YSRCP Italy retweeted
చంద్రబాబుకు తెలిసిందల్లా.. వ్యక్తిత్వ హననాలే
- కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలికాచుకోవడమే..
- ప్రత్యర్థి కుటుంబాల మహిళలపై నీచమైన ట్రోల్స్ నడపడంలో తండ్రికి తగ్గ కొడుకుగా @naralokesh తయారయ్యాడు
షర్మిల వ్యక్తిగత జీవితంపై నీచమైన ప్రచారాలు ట్రోల్స్ నడిపింది @JaiTDP వారే.. బాలకృష్ణ బిల్డింగ్ నుంచే..
ఇది విను @Telugu360 కొల్లి గోపాల్ 👇
చెట్టాపట్టాల్...
ఈ కథనం వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంది.
అత్యున్నత సమావేశం తర్వాతనే ఈ కథనానికి ఆమోదముద్ర పడిందని చెబుతున్నారు.
ఈ కథనంతో షర్మిలపై మానసిక దాడి చేయడమే లక్ష్యమా?
#YSSharmila #ysjagan
YSRCP Italy retweeted
చెట్టపట్టాల్.. అర్థం తెలియని పచ్చ అజ్ఞానులు
- పథకం ప్రకారం షర్మిలతో ట్వీట్, తర్వాత చినబాబు, ఆ తర్వాత పచ్చ మీడియా దుష్ప్రచారం
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా వైయస్సార్ కుటుంబంపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో చేతులు కలిపి, తోడబుట్టిన అన్నను బద్నాం చేయడానికి పావులా మారిన షర్మిల.. చెట్టపట్టాల్ అనగానే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని వైయస్సార్ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
తన అన్న వైయస్ జగన్‌తో విరోధం ఉంటే.. ఆస్తి తగాదాలు ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలి. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, చంద్రబాబు నీచ రాజకీయ క్రీడలో పావుగా మారి, జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకుని.. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే స్క్రిప్టులను చదివి అద్భుతంగా నటిస్తే.. చంద్రబాబు దగ్గర మార్కులు పడొచ్చేమో కానీ.. వైయస్సార్ అభిమానులు కానీ, సామాన్యులు కానీ హర్షించరు.
రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ గొడవలు, మనస్ఫర్థలు లేని కుటుంబాలు ఉండవు. ఇక ఆస్తుల గొడవలు అపర కుబేరులైన అంబానీ సోదరులకే తప్పలేదు. తాజాగా టీవీఎస్ కుటుంబంలోనూ.. వీటిని పెద్దల సమక్షంలోనో, కోర్టుల పరిధిలోనో పరిష్కరించుకోవాలి. అంతే తప్ప కుటుంబ పరువును బజారుకీడ్చడం దుర్మార్గమైన చర్య.
వైయస్ జగన్‌పై అత్యంత దారుణంగా తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్న షర్మిల చర్యలన్నింటినీ చూస్తే.. కూటమి నేతలతో చెట్టపట్టాల్ వేసుకుని ముందుకు వెళుతున్నట్లు ఎవరికైనా అర్థమవుతుంది. కానీ 'చెట్టపట్టాల్' అన్న శీర్షికతో సాక్షిలో వచ్చిన వార్తను ఆక్షేపిస్తున్న షర్మిల మొదట ఆ పదానికి అర్థం తెలుసుకుని స్పందించి ఉంటే బాగుండేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
Inviting an elder to one's daughter's wedding is a matter of courtesy and culture. The story in @SakshiNews about @realyssharmila garu's invitation to @ncbn garu is extremely demeaning to a woman, and they are completely unacceptable.
Public life can have strong political differences, but it must never lose its basic values. Personal attacks on a woman have no place in Andhra Pradesh. I strongly condemn @sakshinews for their irresponsible article.
My best wishes to Sharmila garu and her family for the happy occasion.
YSRCP Italy retweeted
A fire broke out in the early hours of today at K. Pallepalem in Kothapatnam mandal of Prakasam district. Fishermen’s nets and fishing equipment were destroyed, causing an estimated loss of Rs. 5 crore and affecting the livelihoods of 300 families. The fishermen who met me today said they watched helplessly as the nets they had prepared for fishing went up in flames. Their words deeply moved me.
@ncbn garu, these families depend on their daily catch to make ends meet. I demand that your government assess the losses immediately and provide full compensation to every affected family.
I also assure our fisher brothers that if this government fails to support you, we will provide compensation as soon as our government returns to power. Please do not lose heart.
YSRCP Italy retweeted
అలా కాదు రా…
ఋషికొండ పైన ఉన్న బిల్డింగ్స్ తీసి మళ్లీ ఇంకొకటి కడితే
అది ఋషులు తపస్సు చేసే కొండ ఓడలకి వైజాగ్ వచ్చింది అని చెప్పేది అని
అవి తుఫాన్లు ఆపేవి అని చెప్పి
ఇప్పుడు వైజాగ్ చుట్టూ ఉన్న కొండలు తవ్వేస్తున్నారు అని అడుగుతుంటే అభివృద్ధి అంటున్నారు
కొండలు కాకుండా ఇంక వేరే ల్యాండ్ నే లేదా వైజాగ్ లో 🤔
కనీసం మీరు దీనిపైన గొడవ చేశారో దానిపైన కూడా నిలపడకపోతే ఎలా రా
ఇదేమి హిపోక్రసీ రా 🤡
YSRCP Italy retweeted
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
@ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
YSRCP Italy retweeted
రామోజీ రావు గారి గురించి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు……
కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు
రామోజీ రావు గారి లో మంచి లక్షణాలు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం.
అది రామోజీ రావు గారికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు
ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే
సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు.
నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు
ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చేలా భ్రష్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ తెలిసిందే
ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ
చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు
కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు
పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్‌పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
YSRCP Italy retweeted
నీ బతుక్కి సిగ్గు అనేది ఉంటే, దీనికి సమాధానం చెప్పు @naralokesh
#CBNFailedCM
#LooseLokesh
#SadistChandraBabu
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
A NEVER-ENDING ROLLERCOASTER!
INC’s Sharmila creates a narrative against YSRCP.
NDA–TDP picks up the same narrative.
NDA-JSP follows the same political script.
#Hotline
YSRCP Italy retweeted
షర్మిలమ్మా… @realyssharmila
మీ కుటుంబాన్ని అథఃపాతాళానికి తొక్కేయడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశాడో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. చివరకు మీ తాతగారు రాజారెడ్డిగారి దారుణమైన హత్య వెనుక ఉన్నదీ చంద్రబాబు పన్నాగమే.
చంద్రబాబుతోనూ, ఆయన ముఠాతోనూ వైయస్సార్‌గారు 30 ఏళ్లపాటు పోరాటం చేశారు. ఆ కుట్రలను తట్టుకుంటూ, ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందిస్తూ, జననాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగారో, ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో తెలియంది కాదు.
వైయస్సార్‌గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిక్షణం కూడా ఆయన్ని దించేయడానికి ఇదే చంద్రబాబు, ఆయన ముఠా చేయని ప్రయత్నం లేదు. చివరకు ఆయన ఆకస్మిక మరణం, ఈ మొత్తం ఘటనపై నెలకొన్న ప్రశ్నలకు ఇవ్వాళ్టికీ సమాధానాలు దొరకలేదు.
ఆ తర్వాత కూడా ఇదే చంద్రబాబు, ఆయన ముఠా మీ కుటుంబాన్ని ఎలా కష్టాలపాలు చేశారో, స్వయంగా మీ అన్నగారిని అన్యాయంగా ఎలా నిర్బంధానికి గురిచేశారో, చివరకు మీ వ్యక్తిత్వంపైన కూడా దారుణమైన దాడి ఎలా చేశారో ప్రజలందరికీ గుర్తే. అదే చంద్రబాబు ముఠాపై మీరు ఫిర్యాదు కూడా చేశారు. అలాంటి చంద్రబాబు, ఆయన ముఠాతో ఇవాళ మీ మైత్రి, చెలిమిని కళ్లారా చూస్తున్న వైయస్సార్ అభిమాని దిగ్భ్రాంతి చెందుతున్నాడు.
మీ తండ్రిగారిని దారుణంగా మాట్లాడుతున్నా, మీ తాతగారు రాజారెడ్డిగారిని అవహేళన చేస్తున్నా, ఆయనకు తప్పుడు ఉద్దేశాలు అంటగట్టి ఒక ముద్ర వేస్తున్నా మీ కుటుంబాన్ని గొడ్డలి కుటుంబం అన్నా, మీరు ఖండించడం లేదు.పైగా అదే ముఠాతో మీరు నిరంతరం సమావేశం అవుతున్నారు.
మీ రాజకీయ సౌకర్యం కోసం, మీ పొలిటికల్ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో మీ సమావేశాలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు మీరు సొంత భాష్యాలను, నిర్వచనాలను ఇచ్చుకుంటున్నారు. ఒకరికి మద్దతుగా ఇంకొకరు పనిచేస్తున్నప్పుడు, కలిసి ముందుకు సాగుతున్నప్పుడు చెట్టాపట్టాల్ అని అనడం, రాయడం సాధారణంగా జరిగేదే. ముఖ్యంగా రాజకీయ కథనాల్లో దీన్ని విస్తృతంగా వాడుతారు. అనేక తెలుగు పత్రికలు ఇవే పదాలను కొన్ని లక్షలసార్లు ప్రయోగించారు, రాశారు. కాని, ఇవాళ మీరు ఈ వార్తా కథనాన్ని వక్రీకరించి వాటికి మీ పొలిటికల్ ఆలోచనలు, చంద్రబాబు కుట్ర వ్యూహాలను అద్ది, ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు పంపే ప్రయత్నం మీరు ప్రయత్నిస్తున్నారన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది.
మీరు ట్వీట్ చేయగానే, చంద్రబాబు సుపుత్రుడు, ఈరాష్ట్రానికి పట్టిన దరిద్రం, లోకేష్ వెంటనే మీకు మద్దతు పలకడం, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు మాదిరిగా మానవ సంబంధాలు గురించి లెక్చర్లు ఇవ్వడం వెనుక ఉద్దేశాలేంటో, ప్రజలందరికీ అర్థంకానిది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా మీ కుటుంబాన్ని కూల్చేయడానికి వాళ్లు వేసే ఎత్తులు, విద్యలు ఇవన్నీ. నిజమైన సైతాన్లు వాళ్లంతా. ఇవాళ వాళ్లు నీకు పలికే మద్దతు అంతా వైయస్సార్‌గారి కుటుంబం కూలిపోవాలన్న ఉద్దేశంతో చేసిందే. తన మామ బాలకృష్ణ భవనంలోనే సోషల్ సైకోలను పెట్టి మీ వ్యక్తిత్వాన్ని హననం చేసింది ఇదే చంద్రబాబు, లోకేష్ అని మీరు మరిచిపోవడం ఆశ్చర్యకరం.
తెలంగాణలో పార్టీ పెట్టిన మీరు, తెలంగాణ నా గడ్డని నినదించినమీరు ఆకస్మికంగా అక్కడ పార్టీని మూసేసి, కాంగ్రెస్ తరఫున ఈ రాష్ట్రానికి వచ్చిన నాటినుంచీ చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారు. బహిరంగంగా, బీజేపీతో, అంతర్గతంగా కాంగ్రెస్‌తో చంద్రబాబు స్నేహం, చెట్టాపట్టాలేసుకోవడం అందరికీ తెలిసిందే. గడచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా, చంద్రబాబు ఎలా చేయమంటే మీరు అలాచేశారు, ఎవర్ని నిలబెట్టమంటే వారిని నిలబెట్టారు. జగన్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రయత్నంలో చంద్రబాబు వేసే కుట్రలు, మీరు తోడ్పాటు అందించారు.
మీ కుటుంబంలో మీ అన్నగారికి, మీకూ మధ్య జరిగి ఉత్తర ప్రత్యుత్తరాలు, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆ లేఖలు, నేరుగా టీడీపీ అధికారిక హేండిల్ ఏరకంగా బయటకు వచ్చాయి? మొన్న బెంగళూరు ఇంటి విషయలో మీకూ, మీ అన్నగారికి అంతర్గతంగా జరిగిన విషయాలు ఎల్లోమీడియా ద్వారా, అదీ స్థానిక ఎన్నికలకు ఒక్కరోజుముందు ఎలా బయటకు వచ్చాయి? మీరు ఆరోజు చేసిన ట్వీట్ ఎవరికి ఉపయోగపడాలని చేశారు? మరి ఇవన్నీ మీరు, చంద్రబాబుతో రాజకీయంగా కలిసిమెలిసి చేస్తున్న రాజకీయ కుట్రలు కావా? మరి రాజకీయంగా చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగుతున్నట్టా? కాదా?
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
YSRCP Italy retweeted
Welcome to DrugsAndhrapradesh..
ఇచ్చట ఏం కావాలన్న దొరకును..ఒక చదువు,సంస్కారం తప్ప 🥰
Thanks to ijanary @ncbn
అప్పట్లో కొలంబియా దేశం లో bogotta సిటీ లో medellin ప్రాంతం లో దొరికే డ్రగ్స్ ఇప్పుడు ఏపీ లో దొరుకుతున్నాయి.
#Apdruglordpablesh
YSRCP Italy retweeted
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
YSRCP Italy retweeted
#Tirupati లడ్డు డామేజ్ ని ఇలా కవర్ చేద్దాం అనుకొన్నాడు tv9 జర్నలిస్ట్.. దొరికి పోయాడు
@TV9Telugu చరిత్రని వక్రీకరించి మరొకరికి డబ్బా కొట్టడం మొదలు పెట్టారు
#AndhraPradesh #FourthEstate #Vizag
YSRCP Italy retweeted
From a humble beginning in Ranchi to conquering the pinnacle of the sport, @msdhoni’s journey is a story of extraordinary grit, self-belief, and leadership.
As he bids farewell to active cricket, we celebrate not just the trophies, but the countless times he stood tall in the team's toughest moments, absorbing the pressure and guiding the side with a quiet smile. He leaves behind a wonderful and inspiring legacy that will be cherished by generations to come.
Wishing him the very best in his new role as Mentor and every happiness ahead.
#MSDhoni


























