్‌ ఏజెంట్లపై దాడులు చేశారు. వారి నియామక పత్రాలను చించేశారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వైయస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఓటర్లను బెదిరించారు. టీడీపీ కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాలను స్వాధీనం చేసుకుని, బహిరంగంగానే నకిలీ ఓటరు కార్డులను ఉపయోగించారు. ఓటర్ల వేళ్లపై సిరా గుర్తులను చెరిపేశారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. అక్రమాలను వీడియో తీసిన వారిపై దాడులు చేసి, వారి సెల్‌ఫోన్లను లాక్కున్నారు లేదా ధ్వంసం చేశారు. చంద్రబాబు గారూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరుకూ ఎలాంటి భయం లేకుండా తన ఓటును వినియోగించుకునే హక్కు ఉంది. మీరు బెదిరించిన ప్రతి ఓటరుకు, దాడికి గురైన ప్రతి పోలింగ్‌ ఏజెంట్‌కు, చోరీకి గురైన ప్రతి బ్యాలెట్‌ పత్రానికి మీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. బాధితులకు న్యాయం చేయాలని, ఎన్నికల అక్రమాలు జరిగిన ప్రతి చోటా రీపోలింగ్‌ నిర్వహించాలని, ఇందుకు బాధ్యులైన టీడీపీ నాయకులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ఘటనలపై వైయస్సార్‌సీపీ న్యాయపోరాటం చేస్తుంది. మీ పాలనలో జరిగిన ఈ దారుణాలకు మీరు సమాధానం చెప్పక తప్పదు. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #CBNJungleRaj
Voters threatened with death again. Polling agents beaten and barred again. Ballot papers stolen from booths again. Mass rigging with police support again. @ncbn garu, how are you not ashamed of what happened under your government today? During the second phase of municipal elections and the first phase of panchayat elections, your party used the police and government officials to intimidate YSRCP leaders, candidates, and the people to rig the polls. Is this how you intend to win elections? In Ahobilam, a vehicle part of TDP MLA Bhuma Akhila Priya’s convoy drove into YSRCP supporters, injuring five and leaving a woman in critical condition. In Mangampeta, coalition supporters attacked polling agents and broke one agent’s arm. In Prasannayanapalli, TDP leaders threatened officials and stole ballot papers. In Narasampalli, two men poured ink into ballot boxes, halting polling in two wards. In Vellaturu, TDP groups shut the booth doors and brought in outsiders to cast bogus votes in front of the police. In Mangalagiri-Tadepalli Municipal Corporation, voters were cycled through polling booths, in broad daylight glaringly. The same tactics played out across the state. Abductions and house arrests kept opposition leaders away. Polling agents were beaten, their appointment forms torn and their entry blocked. Voters were threatened if they backed YSRCP-supported candidates. TDP workers took over booths, glaringly used fake voter cards and wiped off voting ink. When people protested, police used lathis and took them into custody. When people filmed what was happening, they were attacked and their phones were seized or smashed. Chandrababu garu, the people of Andhra Pradesh are watching. In a democracy, every voter has the right to cast a ballot without fear. Your government will have to answer for every voter threatened, every agent assaulted and every ballot stolen. We demand justice, repolling wherever voting was compromised and action against the TDP leaders, police personnel and officials responsible. YSRCP will take these matters to court. You will have to answer for what happened under your watch. #CBNJungleRaj
1
16
57
2,265
తాడేపల్లి - అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి.. వైయ‌స్ జగన్ పాలనకు మార్గదర్శకం - కూటమి పాలనలో మాత్రం రాజ్యాంగానికి తూట్లు.. రెడ్‌బుక్‌కు పెద్దపీట : వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ధ్వజం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశానికి రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చేసిన విశిష్ట కృషిని స్మరించుకున్నారు. రాజ్యాంగం అందించిన సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ స్ఫూర్తితో ముందుకు సాగాలని నేతలు పేర్కొన్నారు. తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ‌ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి పాలన సాగిందని, రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తూ రెడ్‌బుక్ విధానాలకు పెద్దపీట వేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం, అంబేద్కర్‌ ఆశయాలను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన భార‌త రాజ్యాంగ ఆమోద దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న చేసిన కృషిని నేత‌లు కొనియాడారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఎవ‌రెవ‌రు ఏమ‌న్నారంటే.. - రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు: వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాలన సాగిస్తున్నారు. 2024 నుంచి అంబేద్కర్‌ రాజ్యాంగానికి బదులు రెడ్‌బుక్‌ విధానాలే అమలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని ఒకసారి చదివి గౌరవించాలి. 2019–24 మధ్య శ్రీ వైయ‌స్ జగన్ గారి పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అవకాశాలు, పదవులు, రిజర్వేషన్లు కల్పించారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన తిరిగి రావాలంటే అది వైయ‌స్ జగన్‌తోనే సాధ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. - అంబేద్కర్‌ రాజ్యాంగమే దేశాభివృద్ధికి పునాది: మురుగుడి హనుమంతరావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం దేశ భవిష్యత్తు, అభివృద్ధికి పునాది వేసింది. సరైన విద్య, సాగునీరు, తాగునీరు కూడా లేని నాటి పరిస్థితుల నుంచి దేశాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే దిశగా పంచవర్ష ప్రణాళికలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు ముందుకు వచ్చాయి. రిజర్వేషన్ల ద్వారా అట్టడుగున ఉన్న ప్రజలను పైకి తీసుకురావాలన్న అంబేద్కర్‌ ఆలోచన దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ప్రపంచంలో గుర్తింపు పొందిన దేశంగా భారత్‌ ఎదిగింది. అయితే ప్రస్తుతం ప్రాంతీయ తత్వాలు, రాజకీయ మార్పుల వల్ల దేశ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు తమ బాధ్యతను గుర్తించాలి. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గౌరవిస్తూ దేశ అభివృద్ధి, రాజ్యాంగ స్ఫూర్తి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. - అంబేద్కర్‌ ఆశయాలను ఆచరణలో చూపించిన నాయకుడు వైయ‌స్ జగన్‌: కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విద్య, సామాజిక న్యాయం అందాలనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించారు. అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరినీ పైకి తీసుకురావడం, కులమత భేదాలు లేకుండా సమాన అవకాశాలు కల్పించడం ఆయన ఆశయం. వైయ‌స్ జగన్‌ పాలనలో పేదలు, విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి అంబేద్కర్‌ ఆలోచనలను ఆచరణలో చూపించారు. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని పక్కనపెట్టి రాష్ట్రాన్ని అశాంతి, అరాచక పరిస్థితుల వైపు తీసుకెళ్తోంది. విజయవాడలోని అంబేద్కర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సందర్శించారా? అంబేద్కర్‌ ఆశయాలను గౌరవిస్తూ పాలన సాగిస్తున్నామని చెప్పుకునే వారు కనీసం ఆయన విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారా?. - అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తి నిలవాలంటే వైయ‌స్ జగన్‌ నాయకత్వం మళ్లీ రావాలి : టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వైయ‌స్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్‌ రాజ్యాంగానికి బదులుగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పోలీసు రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కుల, కార్పొరేట్‌ ఆధిపత్యాన్ని పెంచే విధానాలతో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై అక్ర‌మ కేసులు, దాడులు, నామినేషన్ల అడ్డగింతలు, ఓటర్లను భయపెట్టే చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీ‌ వైయ‌స్ జగన్ గారి పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, గ్రామస్వరాజ్యం, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, నాడు–నేడు, ఆస్పత్రులు, పోర్టుల వంటి కార్యక్రమాలతో అంబేద్కర్‌ ఆశయాలను ఆచరణలో చూపించారు. విజయవాడలో వైయ‌స్ జగన్‌ ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం వివక్ష కాదా? అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తి నిలవాలంటే వైయ‌స్ జగన్‌ నాయకత్వం మళ్లీ రావాలి. - చంద్రబాబు పాలనలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు : కొమ్మూరి కనకారావు, వైయ‌స్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్‌ అధ్య‌క్షుడు విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు, ప్రాంతాలతో కూడిన భారతదేశాన్ని ఒక్కటిగా నిలిపిన గొప్ప శక్తి రాజ్యాంగం. అంబేద్కర్‌ స్ఫూర్తితో రూపొందిన రాజ్యాంగం కళ్లముందే బలహీనపడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ, ఎన్నికల కమిషన్‌ వంటి సంస్థలను పక్కనపెట్టి ఎన్నికల్లో రెడ్‌బుక్‌ విధానాలను అమలు చేస్తున్నారు. కూటమి పాలనలో అట్టడుగు వర్గాల్లో అభద్రత పెరిగింది. వైయ‌స్ జగన్‌ పాలనలో పేదలు, మహిళలు, రైతులకు విద్య, వైద్యం, ఆత్మగౌరవం లభించాయి. ఇప్పుడు రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని రక్షించి దానికి అర్థం తీసుకురావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్ జగన్‌ తిరిగి రావాల్సిందే. అప్పుడే అంబేద్కర్‌ ఆశయాలకు నిజమైన గౌరవం లభిస్తుంది. - రాజ్యాంగం గాడిలో పడాలంటే వైయ‌స్ జగన్‌ పాలన మ‌ళ్లీ రావాలి: నందిగం సురేష్, మాజీ ఎంపీ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దాన్ని పక్కనపెట్టి విధ్వంసకర వాతావరణంతో పాలన సాగిస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున వైయ‌స్ జగన్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహంపై జరిగిన దాడులను ప్రజలు మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చకుండా, ప్రశ్నించే ప్రజలపై దాడులు, కేసులు, బెదిరింపులు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాలు చింపడం, అభ్యర్థులను కొట్టడం, మహిళలను సైతం బెదిరించడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగం, శాంతిభద్రతలు, మహిళల రక్షణ తిరిగి గాడిలో పడాలంటే వైయ‌స్ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కన్న కలలు నిజమవుతాయి. ఈ కార్య‌క్ర‌మంలో గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి, ఎంప్లాయిస్ అండ్ పెన్ష‌న‌ర్స్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అధికార ప్ర‌తినిధులు నాగ మ‌ల్లేశ్వ‌రి, బీవై రామ‌య్య‌, ష‌రీఫ్, రాష్ట్ర నూర్ బాషా దూదేకుల విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ద‌స్త‌గిరి, యోహ‌న్ రాజు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
4
19
2,054
A YSRCP worker LOST HIS LIFE in TDP's violence in Kuppam! After Basavaraju, backed by YSRCP, reportedly won Vanaguttapalli Panchayat by 25 votes, TDP supporters obstructed the victory declaration and attacked the election route officer’s car. Rajendra (60) died, and four others were seriously injured. Political violence must never cost innocent lives! #TDPGoons #CBNFailedCM @thewire_in @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
10
139
10
301
10,323
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం, రెడ్డివారిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేళ టీడీపీ నేతలు రిగ్గింగ్ నడిమిరాజుగారిపల్లి పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ కు పాల్పడిన టీడీపీ గూండాలు స్థానికులు కాకపోయిన పాత రాయచోటికి చెందిన టీడీపీ గూండాలను లోపలికి అనుమతించిన అధికారులు పోలింగ్ కేంద్రంలో తలుపులు మూసివేసి ఓటర్లను అనుమతించని అధికారులు, పోలీసులు #RiggingMasterCBN
37
1
129
1,902
కింద పేర్కొన్న 24 మందిని "YSRCP USA Committee" లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా నియమించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
9
14
21
104
15,851
🚨 #CBNTurnedAPIntoBihar కుప్పంలో దారుణంలో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు దారుణం.. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త రాజేంద్ర మృతి! కుప్పం మండలం వానగుట్టపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ మద్దతుతో బసవరాజు 25 ఓట్ల మెజారిటీతో గెలుపు అధికారికంగా ప్రకటించిన ఆర్వో.. కానీ డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. తమ మాట విననందుకు ఎన్నికల ఆఫీసర్ కారుపై టీడీపీ నేతలు దాడి కారు స్పీడ్‌గా దూసుకెళ్ళడంతో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త రాజేంద్ర మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు ఫలితాల్ని తారుమారూ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నం.. ఇంత దారుణమా @ncbn ? #TDPGoons #SaveDemocracyInAP #SadistChandraBabu
11
192
13
397
9,764
ఓటమిని తట్టుకోలేక టీడీపీ గుండాల దాడితో వైసీపీ కార్యకర్త రాజేంద్ర గారు మృతి!
30
149
18
275
8,315
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో లోపల టీడీపీ మూకలు రిగ్గింగ్.. బయట ఓటర్లు వెయిటింగ్ ఆరేపల్లి గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ ఏజెంట్లను బయటికి తోసేసి.. పోలీసుల సాయంతో లోపల రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ మూకలు పోలింగ్ కేంద్రంలోకి తమని పంపించాలని పోలీసుల్ని ఓటర్లు కోరుతుండగా.. టైమ్ అయిపోయిందని అనుమతి నిరాకరణ. దాంతో రోడ్డుపై బైఠాయించి ఓటర్లు నిరసన
1
11
65
2,870
YSR Congress Party retweeted
Voters threatened with death again. Polling agents beaten and barred again. Ballot papers stolen from booths again. Mass rigging with police support again. @ncbn garu, how are you not ashamed of what happened under your government today? During the second phase of municipal elections and the first phase of panchayat elections, your party used the police and government officials to intimidate YSRCP leaders, candidates, and the people to rig the polls. Is this how you intend to win elections? In Ahobilam, a vehicle part of TDP MLA Bhuma Akhila Priya’s convoy drove into YSRCP supporters, injuring five and leaving a woman in critical condition. In Mangampeta, coalition supporters attacked polling agents and broke one agent’s arm. In Prasannayanapalli, TDP leaders threatened officials and stole ballot papers. In Narasampalli, two men poured ink into ballot boxes, halting polling in two wards. In Vellaturu, TDP groups shut the booth doors and brought in outsiders to cast bogus votes in front of the police. In Mangalagiri-Tadepalli Municipal Corporation, voters were cycled through polling booths, in broad daylight glaringly. The same tactics played out across the state. Abductions and house arrests kept opposition leaders away. Polling agents were beaten, their appointment forms torn and their entry blocked. Voters were threatened if they backed YSRCP-supported candidates. TDP workers took over booths, glaringly used fake voter cards and wiped off voting ink. When people protested, police used lathis and took them into custody. When people filmed what was happening, they were attacked and their phones were seized or smashed. Chandrababu garu, the people of Andhra Pradesh are watching. In a democracy, every voter has the right to cast a ballot without fear. Your government will have to answer for every voter threatened, every agent assaulted and every ballot stolen. We demand justice, repolling wherever voting was compromised and action against the TDP leaders, police personnel and officials responsible. YSRCP will take these matters to court. You will have to answer for what happened under your watch. #CBNJungleRaj
50
772
11
2,306
42,245
ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై పోలీసులు దౌర్జన్యం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తుండగా అడ్డుకున్న వైయస్‌ఆర్‌సీపీ ఏజెంట్లు. దాంతో పోలీసులతో కలిసి టీడీపీ నేతలు దాడి పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు, గ్రామస్థులు #SadistChandraBabu #TDPGoons
1
27
1
123
3,541
వీకెండ్ వస్తే హైదరాబాద్‌‌లో వాలిపోతున్న చంద్రబాబు.. 2019-2024లో ఆంధ్రాలో ఉన్నది ఎన్నిరోజులో తెలుసా? స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు ఉండటం తప్ప.. పట్టుమని 10 రోజులు కూడా కంటిన్యూగా ఏపీలో ఉండని చంద్రబాబు
4
38
1
132
4,294
YSR Congress Party retweeted
7
52
1,245
YSR Congress Party retweeted
ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ,ఊరు బాగుపడుతుంది. #BotchaSatyanarayana #YSJagan #YSRCP #Vizianagaram #AndhraPradesh #LocalBodyElection
1
18
289
2,514
YSR Congress Party retweeted
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మధురవాడలోని జోనల్ ఆఫీస్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాను. ఈ సందర్భంగా రాజ్యాంగం మన దేశ ప్రజలకు కల్పించిన న్యాయం,స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అమూల్యమైన విలువలను స్మరించుకున్నాను.(1/4) #YSRCP
1
5
51
939
క్లోజ్డ్ రూమ్‌లో ఏం జరిగిందో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు వినలేదా @JaiTDP? రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడుతూ రాయలసీమ లిఫ్ట్‌ పనులు ఆపింది @ncbn అని రేవంత్ రెడ్డి చెప్పక కూడా ఇంకా మాట్లాడానికి సిగ్గనిపించడం లేదా? RayalaseemaLiftIrrigation #SadistChandraBabu #YSRCPWithRayalaseema #YSRCPForFarmers
#PsychoFekuJagan కేసీఆర్ గారు నీ చొక్కా పట్టుకోగానే భయపడి, అన్ని ప్రాజెక్టులను ఆపేశావని హరీష్ రావు గారు నీ భాగోతం బయటపెట్టారు కదా జగన్.. నీ హయాంలో (2020లో) ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు గారు మళ్లీ ఎలా ఆపుతారు? 2020లో ముఖ్యమంత్రి ఎవరు? ఎవరి చేతకానితనం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందో చెప్పు @ysjagan?
2
76
2
254
7,675
🚨 #CBNTurnedAPIntoBihar స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ములేక.. అడ్డదారుల్లో బెదిరింపులకి దిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను భయపెట్టి, ప్రలోభపెట్టి, బెదిరించి.. ప్రజాస్వామ్య విలువలకు పాతర ప్రజల మద్దతుతో గెలిచే సత్తాలేక అడ్డదారులు తొక్కి మీరు గెలిచినా.. అంతిమంగా ప్రజాతీర్పు ముందు తలవంచక తప్పదు @ncbn #TDPGoons #SaveDemocracyInAP #SadistChandraBabu
2
116
1
413
9,716
సత్యసాయి జిల్లాలో పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన టీడీపీ మూకలు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వైయస్‌ఆర్‌సీపీకి పడిపోతున్నాయనే అనుమానంతో.. ఇంకు తీసుకెళ్లి బాక్స్‌లో పోసిన టీడీపీ గూండాలు. అయినా వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెనుకంజ స్థానిక ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతాయనే.. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఉండాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసిన వైయస్ జగన్ గారు కానీ.. సీసీ కెమెరాలు పెడితే తమ దౌర్జన్యాలు సాగవని టీడీపీ నేతలు ఒత్తిడి తేవడంతో ఆ దిశగా ఆలోచించని ఎస్‌ఈసీ #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
1
64
301
5,039
గన్నవరం బాలుర హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో టీడీపీ మూకలు రిగ్గింగ్ ప్రశ్నించిన వైయస్‌ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసుల సాయంతో బయటకి తోసేసిన టీడీపీ నేతలు, ఎదురుతిరిగిన వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జ్ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి పోలీసుల్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
40
180
4,669
మంగళగిరిలో పోలింగ్ కేంద్రం నుంచి వేమారెడ్డి గారిని బలవంతంగా బయటకు పంపిన పోలీసులు వైయస్‌ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి చీఫ్ ఏజెంట్‌గా ఉన్న తనని ఏ కారణంతో బయటకు పంపుతున్నారని నిలదీసిన వేమారెడ్డి గారు పోలింగ్ కేంద్రంలోకి రిగ్గింగ్ చేసేందుకు భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు. కానీ.. వారిని బయటకు పంపకుండా పోలీసులు తాత్సారం వీడియో తీస్తున్న జర్నలిస్ట్‌లను బయటకు పంపిచేస్తున్న పోలీసులు మంగళగిరిలో గెలిచే సత్తాలేక.. కుట్రలు చేయిస్తున్నావా @naralokesh ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
1
23
111
4,054