PS CHANDRAYANGUTTA retweeted
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానం అమలుపై హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వీ కర్ణన్, ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు బాటిల్‌నెక్స్, రోడ్డు విస్తరణ, డ్రైనేజీ తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
PS CHANDRAYANGUTTA retweeted
శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు: ట్రాఫిక్ & పార్కింగ్ అడ్వైజరీ
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 సందర్భంగా ఆగస్టు 02 నుండి ఆగస్టు 04వ తేదీ జాతర ముగిసే వరకు ఆలయం పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భక్తులు, వాహనాలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సౌకర్యవంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నారు.
01/02-08-2026 అర్ధరాత్రి 12:00 గంటల నుండి 04-08-2026 ఉదయం 03:00 గంటల వరకు మహంకాళి ఆలయం పరిసరాల్లోని పొగాకు బజార్, హమాలీ విగ్రహం, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ తదితర రహదారుల్లో సాధారణ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయబడతాయి. ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బాలా, ఘాస్మండి, బైబిల్ హౌస్, సీటీఓ, సంగీత్, వైఎంసీఏ, ఎస్బీఐ క్రాస్ రోడ్స్ తదితర ప్రధాన కూడళ్ల వద్ద పరిస్థితులను బట్టి ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.
జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ మాల్, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్, వెస్లీ కాలేజ్, నల్లగుట్ట జీహెచ్ఎమ్సీ గ్రౌండ్, ఇస్లామియా హైస్కూల్, ఓల్డ్ జైలు ఖానా ఖాళీ స్థలం తదితర ప్రదేశాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయబడినాయి.
నగరవాసులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 9010203626 ను సంప్రదించవచ్చు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం @HYDTP (Facebook) మరియు @HYDP (X) అధికారిక సోషల్ మీడియా వేదికలను అనుసరించాలని సూచించారు.
#Bonalu2026 #UjjainiMahankaliBonalu #TrafficAdvisory #TrafficDiversions #PlanYourJourney #Secunderabad #HyderabadCityPolice
🤖 Made with AI
PS CHANDRAYANGUTTA retweeted
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల బందోబస్తు చర్యల్లో భాగంగా మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ‘క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవస్థ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్, తదితరులు పాల్గొన్నారు.
#Bonalu2026 #SecunderabadBonalu #UjjainiMahankali #HyderabadCityPolice #AISurveillance #SafeBonalu #FestivalSecurity
PS CHANDRAYANGUTTA retweeted
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్
బోనాల ఉత్సవాల్లో తొలిసారిగా ఏఐ సాంకేతికతతో క్రౌడ్ మేనేజ్మెంట్
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన, అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ... భాగ్యనగరంలో ఆషాఢ బోనాల పండుగకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగియగా, ప్రస్తుతం శ్రీ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా అమ్మవార్ల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్, నిఘా వ్యవస్థను మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ ద్వారా ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే 'ఫేషియల్ రికగ్నిషన్' సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. దీనివల్ల పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను తక్షణమే గుర్తించి అప్రమత్తమయ్యే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
అలాగే ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్మెంట్ ద్వారా కచ్చితంగా లెక్కిస్తామని పేర్కొన్నారు. ఆలయం లోపల వివిధ విభాగాలు, క్యూలైన్లలో భక్తుల రద్దీ సాంద్రతను 'థ్రెషోల్డ్ మ్యాపింగ్' ద్వారా నిరంతరం విశ్లేషిస్తూ, పరిమితికి మించి రద్దీ పెరిగితే ముందస్తు చర్యల ద్వారా తొక్కిసలాటలు జరగకుండా నివారిస్తామని స్పష్టం చేశారు.
బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని, జాతర విజయవంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, ట్రాఫిక్-1 డీసీపీ శ్రీ అవినాశ్ కుమార్, ఐపీఎస్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
PS CHANDRAYANGUTTA retweeted
✳️సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
✳️విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లతో 'సైబర్ జాగరూకత దివాస్' అవగాహన సదస్సు
✳️అధికారులతో కలిసి ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్ ఆవిష్కరణ
➡️కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టి మోసపోవద్దని, విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. 'సైబర్ జాగరూకత దివాస్' పురస్కరించుకుని సిటీ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో బుధవారం విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనర్.. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు రతన్, మాలకొండయ్య, విశ్రాంత ఈఎన్సీ కరీంలతో కలిసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
➡️సదస్సులో సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయని తెలిపారు. నగరంలో ఒక ఏడాది కాలంలో దొంగతనాలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాల వల్ల రూ.30 కోట్ల నష్టం వాటిల్లితే.. ఒక్క సైబర్ నేరాల రూపంలోనే బాధితులు ఏకంగా రూ.400 కోట్లకు పైగా కోల్పొతున్నారని తెలిపారు. అంటే సగటున రోజుకు రూ.కోటికి పైగా ప్రజల సొమ్ము కేటుగాళ్ల ఖాతాల్లోకి మళ్లుతోందన్నారు. విశ్రాంత ఉద్యోగుల డిజిటల్, భౌతిక భద్రతకు నగర పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు.
➡️సీనియర్ సిటిజన్లను డిజిటల్ అరెస్టులు, పింఛను సేవలు, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు గురిచేస్తున్నారని వివరించారు. సీబీఐ, ఈడీ, ఆర్బీఐ లేదా పోలీసు అధికారులమని చెప్పి డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. మన చట్టాల్లో గానీ, పోలీసు వ్యవస్థలో గానీ ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానమే లేదని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి అలాంటి ఫోన్ కాల్స్ రాగానే భయపడకుండా వెంటనే కట్ చేయాలని సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు, ట్రేడింగ్ లింక్‌లను చూసి మోసపోవద్దన్నారు. షేర్ ట్రేడింగ్ ను సెబీ ఆమోదించిన రిజిస్టర్డ్ బ్రోకర్లు, అధీకృత డీమ్యాట్ ఖాతాల ద్వారానే చేయాలని చెప్పారు.
➡️ఇంట్లోని పిల్లలు ఫోన్లు తీసుకుని ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లలో సభ్యత్వం తీసుకోవడం వల్ల కూడా పెద్దల రిటైర్మెంట్ సొమ్ము మాయమవుతుందంటూ కొన్ని ఘటనలను గుర్తుచేశారు. బ్యాంకింగ్ వివరాలు, పిన్ నంబర్లు, ఓటీపీలను కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. ఒకవేళ అజాగ్రత్త వల్ల సైబర్ మోసానికి గురైతే, తక్షణమే స్పందించి గోల్డెన్ అవర్ లో 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే సమాచారం ఇస్తే బాధితుల సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.
➡️అనంతరం మాజీ డీజీపీ శ్రీ ఎమ్. రతన్ మాట్లాడుతూ.. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు తన ఖాతా నుంచి రూ. 5,000 కంటే ఎక్కువ మొత్తానికి చెక్కులు వచ్చినా, విత్‌డ్రాయల్స్ ఉన్నా తన ముందస్తు అనుమతి లేనిదే క్లియర్ చేయవద్దని బ్యాంకులకు స్వయంగా సూచించినట్లు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఓటీపీలను ఇతరులతో ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని ఆయన హెచ్చరించారు. సీనియర్ సిటిజన్లు తమ ఫోన్లను పిల్లల చేతికి ఇచ్చేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు తెలియక ఏదైనా బటన్ లేదా సందేహాస్పద లింక్‌ను నొక్కడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు.
➡️మరొక అతిథి, మాజీ డీజీపీ శ్రీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. సైబర్ నేరం జరిగిన తర్వాత బాధితులు ఎంత ఆవేదన పడినా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా పోగొట్టుకున్న డబ్బును తిరిగి సాధించడం చాలా కష్టమని పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల నష్టంతో పోలిస్తే రికవరీ అయ్యే మొత్తం అత్యంత స్వల్పం కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు పాటించడమే సైబర్ నేరాలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. అవగాహన లోపం వల్ల సీనియర్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉన్నత విద్యావంతులు సైతం కేటుగాళ్ల బురిడీ మాటలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధానమైన పొదుపు ఖాతాను వాడకుండా, తక్కువ మొత్తం ఉండేలా మరో ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరిచి దాన్ని మాత్రమే ఉపయోగించాలని సలహా ఇచ్చారు.
➡️అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని, అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల పౌరులు ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలన్నారు. నగరంలో సైబర్ నేరాల నియంత్రణకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు క్రైమ్ విభాగం నిరంతరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఒకవేళ సైబర్ మోసం జరిగితే బాధితులు స్వల్ప సమయంలోనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే త్వరితగతిన స్పందించేందుకు వీలవుతుందని చెప్పారు. మోసం జరిగిన వెంటనే సమాచారం అందిస్తే నేరస్థుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, బాధితుల సొమ్మును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.
➡️ఈ అవగాహన సదస్సులో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్ రమణా నాయక్, గౌరవ కార్యదర్శి రమేష్ మర్రి, డీసీపీలు శ్రీమతి శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీ రమణారెడ్డి, రాజేశ్, నగర సైబర్ క్రైమ్ విభాగ ఏసీపీ శ్రీ శివమారుతి, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
PS CHANDRAYANGUTTA retweeted
🇮🇳 **80 Years of Freedom. One Nation. One Spirit.** 🇮🇳
From the courage of our freedom fighters to the dreams of a new generation, India’s journey is a story of **strength, unity and hope.**
Hyderabad City Police wishes everyone a proud and inspiring 80th Independence Day 🇮🇳.
#SaluteOurHeroes #HappyIndependenceDay2026
PS CHANDRAYANGUTTA retweeted
Our brains remember repeated messages, even when they're false. Social Media Algorithms show you more of what you engage with. Seeing the same post repeatedly can make it feel true. Don't let repetition shape your reality verify first.
పదేపదే కనిపించే సమాచారం నిజమనే భావన కలిగించవచ్చు.సోషల్ మీడియా అల్గారిథమ్‌లు మీరు ఇష్టపడే కంటెంట్‌ను మరింత ఎక్కువగా చూపిస్తాయి. నమ్మే ముందు ధృవీకరించండి, తర్వాతే షేర్ చేయండి
#socialmediaalgorithms #fakenews #VerifyBeforeYouShare
PS CHANDRAYANGUTTA retweeted
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే గోల్కొండ ఆషాడ మాస బోనాల సందర్భంగా.. నేడు జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాను. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించాను.
ఉత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రత మా ప్రథమ కర్తవ్యం. ఈ నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశాను.
భక్తులంతా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
#Bonalu #GolcondaBonalu #HyderabadPolice #TelanganaCulture
PS CHANDRAYANGUTTA retweeted
A helping hand can save a life. Be a #RahVeer assist road accident victims during the Golden Hour and earn a ₹25,000 reward, Government recognition, and a Certificate of Appreciation.
#GoodSamaritan #RoadSafety #SaveLives
PS CHANDRAYANGUTTA retweeted
రాబోయే వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రజల రక్షణే ధ్యేయంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో నేడు సమావేశమయ్యాము.
గతంలో విద్యుత్ తీగలు తగిలి జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి విగ్రహాల తయారీ దశలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరాము.
విద్యుత్ తీగలు 22 అడుగులు, ట్రాలీ ఎత్తు 4 అడుగులను దృష్టిలో ఉంచుకుని, ఊరేగింపు కోసం విగ్రహాల ఎత్తును 15 అడుగుల లోపు మాత్రమే ఉండేలా తయారీదారులతో మాట్లాడి చొరవ చూపాలని సూచించాము.
ఊరేగింపు సమయంలో తక్కువ ఎత్తులో ఉండే విద్యుత్ తీగలను కర్రలతో లేదా పైపులతో పైకి లేపే ప్రమాదకర ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేశాము.
ప్రజల ప్రాణరక్షణే అత్యంత ముఖ్యం. పండుగను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు భక్తులకు, నిర్వాహకులకు హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం అన్ని విధాలా సహకరిస్తుంది.
#HyderabadCityPolice #GaneshUtsav2026 #PublicSafety
PS CHANDRAYANGUTTA retweeted
𝐄𝐯𝐞𝐫𝐲 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐡𝐚𝐬 𝐬𝐨𝐦𝐞𝐨𝐧𝐞 𝐰𝐚𝐢𝐭𝐢𝐧𝐠 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐝𝐞𝐬𝐭𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧 🏡.
#DriveSafe #RainSafety #RoadSafety #HyderabadCityPolice #SafetyFirst #MonsoonSafety #StayAlert #SaveLives
🤖 Made with AI
PS CHANDRAYANGUTTA retweeted
𝐎𝐍𝐄 𝐌𝐄𝐒𝐒𝐀𝐆𝐄 𝐂𝐀𝐍 𝐌𝐀𝐊𝐄 𝐇𝐘𝐃𝐄𝐑𝐀𝐁𝐀𝐃 𝐒𝐀𝐅𝐄𝐑.
Report Crime • Traffic Violations • Accidents • Emergencies.
#BeOurEyes
#BeOurVoice
#CitizenFirst
#SafeHyderabad
#TogetherForSafety
#PublicSafety
PS CHANDRAYANGUTTA retweeted
హబీబ్ నగర్ పి.ఎస్ పరిధిలోని మంగర్ బస్తీలో హైదరాబాద్ సిటీ పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్ – 'ఆపరేషన్ థండర్‌బోల్ట్' (Operation Thunderbolt) నిర్వహణ
•హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ గారి దిశానిర్దేశంలో రంగంలోకి దిగిన సాయుధ బలగాలు, ప్రత్యేక బృందాలు
•ఈ ఆపరేషన్‌లో అడిషనల్ సీపీ (L&O) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ మరియు అడిషనల్ సీపీ (Crimes & SIT) శ్రీ ఎస్. ఎం. శ్రీనివాస్, ఐపీఎస్ గార్ల ప్రత్యక్ష పర్యవేక్షణ
•టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, IPS గారి క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్: నగరంలో మత్తుపదార్థాల (NDPS) విక్రయాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం ఈరోజు తెల్లవారుజామున భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో.. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగర్ బస్తీ (Manganri Basti) లో ఈ ఉమ్మడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అత్యంత వ్యూహాత్మకంగా జరిగింది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ: ఈ రోజు తెల్లవారుజామున 03:30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ గారు మరియు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ & SIT) శ్రీ ఎస్. ఎం. శ్రీనివాస్, ఐపీఎస్ గారు స్వయంగా పాల్గొని పర్యవేక్షించి, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ ఆపరేషన్ మొత్తాన్ని టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, IPS గారు క్షేత్రస్థాయిలో ఉండి నేరుగా పర్యవేక్షించారు.
ఆపరేషన్‌లో పాల్గొన్న వివిధ విభాగాలు: ఈ భారీ దాడులలో కింది విభాగాలు సంయుక్తంగా పాల్గొని మంగర్ బస్తీని పూర్తిగా జల్లెడ పట్టాయి:
•హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (H-NEW) బృందాలు,టాస్క్ ఫోర్స్ (Task Force) బృందాలు,హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందాలు,సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) బృందాలు,సి.ఎ.ఆర్ (CAR) సాయుధ బలగాలు, మరియు స్థానిక సిటీ సివిల్ పోలీస్(1100 మంది పాల్గొన్నారు).
నేరస్థుల అరెస్ట్ మరియు భారీగా సొత్తు స్వాధీనం:
ఈ ఆకస్మిక తనిఖీలలో భాగంగా పోలీస్ బృందాలు బృందాలు విజయవంతంగా క్రింది నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి: 150 గంజాయి ప్యాకెట్లు, 32 దగ్గు సిరప్ సీసాలు, 1 కిలో ఎండు గంజాయి మరియు మద్యం సీసాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. ఆస్తి నేరస్థులు, గొలుసు దొంగలు (స్నాచర్లు) మరియు ఎన్బిడబ్ల్యూ (NBW) పెండింగ్‌లో ఉన్న అనుమానితులు కలిపి, మొత్తం 15 మంది డ్రగ్స్ నేరస్థులను మరియు 50 మంది అనుమానిత ఆస్తి నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని మరియు వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు హెచ్చరించారు.
జారీ చేసినవారు: కార్యాలయం: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ సిటీ.
PS CHANDRAYANGUTTA retweeted
➡️అలెర్ట్! ఎస్ఐఆర్-2026 పేరుతో సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది.
✳️మీ ఓటు ఎంత విలువైందో, మీ వ్యక్తిగత సమాచారం కూడా అంతే అత్యంత కీలకమైనది.
✳️ఎన్నికల అధికారులు ఎవరూ కూడా మీ ఓటీపీ అడగరనే విషయాన్ని దయచేసి గ్రహించండి.
✳️ఫోన్ కాల్స్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ మీ ఓటీపీలు లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
✳️ఒకవేళ మీకు ఏవైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే ఫోన్ కట్ చేసి, 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.
✳️మీరు నిర్లక్ష్యంగా పంచుకునే ఒకే ఒక్క ఓటీపీ మీ సొమ్మును, మీ వ్యక్తిగత సమాచారాన్ని సైతం తీవ్ర ప్రమాదంలోకి నెట్టివేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!
⚠️ Your vote is precious. So is your personal information. Don’t let scammers steal your identity in the name of SIR-2026.
Remember:
🔹 No election official will ask for your OTP.
🔹 Never share OTPs or banking details over phone calls.
🔹 Hang up, report suspicious calls to 1930, and spread awareness.
One OTP shared can put your money and personal data at risk.
#CyberAware #1930 #SafeVoting #StopFraud
PS CHANDRAYANGUTTA retweeted
Hyderabad Police Commissioner Sri V.C. Sajjanar Sir urges parents to monitor children's online gaming to prevent unauthorized purchases, cyber risks, and gaming disorders by using parental controls and open communication.#cyberawareness #onlinesafety #viralreels #onlinegamingbill
PS CHANDRAYANGUTTA retweeted
Easy profits, secret trading tips, guaranteed returns… sounds attractive, but it could be fraud.
⚠️ Be cautious of Telegram groups asking for money for trading or investments.
Stay alert. Stay safe.
#StopCyberFraud #TelegramTradingScam #DigitalSafety
PS CHANDRAYANGUTTA retweeted
➡️ఆన్లైన్ ఆటల ఉచ్చులో బాల్యం!!
➡️తల్లిదండ్రుల నిఘా లోపమే ప్రధాన కారణం
➡️చిన్నారుల గేమింగ్ ప్రమాదాలపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ
✳️'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఒక కీలకమైన అడ్వైజరీ జారీ చేశారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న అనేక ఫిర్యాదులు బయటకు కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వాటి వెనుక ముఖ్యంగా ఈ ఆన్ లైన్ గేములకు పిల్లలు బానిస కావడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు. చిన్నారుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి గేమింగ్ యాప్‌ల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, వీటి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకునేలా గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు సైతం లేఖలు రాస్తామని పేర్కొన్నారు.
✳️హ్యాకింగ్ కాదు.. సొంత బిడ్డల పనే!
మొబైల్‌కు వరుసగా డెబిట్ మెసేజ్‌లు రావడంతో తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని ఆందోళన చెందుతూ చాలామంది బాధితులు ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేశాక బయటపడే నిజం తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇస్తోంది. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ లేదా మోసపూరిత లింకులు లేవని, పిల్లలే 'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి ఫోన్లో సేవ్ చేసిన కార్డ్స్ లేదా యూపీఐ వివరాలను వాడేశారని తేలుతోంది. ముఖ్యంగా, తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా వేల రూపాయల లావాదేవీలు చేసేస్తున్నారు. ఇది సాంకేతికంగా నేరం కానప్పటికీ, కేవలం ఇంట్లో పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతోంది. ఇటువంటి అజాగ్రత్తల వల్ల అసలైన సైబర్ నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసుల విలువైన సమయం వృథా అవుతోంది.
✳️గేమ్ పరిచయం.. పక్క రాష్ట్రానికి పరుగు!
ఇటీవల జరిగిన మైనర్ బాలికల అదృశ్యం ఉదంతం.. ఆన్లైన్ ఆటలు, సోషల్ మీడియాతో పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి కళ్లకు కట్టింది. 'ఫ్రీ ఫైర్' గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు, ఆ తర్వాత సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. ఆన్లైన్ మాయలో పడిపోయి.. కేవలం ఇంటర్నెట్లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలి, పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే, పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో గమనించడం, వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడం ఎంత అత్యవసరమో ఈ సంఘటన తెలియజేస్తోంది.
✳️'స్టేటస్' కోసం దొంగచాటు ఖర్చులు!
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల లోపు విద్యార్థులు నేడు క్లాస్‌రూమ్‌ల కంటే 'ఫ్రీ ఫైర్, మ్యాక్స్' వంటి గేమింగ్ వర్చువల్ యుద్ధభూమిలోనే ఎక్కువగా గడుపుతున్నారు. స్నేహితుల మధ్య తమ స్టేటస్ కోల్పోకూడదనే తాపత్రయమే దీనికి కారణం. ఆటలో రేర్ ఐటమ్స్, రకరకాల ఆయుధాలు, 'ఎలైట్ పాస్' ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు దొంగచాటుగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఆన్లైన్ క్లాసుల పేరుతో చేతికి వచ్చిన ఫోన్లు, నేడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు బిజీగా ఉండటం, టెక్నాలజీపై వారికి తగినంత అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
✳️పసిమనస్సులను కబళిస్తున్న 'గేమింగ్ డిజార్డర్స్
అతిగా ఆన్లైన్ ఆటలు ఆడటం కేవలం అలవాటు మాత్రమే కాదు, ఒక భయంకరమైన మానసిక రుగ్మత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లోనే గుర్తించి దీనికి 'గేమింగ్ డిజార్డర్' అని నామకరణం చేసింది. ఆటలపై నియంత్రణ కోల్పోవడం, చదువు, నిద్ర, కుటుంబ సభ్యుల కంటే ఆటలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, నష్టాలు జరుగుతున్నా ఆట మానలేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. దీనివల్ల పిల్లల్లో తీవ్ర కోపం, దూకుడు ప్రవర్తన, చదువులో వెనుకబాటుతనం, నిద్రలేమి, కంటి సమస్యలు, సామాజిక దూరం పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఆటలను కఠినంగా నిషేధించడం దీనికి సరైన పరిష్కారం కాకపోవచ్చు. అది వారిలో మరింత ఉత్సుకతను పెంచి దొంగచాటుగా ఆడేందుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవడం, ఆటల సమయాన్ని క్రమబద్ధీకరించడమే దీనికి అసలైన పరిష్కారం.
దేశ భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం అసలైన 'ఫ్రీ ఫైర్' గేమ్‌ను భారతదేశంలో నిషేధించింది. అయినప్పటికీ, సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు చిన్నారులు వీపీఎన్ ల ద్వారా దొంగచాటుగా ఈ నిషేధిత గేమ్‌ను ఇంకా ఆడుతూనే ఉన్నారు. మరోవైపు, ఈ గేమ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వచ్చిన 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో యథేచ్ఛగా లభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిషేధిత గేమ్‌కు ప్రత్యామ్నాయంగా మారిన ఈ వెర్షన్‌కు చిన్నారులు అత్యంత వేగంగా ఆకర్షితులవుతూ, తీవ్ర వ్యసనానికి లోనవుతున్నారు.
✳️ఇప్పుడైనా కళ్లు తెరవండి.. పిల్లలను కాపాడుకోండి
చిన్నారులను ఆన్లైన్ ఆటల ముప్పు నుంచి కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తక్షణమే కొన్ని కీలక రక్షణ చర్యలు చేపట్టాలి. మొదటగా, పిల్లలు వాడే ఫోన్ల నుంచి సేవ్ చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించి, ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో 'పేరంటల్ కంట్రోల్స్', 'పర్చేజ్ అప్రూవల్స్' ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను నిరంతరం గమనిస్తూ, వాటి ప్రాముఖ్యతను ఇంట్లోని వృద్ధులు, పెద్దవారికి కూడా వివరించాలి. అవసరమైతే పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులు మాత్రమే ఇవ్వాలి. ఇంట్లో ఎవరి మొబైల్ వాడినా సరే, రోజువారీ ఫోన్ వాడకంపై కచ్చితమైన సమయ పరిమితి విధించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు ఆడే ఆటల గురించి అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ వారిలో తీవ్ర కోపం, నిద్రలేమి, మార్కులు తగ్గడం, ఫోన్‌ను దొంగచాటుగా దాచడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై చైల్డ్ సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి.
"ఈ అడ్వైజరీ ఆన్లైన్ ఆటలను లేదా గేమింగ్‌ను పూర్తిగా వ్యతిరేకించడానికి ఉద్దేశించింది కాదు. ఆన్లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే, అదీ పరిమిత పరిధుల్లోనే ఆడాలి. మితిమీరిన గేమింగ్, నియంత్రణ లేని సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం, ప్రవర్తనతో పాటు వారి సమగ్ర వికాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా 'పర్యవేక్షణ (Monitor), మార్గదర్శకత్వం (Mentor), ప్రోత్సాహం (Motivate)' అనే త్రిసూత్రాన్ని పాటించాలి. అలాగే, విద్యార్థులు లేదా చిన్నారులు ఆటల్లోనైనా సరే.. 'క్లిక్ చేసే ముందు ఆలోచించండి' (Think Before You Click, Even While You Play) అనే నినాదాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా చిన్నారుల ఆన్లైన్ కార్యకలాపాలను చురుగ్గా పర్యవేక్షించాలి. వారిలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందిస్తూ, డిజిటల్ ప్రపంచానికి, నిజ జీవిత కార్యకలాపాలకు మధ్య సరైన సమతుల్యత ఉండేలా ప్రోత్సహించాలి. సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడమే పిల్లల భద్రతకు, వారి శ్రేయస్సుకు అత్యంత కీలకం. పర్యవేక్షణ లేని ఇంటర్నెట్ వల చిన్నారుల భవిష్యత్తును ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయకుండా, అలాగే ఆన్లైన్ వేధింపుల బారిన పడకుండా కాపాడుకోవడానికే ఈ మార్గదర్శకాలను విడుదల చేశాం. డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులకు, పాఠశాలలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంటోంది."అని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్
PS CHANDRAYANGUTTA retweeted
𝐇-𝐅𝐀𝐒𝐓 𝐂𝐫𝐚𝐜𝐤𝐬 𝐃𝐨𝐰𝐧 𝐨𝐧 𝐔𝐧𝐥𝐢𝐜𝐞𝐧𝐬𝐞𝐝 𝐅𝐚𝐬𝐭 𝐅𝐨𝐨𝐝 𝐆𝐨𝐝𝐨𝐰𝐧 𝐢𝐧 𝐂𝐡𝐚𝐫𝐦𝐢𝐧𝐚𝐫; 𝐀𝐝𝐮𝐥𝐭𝐞𝐫𝐚𝐭𝐞𝐝 𝐅𝐨𝐨𝐝 𝐌𝐚𝐭𝐞𝐫𝐢𝐚𝐥𝐬 𝐒𝐞𝐢𝐳𝐞𝐝
✳️In a continued crackdown on food adulteration and unsafe food practices, the H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) along with the Food Safety Officer (FSO) conducted a surprise raid on an illegal fast food godown operating under the limits of Hussainialam Police Station, Charminar.
Acting on credible information, the team inspected the premises of M/s Al Akbar Fast Food and Godown, located at New Laad Bazar, Panch Mohalla, Charminar.
During the inspection, it was found that food items were being prepared and stored under extremely unhygienic and hazardous conditions, posing a serious threat to public health.
✳️Major Violations Observed:
• Operation without a mandatory FSSAI licence.
• Use of prohibited/artificial food colours (MSK Lion Green and Raspberry Red).
• Reuse of stale and hazardous cooking oil.
• Absence of water analysis certification and quality control measures.
• Gross unhygienic conditions and lack of pest control.
Seizure Details:
• Approximately 110 kg of prepared fried chicken.
• 6 tins of loose cooking oil (15 litres each).
• Artificial chemical food colours.
Two persons responsible for running the illegal operations have been apprehended.
Health Risks to Consumers:
✳️Consumption of such adulterated and unhygienic food may lead to:
• Food poisoning, vomiting, and diarrhea.
• Gastrointestinal infections.
• Long-term health issues due to repeated consumption of reused oil.
• Allergic reactions and toxicity due to artificial food colours.
• Increased risk of serious illnesses affecting the liver and overall health.
✳️Legal Action Initiated:
The accused, by concealing these unsafe practices and supplying adulterated food to consumers, have endangered public health and gained unlawfully. A case has been registered in Hussainialam Police Station under relevant provisions of the Food Safety and Standards Act, 2006 and other applicable laws.
The accused persons and seized material have been handed over to the Station House Officer, Hussainialam Police Station, for further legal action.
Public Advisory:
✳️Hyderabad City Police reiterates its zero-tolerance policy towards food adulteration. Citizens are advised to:
• Consume food only from licensed establishments.
• Verify the FSSAI licence before purchase.
• Avoid artificially coloured or suspicious food.
• Report unsafe food practices.
For complaints, contact Toll-Free Number: 8712661212. @HFastHCP
Public cooperation is essential to safeguard food safety and public health.
Issued By: Vaibhav Raghunath Gaikwad, IPS Deputy Commissioner of Police Task Force, Hyderabad
PS CHANDRAYANGUTTA retweeted
𝐏𝐚𝐧𝐞𝐞𝐫 𝐀𝐝𝐮𝐥𝐭𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧, 𝐌𝐢𝐬𝐛𝐫𝐚𝐧𝐝𝐢𝐧𝐠 & 𝐅𝐨𝐨𝐝 𝐒𝐚𝐟𝐞𝐭𝐲 𝐕𝐢𝐨𝐥𝐚𝐭𝐢𝐨𝐧𝐬
It has come to the notice of the authorities that Cheese Analogue products (made from vegetable fats and non-milk ingredients) are being sold as Paneer, Malai Paneer, or Milk Paneer without proper declaration, amounting to misbranding and consumer deception.
FBOs are procuring Cheese Analogue from manufacturers and from states such as Karnataka, Tamil Nadu, Maharashtra, and Andhra Pradesh, and selling it as paneer. The same product is often marketed under misleading labels like “Low Fat Paneer”, “Medium Fat Paneer”, or “Fresh Paneer”, or sold without manufacturing details, batch number, or expiry date. In some cases, FBOs unknowingly order paneer but are supplied Cheese Analogue as a substitute.
Manufacturers supply these products with labels declaring “Cheese Analogue” and disclaimers such as “not responsible for loose sale” and “contains no dairy fat”; however, at the retail level, FBOs misrepresent or knowingly sell them as paneer to increase profits.
It is also observed that some manufacturers and retail shop owners are operating without valid FSSAI licenses. Certain FBOs are procuring Cheese Analogue in bulk and repacking it under misleading labels such as “Premium Paneer” without licence, proper declaration, or traceability.
Inspections have revealed adulteration practices including addition of starch, excess water, non-milk fats, use of poor-quality or synthetic milk, and non-food-grade substances, along with violations such as absence of mandatory labelling, invalid licences, and unhygienic storage.
Seizure of Adulterated and Misbranded Products:
During raids conducted yesterday, approximately 45 outlets and 8 manufacturing units were inspected, and about 825 kg of suspected adulterated/misbranded products were seized.
These practices pose serious health risks including food poisoning, allergic reactions, and consumption of inferior and unsafe products.
Strict enforcement drives are ongoing, and samples are being collected for analysis. Violations will attract stringent legal action.
Public Advisory: Purchase paneer only from licensed vendors, check labels and expiry details, avoid loose/unlabelled products, and report violations.
Warning to FBOs: Ensure proper declaration of Cheese Analogue, maintain mandatory labelling and valid licences, and avoid repacking or selling analogue as paneer; violations will invite strict legal action.
Issued in the interest of public health and consumer safety.
SD/-
VAIBHAV GAIKWAD RAGHUNATH, IPS,
DEPUTY COMMISSIONER OF POLICE,
COMMISSIONER’S TASK FORCE, HYDERABAD.
PS CHANDRAYANGUTTA retweeted
Upon receiving a Dial-100 call regarding a child trapped in a manhole cover near the Secretariat Bus Stop, Saifabad Police responded immediately and coordinated with the Fire Department for a safe rescue.
The timely intervention of police and fire service personnel ensured the child's safety and prevented any untoward incident.
Subsequently, GHMC officials were informed to undertake necessary rectification of the manhole cover and implement preventive measures in the interest of public safety.
Saifabad PS responded to a Dial-100 call after a 10-year-old boy's leg got trapped in a manhole at Secretariat bus stop. PC 5055 A. Prashanth and the Fire Dept safely rescued the boy, and GHMC officials were alerted to Rectify the problem @TelanganaDGP @SajjanarVC_IPS @DCPKZHyd


































