చెట్టపట్టాల్.. అర్థం తెలియని పచ్చ అజ్ఞానులు
- పథకం ప్రకారం షర్మిలతో ట్వీట్, తర్వాత చినబాబు, ఆ తర్వాత పచ్చ మీడియా దుష్ప్రచారం
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా వైయస్సార్ కుటుంబంపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో చేతులు కలిపి, తోడబుట్టిన అన్నను బద్నాం చేయడానికి పావులా మారిన షర్మిల.. చెట్టపట్టాల్ అనగానే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని వైయస్సార్ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
తన అన్న వైయస్ జగన్‌తో విరోధం ఉంటే.. ఆస్తి తగాదాలు ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలి. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, చంద్రబాబు నీచ రాజకీయ క్రీడలో పావుగా మారి, జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకుని.. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే స్క్రిప్టులను చదివి అద్భుతంగా నటిస్తే.. చంద్రబాబు దగ్గర మార్కులు పడొచ్చేమో కానీ.. వైయస్సార్ అభిమానులు కానీ, సామాన్యులు కానీ హర్షించరు.
రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ గొడవలు, మనస్ఫర్థలు లేని కుటుంబాలు ఉండవు. ఇక ఆస్తుల గొడవలు అపర కుబేరులైన అంబానీ సోదరులకే తప్పలేదు. తాజాగా టీవీఎస్ కుటుంబంలోనూ.. వీటిని పెద్దల సమక్షంలోనో, కోర్టుల పరిధిలోనో పరిష్కరించుకోవాలి. అంతే తప్ప కుటుంబ పరువును బజారుకీడ్చడం దుర్మార్గమైన చర్య.
వైయస్ జగన్‌పై అత్యంత దారుణంగా తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్న షర్మిల చర్యలన్నింటినీ చూస్తే.. కూటమి నేతలతో చెట్టపట్టాల్ వేసుకుని ముందుకు వెళుతున్నట్లు ఎవరికైనా అర్థమవుతుంది. కానీ 'చెట్టపట్టాల్' అన్న శీర్షికతో సాక్షిలో వచ్చిన వార్తను ఆక్షేపిస్తున్న షర్మిల మొదట ఆ పదానికి అర్థం తెలుసుకుని స్పందించి ఉంటే బాగుండేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
Inviting an elder to one's daughter's wedding is a matter of courtesy and culture. The story in @SakshiNews about @realyssharmila garu's invitation to @ncbn garu is extremely demeaning to a woman, and they are completely unacceptable.
Public life can have strong political differences, but it must never lose its basic values. Personal attacks on a woman have no place in Andhra Pradesh. I strongly condemn @sakshinews for their irresponsible article.
My best wishes to Sharmila garu and her family for the happy occasion.
🚨 కోట రుక్మిణి ప్రైవేటు కంపెనీగా జనసేన
➡️ రూ.7.5 కోట్ల ఉద్యోగాల దందాలో బయపడుతున్న వాస్తవాలు
➡️ స్కాం విస్తృతి చాలా పెద్దదే
➡️ పెద్ద తలకాయలను తప్పించి.. ఒక ఉద్యోగితోనే ముగించే ప్రయత్నం
నిరుద్యోగులు. రూ.7.5 కోట్ల వసూళ్లు. 14 నెలల వ్యవహారం. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను నిలువునా ముంచిన వ్యవహారంలో ఇప్పుడు అసలు సూత్రధారులెవరన్న ప్రశ్న ముందుకొచ్చింది.
👉 ఈ వ్యవహారంలో వినిపిస్తున్నవి చిన్నాచితకా నాయకుల పేర్లు కాదు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు సన్నిహితురాలు, జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ ఛైర్‌పర్సన్ కోట రుక్మిణి, మరో కీలక నాయకుడు కళ్యాణం శివశ్రీనివాస్ (కేకే) పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
🛑 మీడియా సమావేశంలో అన్నీ ఒప్పుకున్న కేకే
14 నెలలుగా ఈ వ్యవహారం జరుగుతోందని ఆయనే చెప్పారు. 36 మంది నుంచి రూ.7.5 కోట్లు వసూలు చేశారన్నారు. ప్రభుత్వ ముద్రలు, నకిలీ నియామక పత్రాలు, ఫోర్జరీ సంతకాలు ఉపయోగించారని వివరించారు.
👉 మరి 14 నెలలుగా పార్టీ నాయకుల పేర్లు, కంపెనీ పేరు ఉపయోగించి ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంటే ఎవరికీ తెలియలేదా? నవంబర్ 5న మాత్రమే తెలిసిందంటే నమ్మాలా? పైగా ఈ స్కాం మరింత పెద్దగా కనిపించే అవకాశాలను కొట్టిపారేయలేదు.
🛑కోట రుక్మిణి కంపెనీ పాత్ర
వసూళ్ల వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న ధరణికృష్ణ.. రుక్మిణికి సంబంధించిన కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగి. మరి కంపెనీ పేరుతో జరిగిన లావాదేవీలపై యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు? కంపెనీ ఖాతాలు, ఉద్యోగుల ఖాతాలను ఎందుకు పరిశీలించకూడదు?
👉నవంబర్ 9న షోకాజ్ నోటీసు, 10న వివరణ, 11న ఉద్యోగం నుంచి తొలగింపు. అదే రోజు రెండు ఎఫ్‌ఐఆర్‌లు!
14 నెలల వ్యవహారంపై మూడు రోజుల్లోనే ఇంత హడావిడి ఎందుకు?
👉జనసేన ప్రధాన కార్యాలయంలో ప్రైవేటు కంపెనీ కార్యకలాపాలు, నిరుద్యోగుల నుంచి వసూళ్లు జరిగాయనే అంశాలను ఎందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడం లేదు?
👉పార్టీ కార్యాలయ సీసీటీవీ దృశ్యాలు, సందర్శకుల వివరాలు, ఉద్యోగుల హాజరు రికార్డులను పరిశీలిస్తే అసలు విషయాలు బయటపడవా?
👉కేకే చూపించిన రూ.8 లక్షల రసీదు, ప్రస్తావించిన రూ.9 లక్షల లావాదేవీ, పెద్దిరాజుకు సంబంధించిన రూ.1.49 కోట్ల వ్యవహారం.. ఇవన్నీ డబ్బుల జాడను గుర్తించడానికి ఆధారాలే కదా!
👉మరి మొత్తం రూ.7.5 కోట్లు ఎవరి నుంచి ఎవరికి చేరాయో ఎందుకు తేల్చడం లేదు?
👉ఒక ఉద్యోగిని మాత్రమే బాధ్యురాలిని చేసి, అసలు పెద్ద తలకాయలను తప్పించడానికి ప్రయత్నిస్తున్నారనే సందేహాలకు చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?
👉జనసేన నాయకుల పేర్లు వినిపిస్తున్న ఈ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించే విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
👉మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వైయస్సార్‌సీపీపై ఎదురుదాడి చేస్తే అసలు విషయం మరుగునపడిపోదు.
🛑అందరూ అడుగుతున్నది ఒక్కటే.
రూ.7.5 కోట్లు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి? జనసేన ప్రధాన కార్యాలయంతో ఈ వ్యవహారానికి ఉన్న సంబంధం ఏమిటి?
కంపెనీ యాజమాన్యం, పార్టీ నాయకుల పాత్రపై విచారణ ఎందుకు జరగకూడదు? బాధితుల డబ్బులు ఎప్పుడు తిరిగి ఇప్పిస్తారు?
👉అందుకే ఈ కేసులో సీబీఐ విచారణ లేదా హైకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలి. ప్రతి రూపాయి లెక్క తేలాలి. అసలు సూత్రధారులెవరైనా బయటకు రావాలి.
👉ఇది కేవలం రూ.7.5 కోట్ల వ్యవహారం కాదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన 36 కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం.
👉 వారికి ఉద్యోగాలు రాలేదు. ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదు. కనీసం న్యాయమైనా జరుగుతుందా?
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలి.
వేళ్లన్నీ కోట రుక్మిణీ వైపే
- ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన పవన్ సన్నిహితురాలు
- స్కామ్ బయటపడడంతో సాధారణ ఉద్యోగిని ఇరికించిన కోట రుక్మిణీ అండ్ గ్యాంగ్
జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కమ్ పీఏ కోట రుక్మిణి అవినీతి బండారం బయట్టబయలు అయ్యింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నిహితురాలు కోట రుక్మిణీ అండ్ టీమ్ కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారు.
స్కామ్ బయటపడడంతో ఈ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు అధికార బలాన్ని ఉపయోగించి, తమ సంస్థలో సాధారణ ఉద్యోగిగా పనిచేసిన బోడపాటి ధరణి కృష్ణను బలిపశువును చేయడానికి సిద్ధపడ్డారు.
బాధితురాలు ధరణి కృష్ణ వీడియో, ఆమె తల్లి గార్గ నాగమణి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తో జనసేన నాయకురాలు కోట రుక్మిణీ అవినీతి భాగోతం బయటపడింది.
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు (కేకే), సంస్థ డైరెక్టర్‌గా ఉన్న కోట రుక్మిణి, పెద్దిరాజు కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.7 కోట్లు వసూలు చేశారు.
ఈ వ్యవహారం బయటపడడంతో కోట రుక్మిణి ఈ కేసు నుంచి బయటపడేందుకు, తన వద్ద కేవలం 'హెచ్‌ఆర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్'గా పనిచేసిన ధరణి కృష్ణను ఇరికించారు.
సంస్థలో ఉద్యోగి అయిన ధరణికి ఎలాంటి వాటాలు గానీ, డైరెక్టర్ పదవి గానీ, యాజమాన్య హక్కులు గానీ లేవని ఆమె స్పష్టం చేస్తూ, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ధరణి కృష్ణ తల్లి నాగమణి హైకోర్టును ఆశ్రయించారు.
నవంబర్ 11న అరగంట వ్యవధిలోనే కేకే ఇచ్చిన ఫిర్యాదుతో, కోట రుక్మిణి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో మరొకటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ రెండింటిలోనూ అసలు నిర్వాహకులను కాకుండా సాధారణ ఉద్యోగి అయిన ధరణి కృష్ణనే ప్రధాన నిందితురాలిగా (A1) చేర్చింది కోట రుక్మిణీ గ్యాంగ్
జనసేన నాయకుల ఒత్తిడితో పోలీసులు తనను అన్యాయంగా అరెస్టు చేసి, మంగళగిరి రూరల్ పీఎస్, హైదరాబాద్, గుంటూరు సీసీఎస్ చుట్టూ తిప్పుతూ దారుణంగా కొట్టారని ధరణి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
కేకేకు పార్టీలో కొందరితో ఉన్న విభేదాల కారణంగా, వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించేందుకు పోలీసులతో తనను కొట్టించి కేకే వీడియో తీయించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్ అండదండలతోనే కోట రుక్మిణి అండ్ గ్యాంగ్ కోట్ల రూపాయల స్కామ్‌లకు తెగబడింది. స్కామ్ బయటపడడంతో అధికారాన్ని ఉపయోగించుకొని అమాయక ఉద్యోగిని ఇరికించి తప్పుకుంటున్నారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపి అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
చంద్రబాబుకు తెలిసిందల్లా.. వ్యక్తిత్వ హననాలే
- కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలికాచుకోవడమే..
- ప్రత్యర్థి కుటుంబాల మహిళలపై నీచమైన ట్రోల్స్ నడపడంలో తండ్రికి తగ్గ కొడుకుగా @naralokesh తయారయ్యాడు
షర్మిల వ్యక్తిగత జీవితంపై నీచమైన ప్రచారాలు ట్రోల్స్ నడిపింది @JaiTDP వారే.. బాలకృష్ణ బిల్డింగ్ నుంచే..
ఇది విను @Telugu360 కొల్లి గోపాల్ 👇
చెట్టాపట్టాల్...
ఈ కథనం వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంది.
అత్యున్నత సమావేశం తర్వాతనే ఈ కథనానికి ఆమోదముద్ర పడిందని చెబుతున్నారు.
ఈ కథనంతో షర్మిలపై మానసిక దాడి చేయడమే లక్ష్యమా?
#YSSharmila #ysjagan
సోషల్ మీడియాలో మహిళలపై.. టీడీపీ సైకోల వికృత దాడులు
టీడీపీ, జనసేన పార్టీల సైకోలు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులనే కాకుండా సామాజిక కార్యకర్తలు, తారలను సైతం వేధింపులకు గురిచేస్తున్నారు.
ఇటీవల ట్విట్టర్ స్పేస్‌లో జనసేన ఇన్‌ఫ్లుయెన్సర్లు వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను అత్యంత దారుణమైన పదజాలంతో దూషించడం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కనీస సంస్కారం ఉన్నవాళ్లెవరూ కూడా అటువంటి దూషణలను సమర్థించరు.
ఒకవైపు పవన్ కల్యాణ్–అన్నా లెజినోవా విడాకుల వ్యవహారంలో ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దంటూ వైఎస్సార్‌సీపీ తన క్యాడర్‌కు ఒక నోట్‌ను విడుదల చేసి హుందాగా వ్యవహరిస్తే.. జనసేనకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసిన వ్యాఖ్యలు వారి కుసంస్కారాన్ని బట్టబయలు చేశాయి.
ఇటీవల జెడ్పీటీసీగా పోటీ చేసిన బొత్స కుమార్తె అనూష ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను మార్ఫింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె గొంతును అనుకరిస్తూ పోస్టులు పెట్టి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూష సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన, క్రాప్ చేసిన వీడియోలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
కాగా, విశాఖలో కొండలను బోడిగుండులుగా మార్చడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ నటి చాందినీ చౌదరి (@iChandiniC) సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వైజాగ్ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆమె వాపోయారు. చాందినీ వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులుముతూ కొందరు సైకోలు ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించారు.
సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సమస్యపై స్పందించి అభిప్రాయం వ్యక్తం చేసినా.. అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపినా.. కూటమి సైకోలు వెంటనే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికగా దాడులు చేస్తున్నారు. వారి ఉన్మాదం గతంలో గీతాంజలి వంటి సోషల్ మీడియా యాక్టివిస్టులను బలితీసుకున్న నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
లోకేష్ రెండో బిడ్డకు అడ్డు ఎవరు..?
- బ్రహ్మణినా..? భువనేశ్వరీనా..? చంద్రబాబా..?
జనాభా తగ్గిపోతోందని, పాపులేషన్ పెంచాలని ఇటీవల పబ్లిక్ మీటింగ్స్‌లో ప్రజలకు పిలుపునిస్తున్నారు సీఎం చంద్రబాబు.
జనాభా పెరుగుదలకు ఇటీవలే ఒక స్కీమ్ కూడా ప్రకటించారు. మూడో సంతనానికి రూ.30 వేలు, నాల్గవ సంతనానికి రూ. 40 వేలు ఇస్తాం అని నగదు ప్రోత్సాహం అనౌన్స్ చేశారు.
ఇప్పుడా పాపులేషన్ పెంపకం చర్చ చంద్రబాబు ఇంటికి చుట్టుకుంది.
చంద్రబాబు నాయుడు ఒక్కర్నే కన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌కు కూడా ఒక్కడే కొడుకు.. మరి సామాన్యులు మాత్రమే నలుగురైదుగురిని కనాలా..?
ఈ చర్చ జోరుగా కొనసాగుతున్న సమయంలో.. బాబు కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయం పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
లోకేష్ రెండో బిడ్డ కోసం నారా కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది.
రెండో బిడ్డను కనేందుకు బ్రహ్మణీ అంగీకరించడం లేదని, ఇద్దరు ఉంటే ఒకరు పాలిటిక్స్, మరొకరు బిజినెస్ చూసుకోవచ్చని భువనేశ్వరి ఆలోచనగా వినిపిస్తోంది.
ఏదైనా ఒక్కరికే చెందాలని, రెండో సంతానం ఉంటే ఆల్రెడీ రామ్మూర్తి నాయుడు విషయంలో జరిగిన పరిణామాలను బ్రహ్మణీ గుర్తుచేస్తున్నారని, లోకేష్ కూడా భార్యకే సపోర్టు చేస్తున్నారని కరకట్ట కాంపౌండ్ సమాచారం.
ఈ విషయంపై అత్తాకోడళ్ల ఇద్దరి మధ్య తీవ్ర వైరుధ్యం నెలకొందని ప్రచారం జరుగుతోంది.
ఒక్కరు వద్దు.. ముగ్గురు ముద్దు అంటున్న చంద్రబాబు.. తన కుటుంబంలో జరుగుతున్న వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలంటున్నారు ఈ వార్త తెలుసుకున్న జనం
ఎన్టీఆర్‌ను అవమానించిన రామోజీనే బాబుకు దేవుడు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై అతి నీచంగా కార్టూన్‌లు వేయించిన రామోజీరావు జయంతి నేడు ఏపీలో రాష్ట్ర పండుగ అయ్యింది
ఎన్టీఆర్‌పై దారుణమైన కార్టూన్‌లు గీసిన శ్రీధర్ చంద్రబాబు ప్రభుత్వ సలహాదారు అయ్యాడు
ఇదీ ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఇచ్చే గౌరవ మర్యాదలు
పిల్లనిచ్చి, ఎమ్మెల్యే, మంత్రి పదవులిచ్చిన ఎన్టీఆర్ కంటే.. వెన్నుపోటుకు సహకరించిన రామోజీనే చంద్రబాబుకు దేవుడయ్యాడు
భోగాపురంలో ఎలుగెత్తిన రైతు
- బాబు, లోకేష్ భూ దందాపై “స్థానికం”లో వ్యతిరేక ఓటు
- భోగాపురం మండల కేంద్రంలో రెండు ఎంపీటీసీలు రైతులకే
- మండలంలో మెజార్టీ స్థానాలు వైయస్సార్ సీపీకి
స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆర్థికబలం, అధికార బలం, రౌడీయిజం.. ఇవన్నీ ప్రదర్శించినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు సుస్పష్టంగా బయటకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే ఇవన్నీ బయటకు వస్తున్నాయి.
భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో టీడీపీ చేసిన ప్రచార హడావిడి అంతా ఇంతా కాదు. తన పాలనా కాలంలో ఎయిర్ పోర్టు కోసం ఒక్క అనుమతి కూడా తీసుకురాని చంద్రబాబు అంతా తానే చేసినట్టుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైయస్సార్‌సీపీ కృషిని, ఆ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా నిర్మాణాలు పూర్తైన అంశాన్ని మరుగున పరిచే ప్రయత్నం చేశారు.
కానీ, విశేషం ఏంటంటే.. భోగాపురం మండలంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ చాలా దెబ్బతింది. 16 ఎంపీటీసీలకుగాను టీడీపీ + జనసేన కూటమి చెరో మూడు స్థానాలకే పరిమితం అయ్యింది. వైయస్సార్ సీపీ-6 ఎంపీటీసీలను గెలుచుకోగా, రైతు సంఘాలకు చెందిన వాళ్లు ఇద్దరు గెలుపొందారు.
ముఖ్యంగా భోగాపురం మండల కేంద్రంలోని 3 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగితే అన్ని చోట్లా టీడీపీ, జనసేన ఓడిపోయాయి.
ఈ మూడింటిలో రెండు రైతు సంఘాలు గెలుచుకోగా, ఒకటి వైయస్సార్ సీపీ గెలుచుకుంది. భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీప గ్రామాల్లోనూ వ్యతిరేక ఓటు బలంగానే కనిపించింది.
పరిశ్రమల పేరిట రైతుల భూములను దారుణంగా లాక్కోవడంతో పాటు స్థానికులను తీవ్రంగా వేధించడమే దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
భోగాపురం మండల కేంద్రంలో 2 ఎంపీటీసీల్లో రైతు సంఘాల గెలుపును తేలిగ్గా తీసుకోలేమని స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏకగ్రీవాల బిజినెస్
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు బిజినెస్ గా మలుచుకున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాల అక్రమాల దందా ఇప్పుడు గ్రామ పంచాయతీలను కూడా తాకింది.
రాయలసీమకు చెందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పంచాయతీ ఎన్నికలను ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. ఆర్థికంగా బలమైన సర్పంచ్ అభ్యర్థుల వద్ద భారీగా డబ్బులు వసూలు చేస్తూ, వారికి ఏకగ్రీవం చేయిస్తున్నారు.
గతంలో మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఇలాంటి బిజినెస్సే చేశారు.
➡️ మున్సిపల్ చైర్మన్‌కు రూ.5 కోట్లు
➡️ జెడ్పీ చైర్మన్‌కు రూ.15 కోట్లు
➡️ జెడ్పీటీసీ నుంచి రూ. 1 కోటి చొప్పున వసూలు చేశారు. ఈ డబ్బును ఎమ్మెల్యేలు, స్థానికంగా ఈ అరాచకాలను కాపాలాకాసి, సహకరించిన పోలీసులు పంచుకున్నారు.
ఈ ఏకగ్రీవాల బిజినెస్‌కు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా తన పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇవ్వడం కొసమెరుపు.
చంద్రబాబు ఆదేశాల మేరకే మంత్రులు, కూటమి నేతలు రంగంలోకి దిగి గ్రామాల్లో భయాందోళనలు సృష్టిస్తూ ప్రజాస్వామ్యానికి పాతరవేస్తున్నారు.
పార్టీలకు అతీతంగా, గుర్తులు లేకుండా జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వైయస్సార్‌సీపీ సానుభూతిపరులు నామినేషన్లు వేయకుండా స్వయంగా మంత్రి అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నామినేషన్లు దాఖలు చేసే కనీస హక్కు కోసం అభ్యర్థులు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
చట్టాన్ని, ఎన్నికల నిబంధనలను కాపాడాల్సిన కొందరు పోలీసులు అధికార కూటమికి ఏజెంట్లుగా మారిపోయారు.
ఏకగ్రీవాల పేరుతో వసూలు చేసిన సొమ్మును కూటమి నేతలు, పోలీసులు పంపకాలు చేసుకుంటున్నారు. ఇది చంద్రబాబు కనిపెట్టిన కొత్త వ్యాపార ఫార్ములా..
రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని, గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైయస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది.
సోనియాగాంధీ పుస్తకం.. పచ్చ సైకోల వీరంగం
- వైఎస్సార్, వైఎస్ జగన్‌లపై తప్పుడు ప్రచారం
- లోకేష్ ఆదేశాలతో ఫేక్ ప్రచారం.. కాంగ్రెస్‌కు తాము దగ్గరగా ఉన్నామనే సంకేతం ఇచ్చిన టీడీపీ
సోనియా గాంధీ తాజాగా విడుదల చేసిన తన స్వగతం ''Belonging: A Journey of Love'' నవంబర్ 10న మార్కెట్‌లోకి వచ్చిందో లేదో.. పచ్చ ముఠాలు కట్టుకథలు అల్లేశాయి.
వైఎస్ జగన్, వైఎస్సార్ వ్యక్తిత్వాలను హననం చేయడమే లక్ష్యంగా కట్టుకథలు రాసి తమ ఫేక్ ఫ్యాక్టరీల ద్వారా ఆ విషాన్ని ప్రజలకు పంచే ప్రయత్నం చేస్తున్నాయి.
నిజంగా అలాంటి సంగతులు ఆ పుస్తకంలో రాశారా..? అన్నట్టుగా ఈ ఫేక్ స్టోరీలు నడిపిస్తున్నాయి.
వాస్తవంగా సోనియాగాంధీ పుస్తకంలో మొత్తం 7 చాప్లర్లు ఉన్నాయి. ఆ ఏడు చాప్టర్లలో కూడా ఎక్కడా వైఎస్సార్ గురించి గాని, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు.
పుస్తకం ఆసాంతం చూసినా ఎక్కడా ఆ విషయాలే లేవు. వైఎస్సార్ మరణం, ఆ తర్వాత అధికార బాధ్యతల్లో వచ్చిన మార్పులు దేనిపైనా పుస్తకంలో ప్రస్తావన లేదు.
అయినా, ఆ అంశాలన్నీ ఉన్నట్టుగా, ఒక కల్పిత కథను సృష్టించి దారుణమైన ప్రచారం చేస్తోంది పచ్చ సైకో ముఠా.
తద్వారా కాంగ్రెస్‌కు తాము అతి దగ్గరగా ఉన్నామని టీడీపీ చెప్పకనే చెప్తోంది.
వైఎస్సార్ పోయిన తర్వాత జగన్‌ను సీఎం ఎందుకు చేయలేదో విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన సోనియా గాంధీ!
#YSJagan #YSR #YSRCP #SoniaGandhi #JourneyofLove #YSRajasekharaReddy #APPolitics #JaganPolitics #CongressParty #Rosaiah #YSRFamily #SoniaGandhiBook #PoliticalHistory #thinkandhra
వేళ్లన్నీ కోట రుక్మిణీ వైపే
- ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన పవన్ సన్నిహితురాలు
- స్కామ్ బయటపడడంతో సాధారణ ఉద్యోగిని ఇరికించిన కోట రుక్మిణీ అండ్ గ్యాంగ్
జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కమ్ పీఏ కోట రుక్మిణి అవినీతి బండారం బయట్టబయలు అయ్యింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నిహితురాలు కోట రుక్మిణీ అండ్ టీమ్ కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారు.
స్కామ్ బయటపడడంతో ఈ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు అధికార బలాన్ని ఉపయోగించి, తమ సంస్థలో సాధారణ ఉద్యోగిగా పనిచేసిన బోడపాటి ధరణి కృష్ణను బలిపశువును చేయడానికి సిద్ధపడ్డారు.
బాధితురాలు ధరణి కృష్ణ వీడియో, ఆమె తల్లి గార్గ నాగమణి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తో జనసేన నాయకురాలు కోట రుక్మిణీ అవినీతి భాగోతం బయటపడింది.
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు (కేకే), సంస్థ డైరెక్టర్‌గా ఉన్న కోట రుక్మిణి, పెద్దిరాజు కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.7 కోట్లు వసూలు చేశారు.
ఈ వ్యవహారం బయటపడడంతో కోట రుక్మిణి ఈ కేసు నుంచి బయటపడేందుకు, తన వద్ద కేవలం 'హెచ్‌ఆర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్'గా పనిచేసిన ధరణి కృష్ణను ఇరికించారు.
సంస్థలో ఉద్యోగి అయిన ధరణికి ఎలాంటి వాటాలు గానీ, డైరెక్టర్ పదవి గానీ, యాజమాన్య హక్కులు గానీ లేవని ఆమె స్పష్టం చేస్తూ, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ధరణి కృష్ణ తల్లి నాగమణి హైకోర్టును ఆశ్రయించారు.
నవంబర్ 11న అరగంట వ్యవధిలోనే కేకే ఇచ్చిన ఫిర్యాదుతో, కోట రుక్మిణి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో మరొకటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ రెండింటిలోనూ అసలు నిర్వాహకులను కాకుండా సాధారణ ఉద్యోగి అయిన ధరణి కృష్ణనే ప్రధాన నిందితురాలిగా (A1) చేర్చింది కోట రుక్మిణీ గ్యాంగ్
జనసేన నాయకుల ఒత్తిడితో పోలీసులు తనను అన్యాయంగా అరెస్టు చేసి, మంగళగిరి రూరల్ పీఎస్, హైదరాబాద్, గుంటూరు సీసీఎస్ చుట్టూ తిప్పుతూ దారుణంగా కొట్టారని ధరణి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
కేకేకు పార్టీలో కొందరితో ఉన్న విభేదాల కారణంగా, వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించేందుకు పోలీసులతో తనను కొట్టించి కేకే వీడియో తీయించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్ అండదండలతోనే కోట రుక్మిణి అండ్ గ్యాంగ్ కోట్ల రూపాయల స్కామ్‌లకు తెగబడింది. స్కామ్ బయటపడడంతో అధికారాన్ని ఉపయోగించుకొని అమాయక ఉద్యోగిని ఇరికించి తప్పుకుంటున్నారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపి అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
అప్పుల్లో రాష్ట్రం.. చంద్రబాబు మరో దుబారా
భద్రతా కాన్వాయ్ పేరుతో కొత్త వాహనాలు.. ప్రభుత్వ ఖజానాకు గండీ
6 కొత్త అర్బానియా వాహనాల కొనుగోలుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
రూ.1.78 కోట్లతో అర్బానియా వాహనాల కొనుగోలుకు అనుమతి
గతంలో వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధ ఉత్తర్వులకు సడలింపు
పెట్టుబడుల సదస్సా?.. పబ్లిసిటీ షోనా?
- భారీ ప్రచారం.. సదస్సుకు పారిశ్రామిక వేత్తలు దూరం
పెట్టుబడులపై చంద్రబాబు కట్టుకథలు పారిశ్రామికవేత్తలను బాగానే తాకినట్టు ఉన్నాయి. విశాఖ వేదికగా నిన్న, ఇవాళ నిర్వహించిన భాగస్వామ్య సదస్సు అట్టర్ ఫ్లాప్ అయ్యింది
ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తారనే ఉద్దేశంతో భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే అమిత్ షా దీనికి పెద్దగా ఆసక్తి చూపలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతగా పేరులేని పారిశ్రామిక వేత్తలే ఈ భాగస్వామ్య సదస్సులో కనిపించారు. చెప్పుకోదగ్గ ఒప్పందాలేవీ లేకపోవడంతో అమిత్ షా ఆసక్తి చూపలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి.
డెలిగేట్ల కోసం దాదాపుగా 300 కార్లను ప్రభుత్వం సిద్ధం చేస్తే, అందులో 200 కార్లు డెలిగేట్స్ లేక ఖాళీగా ఉండిపోయాయి. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
భాగస్వామ్య సదస్సు జరుగుతున్న ఏయూ ప్రాంగణంలో డెలిగేట్లను ఉద్దేశించిన సీట్లన్నీ ఖాళీగా ఉండిపోయాయి. దీంతో విశాఖలోని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలు, గీతం, కృష్ణ, ఉమెన్స్ కాలేజీల నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ఆ సీట్లన్నీ నింపారు.
సదస్సు ముగింపురోజైన ఇవాళ సీట్లన్నీ కూడా ప్రైవేట్ కాలేజీల విద్యార్థులతోనే నింపారు. సభ వెలుపల తాత్కాలిక గ్రీన్ కార్పెట్ పై వీళ్లంతా సేదదీరడం కూడా కనిపించింది.
చివరకు డెలిగేట్ల కోసం తీసుకున్న హోటల్ గదులన్నింటినీ కూడా వీరితో నింపేశారు. ఈరకంగా భాగస్వామ్య సదస్సు అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
కాకపోతే ఏదో జరిగిపోయిందని ప్రజలను నమ్మించడానికి ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను తీసుకువచ్చారు.
హైదరాబాద్ నుంచి కూడా పదుల సంఖ్యలో జర్నలిస్టులను తీసుకువచ్చారు. వీరికి విమాన టిక్కెట్లు, హోటల్ గదులతో సరిపడా చేతి చమురు వదిలింది.
పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా సినీ నటుడు రానాతో లోకేష్ ఇంటర్వ్యూ చేయడం విశేషం. వీళ్లకు ఎదురుగా డెలిగేట్లకు బదులు ప్రైవేట్ కాలేజీల స్టూడెంట్లను కూర్చోబెట్టారు.
వైఎస్ జగన్ నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అంబానీ, అదానీ, బంగర్లు లాంటి భారీ పారిశ్రామికవేత్తలు వస్తే, చంద్రబాబు హయాంలో అలాంటివారు మచ్చుకైనా కనిపించలేదు.
విశాఖ సీఐఐ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్!
- రెడ్‌బుక్ ఎఫెక్ట్‌కు మొహం చాటేసిన పారిశ్రామిక వేత్తలు
రెస్పాన్స్ వీక్ అయినా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో చంద్రబాబు పబ్లిసిటీ
విశాఖ సీఐఐ సదస్సు పేరుతో మరోసారి చంద్రబాబు ప్రభుత్వం ప్రచార విన్యాసాలు
వేలాది మంది గీతం యూనివర్సిటీ విద్యార్థులు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో సదస్సు ప్రాంగణాన్ని నింపేసిన విశాఖ టీడీపీ లీడర్లు
ఇన్‌స్టాలో రీల్స్ ద్వారా బయటపడిపోయిన భాగోతం
Mr. Lokesh, is this the CII Partnership Summit or the Celebrity Partnership Summit?
Rana brings the podcast. Upasana brings the compliments. Who brings the investments? @naralokesh
విశాఖలో ''టీడీపీ షో టైమ్'' విన్యాసాలు!
సీఐఐ సమ్మిట్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్లు, కాలేజీ విద్యార్థులకు సూట్లు, బూట్లు వేసి డెలిగేట్లుగా ప్రచారం
జగన్ హయాంలో వచ్చిన పెట్టుబడులకు కొత్త ఎంవోయూలు
ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తో ప్రజలను భ్రమల్లో పెట్టడంలో దిట్ట అయిన సీఎం చంద్రబాబు.. విశాఖ సీఐఐ సదస్సు పేరుతో మరోసారి తన ప్రచార విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు.
సీఐఐ సదస్సు అట్టర్ ఫ్లాప్ కావడంతో గీతం యూనివర్సిటీ విద్యార్థులను, డబ్బులు తీసుకుని రీల్స్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లను సదస్సుకు తీసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాలేజీ విద్యార్థులు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు సూట్లు, బూట్లు వేయించి పారిశ్రామికవేత్తలుగా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వారు తీసుకున్న రీల్స్‌తోనే ఈ వ్యవహారం బయటపడిందనే వాదన వినిపిస్తోంది.
విద్యార్థులను సదస్సుకు తరలించేందుకు ఆంధ్ర యూనివర్సిటీ గేట్లకు తాళాలు వేయించారనే విమర్శలు వస్తున్నాయి. తరగతులకు వెళ్లేందుకు విద్యార్థులు గేట్లు, గోడలు దూకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులనే చంద్రబాబు, లోకేష్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకున్న రెన్యూ పవర్, ఏబీసీ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, ఎన్టీపీసీ సంస్థలతో మళ్లీ ఎంఓయూలు చేసుకుని కొత్త పెట్టుబడులుగా చూపిస్తున్నారు.
గతంలో లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు, లోకేష్.. వాస్తవంగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అనే లెక్కలను ఇప్పటికీ బయటపెట్టడం లేదు.
గత ఒప్పందాల్లో పెట్టుబడి ప్రతిపాదనలు తగ్గినా తమ విజయంగా ప్రచారం చేసుకుంటున్నారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పెట్టుబడి ప్రతిపాదన రూ.30 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లకు, రెన్యూ పవర్ ప్రతిపాదన రూ.97,500 కోట్ల నుంచి రూ.82 వేల కోట్లకు తగ్గింది.
గతంలో 2016 సీఐఐ సదస్సులోనూ టీ స్టాల్ నిర్వాహకులకు సూట్లు, బూట్లు వేయించి ఎంఓయూలు కుదుర్చుకున్నారనే విమర్శలు వచ్చాయి.
2017లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసిన చంద్రబాబు.. నరసరావుపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దొడ్డాల సుధీర్‌తోనూ ఎంఓయూ కుదుర్చుకున్నారు.
అదే ఏడాది అనకాపల్లికి చెందిన లంక త్రిలోక్ కుమార్ అనే వ్యక్తి 'గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్' పేరుతో రూ.5 కోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆయన గతంలో విలేకరులకు ప్రెస్‌నోట్లు అందించేవారని పేర్కొంటున్నారు.
ప్రజాధనంతో నిర్వహించే పెట్టుబడుల సదస్సులను ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలుగా మార్చుతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఈవెంట్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై భారీగా ఖర్చు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పారిశ్రామికవేత్తల ముసుగులో బినామీలకు విశాఖలో అత్యంత విలువైన భూములను నామమాత్రపు ధరలకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 99 పైసలకే భూములు కేటాయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖలో రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల విలువైన 3 వేల ఎకరాలకు పైగా భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించారని, వాటి ద్వారా వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ హయాంలో చేపట్టిన రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు, భోగాపురం విమానాశ్రయం, ఫిషింగ్ హార్బర్లను తమ విజన్‌గా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందనే విమర్శలు ఉన్నాయి.
రెడ్‌బుక్ పాలనలో స్కామ్‌లు, దాడులు, అరాచకాల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్‌లో విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాలవారీగా స్థానిక పరిశ్రమలు, వాటి విస్తరణ అవకాశాలపై సదస్సులో చర్చిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ అంశాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
కొత్త పెట్టుబడుల పేరుతో ప్రచార ఆర్భాటాలు చేయడం కాదు. గత ఎంఓయూల అమలు పరిస్థితి, వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు, ప్రారంభమైన పరిశ్రమలు, స్థానిక యువతకు కల్పించిన ఉద్యోగాల వివరాలను చంద్రబాబు ప్రభుత్వం బహిర్గతం చేయాలి.
విశాఖలో సూట్లు, బూట్లు.. లక్షల కోట్ల పెట్టుబడుల మాటలు! ప్రచారం పీక్.. పర్ఫార్మెన్స్ వీక్! ఎంఓయూల హడావుడి కాదు.. వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలు చెప్పాలి.
విశాఖ CII సమ్మిట్ లో ఇదీ పరిస్థితి
చీరలు, డ్రెస్సులు అమ్ముకునే Insta రీల్స్ చేసే వారితో CII సమ్మిట్ ప్రచారం చేసుకునే స్థాయికి దిగజారిన ప్రభుత్వం
భాగస్వామ్య సదస్సులు – ప్రచారం – వాస్తవ ఫలితాలు
- పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చెబుతున్నవన్నీ కట్టుకథలే. ఆర్భాటాలు, పబ్లిసిటీ తప్ప సాధించింది ఏమీ లేదు.
- చంద్రబాబు నిర్వహించే భాగస్వామ్య సదస్సులు పబ్లిసిటీ ఈవెంట్లుగా మారాయి. ఆయన తీరు వల్ల వాటి విలువే పోయింది.
- రేపటి నుంచి విశాఖలో మరో పెట్టుబడుల సదస్సు. గత సదస్సుల్లో కుదుర్చుకున్న ఒప్పందాలు ఏమయ్యాయి? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?
- లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు. మరి ఏపీలో నిరుద్యోగిత రేటు దేశ సగటు కంటే ఎందుకు ఎక్కువగా ఉంది?
- జూలై–సెప్టెంబర్ 2026లో దేశ నిరుద్యోగిత రేటు 5.1 శాతం కాగా, ఏపీలో 7.8 శాతం. యువత నిరుద్యోగిత రేటు ఏకంగా 21.4 శాతం.
- పరిశ్రమల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 61 వేల ఎకరాలు, ఒక్క విశాఖలోనే 3 వేల ఎకరాలు కేటాయించారు. మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి?
- జూలై 21న లోక్‌సభలో మిథున్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం.. గత రెండేళ్లలో గ్రౌండ్ అయిన ప్రాజెక్టులు కేవలం 10 మాత్రమే.
- ఆ 10 ప్రాజెక్టుల్లో రెండు యూనిట్ల నిర్మాణమే పూర్తయింది. మిగిలిన ఎనిమిది నిర్మాణ దశలోనే ఉన్నాయి. మొత్తం అంచనా పెట్టుబడి రూ.6,962 కోట్లు.
- ఈ ప్రాజెక్టుల ద్వారా 22,167 ఉద్యోగాలు వస్తాయని అంచనా మాత్రమే. వాస్తవంగా కల్పించిన ఉద్యోగాలెన్నో చెప్పాలి.
- కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కూడా రెండున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చంద్రబాబు, ఆయన అధికారులు చెప్పలేకపోయారు.
- చంద్రబాబు కుదుర్చుకున్న ఎంఓయూలన్నీ కాగితాలకే పరిమితం. పెట్టుబడుల ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు.
- జగన్ హయాంలో వచ్చిన ఏటీసీ టైర్స్, డైకిన్, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలను మళ్లీ కొత్త పెట్టుబడులుగా చూపిస్తూ క్రెడిట్ చోరీ చేస్తున్నారు.
- భోగాపురం విమానాశ్రయం, రామాయపట్నం, మూలపేట పోర్టులు, బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రాజెక్టుల్లో జగన్ హయాంలో జరిగిన పనులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.
- టాటా పవర్, వెబ్‌సోల్ సహా రూ.16,248 కోట్ల విలువైన ఏడు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలు వెనక్కి వెళ్లాయి. వాటిని నిలబెట్టేందుకు ఏం చేశారు?
- పరిశ్రమలకు రూ.15 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాల బకాయిలు ఉంటే, సుమారు రూ.1,400 కోట్లకు మాత్రమే జీఓలు ఇచ్చారు. వాస్తవంగా ఎంత చెల్లించారు?
- జగన్ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ రంగాల్లో 6,31,310 ఉద్యోగాలు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తొలి ఆరు నెలల్లోనే 1.34 లక్షల పోస్టులు భర్తీ చేశారు.
- జగన్ హయాంలో అన్ని రంగాలు కలిపి 40 లక్షలకు పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. చంద్రబాబు కూడా రంగాలవారీగా లెక్కలు బయటపెట్టాలి.
- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. 29 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మిగిలిన 31 నెలల్లో ఎన్ని ఇవ్వబోతున్నారు?
- ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైంది? రెండేళ్లకు ఒక్కో అర్హుడికి రావాల్సిన రూ.72 వేలు ఎప్పుడు చెల్లిస్తారు?
- ఉద్యోగం పొందిన వ్యక్తి ఏ ఊరు, ఏ కంపెనీ, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనే వివరాలను గోప్యతను కాపాడుతూ ధ్రువీకరించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ కల్పన గణాంకాలను అందుబాటులో ఉంచాలి.
- ప్రతి కంపెనీకి కేటాయించిన భూమి, పెట్టుబడి, పరిశ్రమ ప్రారంభ తేదీ, స్థానికులకు కల్పించిన ఉద్యోగాల వివరాలను బహిర్గతం చేయాలి.
- లక్షల కోట్ల ఎంఓయూల ప్రచారానికి ఉపయోగించే డాష్‌బోర్డులోనే వాస్తవ పెట్టుబడులు, ప్రారంభమైన పరిశ్రమలు, ఉద్యోగ నియామకాల లెక్కలు చూపించాలి.
- కొత్త భాగస్వామ్య సదస్సుకు ముందే గత ఒప్పందాల అమలు పరిస్థితిపై చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
పబ్లిసిటీ పీక్.. పర్ఫార్మెన్స్ వీక్! లక్షల కోట్ల ప్రకటనలు కాదు.. వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు, యువతకు దక్కిన ఉద్యోగాల లెక్కలు బయటపెట్టాలి.
అరకు కాఫీకి వందేళ్లకు పైగా చరిత్ర
- అయినా ఆ ఘనత తనదే అంటూ చంద్రబాబు డాంబికాలు
- విశాఖలో పెట్టుబడుల సమ్మిట్ షోలో బాబు బొంబాయి మాటలు
అరకు కాఫీని తానే ప్రవేశపెట్టానని, తానే ప్రమోట్ చేశానంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి చరిత్రే సమాధానం చెబుతోంది. అరకు కాఫీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి దశాబ్దాల ముందే విశాఖ ఏజెన్సీలో కాఫీ సాగు విస్తరించింది.
2010 ఆగస్టు 5న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక పత్రం ప్రకారం, 1898లోనే బ్రిటిష్ అధికారి బ్రోడీ తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో కాఫీ సాగును ప్రవేశపెట్టారు. అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాఫీ సాగుకు పునాది పడింది.
1920 నాటికే జమీందార్లు, రెవెన్యూ అధికారులు, గిరిజన రైతుల ద్వారా విశాఖ ఏజెన్సీలో కాఫీ సాగు విస్తరించింది. అనంతగిరి, మినుములూరు, చింతపల్లి ప్రాంతాలకు కాఫీ సాగు వ్యాపించింది.
1950ల చివర్లోనే కేంద్ర కాఫీ బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో కాఫీ సాగు అభివృద్ధిపై అధ్యయనాలు ప్రారంభించింది. 1971లో గిరిజన రైతులకు సాంకేతిక సహాయం అందించేందుకు పాడేరులో కాఫీ బోర్డు విస్తరణ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 1976లో కాఫీ పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.
1956లోనే అరకు ప్రాంతంలో గిరిజన రైతుల ద్వారా కాఫీ సాగును ప్రోత్సహించేందుకు గిరిజన సహకార సంస్థ (GCC)ను కాఫీ బోర్డు భాగస్వామిగా నియమించింది.
1985లో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కాఫీ తోటల అభివృద్ధి జరిగింది. గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగు అభివృద్ధికి ప్రత్యేకంగా గిరిజన సహకార ప్లాంటేషన్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. అభివృద్ధి చేసిన కాఫీ తోటలను గిరిజన రైతులకు కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున అప్పగించారు.
అంటే చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన 1995 నాటికే అరకు ప్రాంతంలో కాఫీ సాగు, దానిని ప్రోత్సహించే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి.
మరి 1920 నాటికే విశాఖ ఏజెన్సీలో కాఫీ సాగు ఉన్నప్పుడు, చంద్రబాబు దాన్ని తానే ప్రవేశపెట్టానని ఎలా చెప్పుకుంటారు? చరిత్రను వక్రీకరించి ఇలాంటి పచ్చి అబద్ధాలు ఎలా చెబుతున్నారు?*
అరకు కాఫీ సాగు విస్తరణలో 2004–2009 కాలం కూడా కీలకమైనది. కేంద్ర ప్రభుత్వం 2010లో వెల్లడించిన గణాంకాల ప్రకారం, 1999–2000లో 15,900 హెక్టార్లుగా ఉన్న కాఫీ సాగు విస్తీర్ణం 2009–2010 నాటికి 42,700 హెక్టార్లకు పెరిగింది. అంటే దాదాపు 2.7 రెట్లు పెరిగింది.
అదే సమయంలో కాఫీ సాగు చేస్తున్న గిరిజన రైతుల సంఖ్య 23,500 నుంచి 78,000కు పెరిగింది. కాఫీ ఉత్పత్తి 2,245 మెట్రిక్ టన్నుల నుంచి 5,085 మెట్రిక్ టన్నులకు పెరిగింది. హెక్టారుకు ఆదాయం రూ.15,000–18,000 నుంచి రూ.30,000–36,000కు చేరింది.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న అరకు కాఫీని తానే ప్రవేశపెట్టానని చెప్పుకోవడం, తరతరాల గిరిజన రైతుల కష్టాన్ని, ప్రభుత్వ సంస్థల కృషిని తన ఖాతాలో వేసుకోవడమే.
చరిత్ర గిరిజన రైతులది.. కష్టం వారిది.. ఘనత మాత్రం చంద్రబాబుదా?
విశాఖ పెట్టుబడుల సదస్సులోనూ అవే డాంబికాలు! అరకు కాఫీ చరిత్రను కూడా తన ప్రచారానికి వాడుకుంటున్న చంద్రబాబు.
సీఐఐ సమ్మిట్‌లో అరకు కాఫీని రుచి చూసిన కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ | ABN Telugu
#CIISummit #ArakuCoffee #ABNTelugu
ఇదీ జనసైనికుల అసలు రంగు
మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అత్యంత జుగుప్సాకరమైన దూషణలు
పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారంపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని తమ పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆదేశాలు
మరోవైపు జగన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జనసేన కార్యకర్తల అసభ్య దూషణలు
ట్విట్టర్ స్పేస్‌లో హద్దులు దాటి.. జగన్ తల్లి, చెల్లి, భార్యను లక్ష్యంగా చేసుకుని అత్యంత నీచమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ మూడో భార్యతో విడాకుల నేపథ్యంలో నిన్న జనసేన కార్యకర్తల ట్విట్టర్ స్పేస్
ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొన్న జనసేనలోని వివిధ హోదాల్లో ఉన్న దాదాపు 350 మంది కార్యకర్తలు
Pen Andhra retweeted
ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఏమిటీ దుస్థితి?
గుంటూరు 71వ డివిజన్ మున్సిపల్ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు వాడే మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న విద్యార్థులు
#YSJagan హయాంలో #UNO వెళ్లి ప్రసంగిస్తే.. చంద్రబాబు హయాంలో బాత్రూంలు కడగాల్సిన దుస్థితి.
విద్యార్థుల దుస్థితిపై నెటిజన్లు, తల్లిదండ్రులు ఆగ్రహం







































