నవంబర్ 29 – దీక్షా దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం.
- బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు
తెలంగాణ అమరుల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా (21 నవంబర్ 2026) ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులతో జూమ్ ద్వారా అంతర్జాతీయ సమన్వయ సమావేశం నిర్వహించారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు.
@KTRBRS గారి పిలుపు మేరకు దీక్షా దివస్ సందర్భంగా సభలు, సమావేశాలతో పాటు రక్తదాన శిబిరాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ ప్రచారాన్ని విస్తృతం చేయాలని, సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు, వీడియో సందేశాలను ప్రచారం చేయాలని, తెలంగాణ ప్రవాసులను భాగస్వాములను చేయాలని కోరారు. అలాగే, వివిధ దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం!
కేసీఆర్ గారి నాయకత్వంలో 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాబోతోందని, తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగురవేయబోతోందని మహేశ్ బిగాల గారు ధీమా వ్యక్తం చేశారు.
అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులకు పార్టీ నాయకత్వాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంతో రాబోయే రోజుల్లో కేటీఆర్ గారి దేశాల పర్యటనలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులందరూ ఐక్యంగా పనిచేస్తూ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాలి… అమరుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలవాలి!
జై తెలంగాణ ✊
జై బీఆర్ఎస్ ✊
దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి✊
- బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ, నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు సైతం దీక్షా దివాస్ ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆయన కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ దీక్షా దివాస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
కేసీఆర్ గారిపై ఆధారాలు చూపకుండా ఆరోపణలా?
సాగునీటి ప్రాజెక్టులపై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి
- బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ @mbigala
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు దినపత్రికలో ప్రచురితమైన ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ కథనాన్ని బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలకు సంబంధించిన అంశాన్ని కేసీఆర్ గారి వ్యక్తిగత వ్యవసాయ క్షేత్రంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నప్పుడు, వాటికి సంబంధించిన అధికారిక ఆధారాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత పత్రికపై ఉంది. సాగునీటి శాఖ రికార్డులు ఏం చెబుతున్నాయి? కాలువల అసలు మార్గాలేంటి? సంబంధిత అధికారుల వివరణ ఏంటి? ఈ వివరాలు వెల్లడించకుండా సంచలనాత్మక శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమర్థనీయం కాదు.
పత్రికా స్వేచ్ఛను మేం గౌరవిస్తాం. ప్రజల తరఫున ప్రశ్నించే జర్నలిజాన్ని సమర్థిస్తాం. అదే సమయంలో, వ్యక్తుల గౌరవానికి, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచురించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై చర్చ వాస్తవాలు, సాంకేతిక వివరాలు, అధికారిక రికార్డుల ఆధారంగానే జరగాలి.
ఈ కథనంపై బీఆర్‌ఎస్ లీగల్ సెల్ లేవనెత్తిన ప్రశ్నలకు వెలుగు యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. నోటీసుల్లో పేర్కొన్న విధంగా, నోటీసులు అందిన 24 గంటల్లో వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకొని కేసీఆర్ గారికి, బీఆర్‌ఎస్ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌కు మేం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఆ క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో పాటు డిజిటల్, అధికారిక సామాజిక మాధ్యమ వేదికల్లోనూ ప్రచురించాలి.
తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఆధారాలతో చర్చకు మేం ఎప్పుడూ సిద్ధమే. కేసీఆర్ గారిపై నిరాధార ప్రచారాన్ని మాత్రం మౌనంగా చూస్తూ ఊరుకోం. పార్టీ చేపట్టే చట్టబద్ధమైన చర్యలకు బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ విభాగం పూర్తి సంఘీభావం ప్రకటిస్తోంది.
వార్తలకు బలం వాస్తవం కావాలి. ఆరోపణకు ఆధారం ఉండాలి. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని సహించేది లేదు.
Hearty congratulations to Sandy Reddy garu on being unanimously elected as the Mayor of Strathfield, Australia.
Sandy Reddy, a Telangana native, holds the distinction of being the first person from India to be elected as a Mayor in Australia.
Wishing Sandy Reddy a successful tenure in public service. May she continue to achieve greater heights and bring pride to Telangana through her service and leadership.
దుబాయ్‌లో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS కు ఆహ్వానం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ (GTF), ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఏర్పాట్లు చేస్తున్నాయి.
అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు.
GTF ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసి దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఆహ్వానపత్రాన్ని అందజేసింది.
తెలంగాణ ఆడపడుచులు, ప్రవాస తెలంగాణ కుటుంబాలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని వారు కేటీఆర్‌ను ప్రత్యేకంగా కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని గల్ఫ్ దేశాల్లోనూ కొనసాగించడంతో పాటు, అక్కడి తెలంగాణ సమాజంలో తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు GTF ప్రతినిధులు తెలిపారు.
ముఖ్యంగా మహిళలు, యువత, చిన్నారులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అక్టోబర్ 11న దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.
అనంతరం ETCA ఆధ్వర్యంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మరో బతుకమ్మ వేడుక జరగనుంది. ఈ రెండు కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.
ఈ సందర్భంగా దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు.
బతుకమ్మను కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని, గల్ఫ్ దేశాల్లోనూ ఈ పండుగకు విశేష ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు.
ప్రవాస తెలంగాణ సమాజం తమ స్వస్థలాలతో ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని కొనసాగించేందుకు బతుకమ్మ వేడుకలు ఒక వేదికగా నిలుస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
కేటీఆర్ దుబాయ్ బతుకమ్మ వేడుకలకు హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి పండుగలో పాల్గొంటే తమకు మరింత ఉత్సాహం, ప్రోత్సాహం లభిస్తుందని GTF ప్రతినిధులు తెలిపారు.
గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలతో కేటీఆర్‌కు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆయన పాల్గొనడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో GTF ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్‌తో పాటు జయంత్ కుమార్, అభినవ్, ఆకుల కళ్యాణ్, లత తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియా, బోండీ ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి పలువురిని కాపాడిన రహ్మత్ పాషాను అభినందించిన @KTRBRS
ఆస్ట్రేలియాలోని బోండీ ప్రాంతంలో జరిగిన విషాద ఘటన సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి దాదాపు 20 మంది ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్‌కు చెందిన భారతీయ మూలాల వ్యక్తి రహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (Permanent Residency) కల్పించడం ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రహ్మత్ పాషాను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
బోండీ బీచ్ సమీపంలో ఒక ప్రయాణికుడిని దింపిన అనంతరం పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడంతో మొదట వాటిని బాణాసంచా శబ్దాలుగా భావించిన రహ్మత్ పాషా, వెంటనే వాహనం నుంచి దిగి చూడగా దుండగుడు దాడికి పాల్పడుతున్న దృశ్యాన్ని గమనించారు. ఆ సమయంలో వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా, అక్కడి నుంచి వెళ్లిపోకుండా ఏమాత్రం వెనుకాడకుండా గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేశారు.
రహ్మత్ పాషా చూపిన అసాధారణ ధైర్యాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు Permanent Residency మంజూరు చేయడమే కాకుండా, ప్రభుత్వ Bravery Awardకు కూడా నామినేట్ చేసినట్లు సమాచారం. అలాగే ఆయన సేవలను ఆయన పనిచేసిన రైడ్-షేరింగ్ సంస్థ కూడా ప్రత్యేకంగా గుర్తించి అభినందించింది.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని మరింత పెంచేలా రహ్మత్ పాషా చేసిన సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు. సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేయాలనే సందేశాన్ని ఆయన తన ఆచరణ ద్వారా చాటిచెప్పారని కొనియాడారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నిశీధర్ బొర్రా, వేణు తదితరులు పాల్గొని రహ్మత్ పాషాను ఘనంగా అభినందించారు.
రహ్మత్ పాషా చేసిన ధైర్యసాహసాలు, మానవత్వం, సేవాభావం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమని, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేసే ప్రతి ఒక్కరికీ ఆయన ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
MAHESH BIGALA retweeted
బీఆర్‌ఎస్ నెదర్లాండ్స్ బృందంతో మహేష్ బిగాలా సమావేశం
ఆమ్‌స్టర్‌డామ్‌లో బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలాకు బీఆర్‌ఎస్ నెదర్లాండ్స్ బృందం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రవాస తెలంగాణ వాసుల పాత్రపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో అవసరమని మహేష్ బిగాలా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ మరోసారి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే, కేటీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే నెదర్లాండ్స్‌లో బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సభ్యత్వ నమోదు (Membership Drive) కార్యక్రమాన్ని చేపట్టి, అనంతరం పూర్తి స్థాయి నెదర్లాండ్స్ కమిటీని ప్రకటించనున్నట్లు మహేష్ బిగాలా తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేయాలని, ప్రజల్లోకి వెళ్లి బీఆర్‌ఎస్ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని నెదర్లాండ్స్ బృందానికి మహేష్ బిగాలా దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నెదర్లాండ్స్ సభ్యులు పవన్, పృథ్వి, సందీప్, సత్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నెదర్లాండ్స్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.
బెల్జియంలో 54వ బీఆర్ఎస్ శాఖ ప్రారంభం - కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
బీఆర్ఎస్ గ్లోబల్ విస్తరణలో మరో కీలక అడుగు పడింది. బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖను బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ @mbigala ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 50వ జన్మదిన వేడుకలను బెల్జియంలోని పార్టీ అభిమానులు, తెలంగాణ ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ అభివృద్ధికి, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కేటీఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బీఆర్ఎస్ సిద్ధాంతాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ.. బెల్జియం బీఆర్ఎస్ శాఖను బలోపేతం చేసేందుకు తాత్కాలిక అడ్ హాక్ కమిటీని జగన్నాథ్ ప్రసాద్ రామానుజం నాయకత్వంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన అనంతరం పూర్తి స్థాయి కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. బెల్జియంలో తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేలా ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి సహాయం చేసిన ప్రవీణ్ జారుగుమల్లికి మహేష్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బెల్జియంలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటుకు మొదటి నుంచి విశేష కృషి చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన శ్యామ్ అకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే దిశగా విదేశీ శాఖలు కీలక పాత్ర పోషిస్తాయని, బెల్జియం శాఖను కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని మహేష్ బిగాల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మనోజ్, మంజునాథ్, విజయ్, రాజశేఖర్, ఫణి, హరీష్, నాగరాజు జగిని, శ్రీకాంత్, అఖిల్ రెడ్డి, భాను, చన్నారెడ్డి, రమణ్ మరియు బెల్జియంలోని తెలంగాణ ప్రవాసులు, బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
మలేషియా పర్యటనలో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ గారు ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. అలాగే గతంలో కేసీఆర్ గారి సింగపూర్, మలేషియా పర్యటనల సందర్భంగా అక్కడి అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు.
సింగపూర్, మలేషియా దేశాల్లో అమలవుతున్న అభివృద్ధి విధానాలలో తెలంగాణలో అనుసరించదగిన అంశాలపై కూడా చర్చ జరిగింది. తెలంగాణను ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధి నమూనాలను తీసుకురావాల్సిన అవసరాన్ని కేటీఆర్ గారు ప్రస్తావించారు.
ఈ సందర్భంగా సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు సింగపూర్‌లో కూడా తెలంగాణ సభ నిర్వహించాలని కేటీఆర్ గారిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో వివిధ తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు సమాజం సభ్యులు, తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు, బీఆర్‌ఎస్ ఎన్నారై సభ్యులు, సింగపూర్ వాసవి సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా బస్సుల్లో మలేషియాకు చేరుకుని ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మంచిరెడ్డి ప్రశాంత్, బీఆర్‌ఎస్ సింగపూర్ సభ్యులు రంజిత్ రావు, పెద్ది శేఖర్, రజినీకాంత్, కిరణ్ షెర్ల, టీసీఎస్‌ఎస్ సభ్యులు నల్లా భాస్కర్, రాజు, వీఏఎం సభ్యులు కైల నాగరాజు, రమణ, ఎస్‌టీఎస్ సభ్యులు కోటి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బైరి రవి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
MAHESH BIGALA retweeted
కౌలాలంపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా పూర్తి
- బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ @mbigala
బీఆర్‌ఎస్ మలేషియా శాఖ మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సభ్యులతో కలిసి బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా గారు కౌలాలంపూర్ నగరంలోని MECC కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మలేషియాకు చేరుకోగా, అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు, బీఆర్‌ఎస్ శ్రేణులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ గారి రాకతో మలేషియాలోని తెలంగాణ సమాజంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
గత సంవత్సరం డల్లాస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించినట్లే, అదే ఉత్సాహంతో ఈసారి మలేషియాలో కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహేశ్ బిగాలా గారు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులు కలిసి సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మలేషియాలో నిర్వహిస్తున్నాం. కేటీఆర్ గారి రాకతో తెలంగాణ ఆత్మీయత మరింత బలపడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
మలేషియా తెలుగు అకాడమీ కూడా కేటీఆర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించిందని తెలిపారు. 1955 నుంచి మలేషియాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలతో పాటు, తెలంగాణ ఉద్యమానికి ప్రారంభం నుంచే మద్దతు తెలిపిన పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. మలేషియా తెలుగు అకాడమీ ప్రత్యేక ఆహ్వానం మేరకు కేటీఆర్ గారు తెలుగు అకాడమీని సందర్శించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి నాయకత్వానికి మలేషియా ప్రవాసుల నుండి విశేష మద్దతు లభించిందని, ఇప్పుడు కేటీఆర్ గారిని ప్రత్యక్షంగా కలుసుకుని ఆయన ప్రసంగాన్ని వినేందుకు ప్రవాస తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.
సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ నాయకులు, తెలుగు సమాజ సభ్యులు హాజరవుతుండగా, ఆస్ట్రేలియా సహా పరిసర దేశాల నుంచి కూడా తెలంగాణ వాసులు భారీగా తరలివస్తున్నారు.
ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి ఇప్పటికే తెలంగాణ నుంచి పలువురు ప్రముఖ నాయకులు మలేషియాకు చేరుకున్నారు. వారిలో బీఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఎల్ రమణ, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితర బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఇప్పటికే మలేషియాకు చేరుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఘనంగా, ధూమ్ ధామ్‌గా నిర్వహించేందుకు సాంస్కృతిక కళాకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ మలేషియా శాఖ మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) కమిటీలు కృషి చేస్తున్నట్లు మహేశ్ బిగాలా గారు తెలిపారు.
MAHESH BIGALA retweeted
తెలంగాణ అంటే గ్లోబల్ నెట్‌వర్క్
మలేషియాలోని కౌలాలంపూర్‌లో గల ప్రముఖ మ్యాట్రేడ్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 6న జరుగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు సాధారణ కమ్యూనిటీ కార్యక్రమం కాదు. ఇది ఒక గ్లోబల్ తెలంగాణ శక్తి ప్రదర్శనగా మారుతున్నది. బీఆర్‌ఎస్ మలేషియా-మైటా, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఉత్సవాలు ప్రవాస తెలంగాణలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక్కడ విషయం కేవలం సంబురాలు కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పేందుకు ఒక పెద్ద వేదికగా మారనున్నది.
మలేషియా లాంటి దేశంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావోత్సవం జరగడం చాలా ప్రత్యేకం. అక్కడ ఉన్న తెలుగు, భారతీయ కమ్యూనిటీలు ఎప్పటినుంచో తమ మూలాలను కాపాడుకొంటూ, కొత్త దేశంలో కూడా బలమైన స్థానం సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే కమ్యూనిటీ తెలంగాణ ఆవిర్భావ వేడుకల ద్వారా ఒక్కటవుతున్నది. ఇది కేవలం పండగ కాదు, ఒక కనెక్ట్, ఒక ఎమోషన్, ఒక ఐడెంటిటీ రీయూనియన్ లాంటిది.
మలేషియాలో తెలుగు సమాజానికి దీర్ఘ చరిత్ర ఉన్నది. 1955 నుంచే తెలుగు సంఘాలు అక్కడ స్థిరపడుతూ వచ్చాయి. ప్రస్తుతం అక్కడ సుమారు 5 లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ఈ సమాజం ఇప్పుడు 4 నుంచి 5 తరాలుగా విస్తరించింది. అయినప్పటికీ భాష, సంస్కృ తి, సంప్రదాయాలను కాపాడుకొంటూ ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వారికి ఒక ఐడెంటిటీ రీయూనియన్‌లా మారుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని మలేషియా తెలుగు సంఘం ఆహ్వానించింది.
ఈ మొత్తం ఉత్సవాల మధ్యలో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. తెలంగాణ డయాస్పోరా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నది? అనే ప్రశ్న. సమాధానం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఇక విడివిడిగా ఉన్న సంఘాల సమాహారం కాదు. ఇది ఒక గ్లోబల్ నెట్‌వర్క్‌గా మారుతున్నది. అమెరికా నుంచి ఆసియా వరకు, గల్ఫ్ నుంచి ఆఫ్రికా వరకు తెలంగాణ పేరు వినిపించే ప్రతీ చోట ఒకే ఎనర్జీ కనిపిస్తున్నది. నిరుడు అమెరికాలోని డాలస్‌లో జరిగిన కార్యక్రమాలు ఈ మార్పునకు బలమైన పునాది వేశాయి.
ప్రత్యేకంగా డాలస్ ఈవెంట్ అయితే వేలాది మంది ప్రవాసుల సమక్షంలో తెలంగాణ అభివృద్ధిని ప్రత్యక్షంగా చర్చించే ఒక హిస్టారికల్ మీటింగ్‌లా నిలిచింది. అక్కడ చర్చలు కేవలం సాంస్కృతికంగా ఆగలేదు. పెట్టుబడులు, స్టార్టప్‌లు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, గ్లోబల్ అవకాశాల వరకు వెళ్లాయి.
సింగపూర్‌లోని బీఆర్‌ఎస్ అనుబంధ సం ఘాలు మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇది కేవలం రాజకీయ అనుబంధం కాకుండా ఒక సాంస్కృతిక ఐక్యత ఉద్యమంగా మారుతున్నది. ఈ మొత్తం గ్లోబల్ కనెక్ట్ వెనుక బలంగా వినిపిస్తున్న పేరు కేటీఆర్. ఆయన రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ లీడర్‌గా కూడా ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన వెళ్లిన ప్రతీ వేదికలో తెలంగాణ గురించి మాట్లాడటం అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ప్రెజెంటేషన్‌లాగా మారింది. ప్రత్యేకంగా ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రసంగాలు తెలంగాణను ఒక ఆవిష్కరణల రంగంలో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా చూపించాయి.
అక్కడ ఆయన చెప్పిన మాటలు, చేసిన చర్చలు, పెట్టుబడిదారులతో జరిగిన సమావేశాలు ఇవన్నీ తెలంగాణకు కొత్త అవకాశాల ద్వారాలు తెరిచాయి. ఇక ఈ మొత్తం ప్రయాణం వెనుక మరో బలమైన దృష్టి ఉన్నది. అదే కేసీఆర్ వ్యూహాత్మక ఆలోచన. బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరపాలని తీసుకున్న నిర్ణయం వల్లే ఈ డయాస్పోరా ఉద్య మం ఇలా విస్తరించింది. తెలంగాణను కేవలం రా ష్ట్రంగా కాకుండా ఒక గ్లోబల్ ఐడెంటిటీగా నిలబెట్టాలన్న ఆలోచన ఇప్పుడు వాస్తవంగా మారుతున్నది.
మలేషియా వేడుక ఇప్పుడు కేవలం స్టేజ్ ప్రోగ్రామ్ కాదు. ఇది ఒక నెట్‌వర్కింగ్ హబ్. ఒకవైపు కుటుంబాలు, సంస్కృతి, ఆనందం, బిజినెస్, స్టార్టప్స్, ఇన్వెస్ట్‌మెంట్స్. యువతకు ఇది ఒక అవకాశాల వేదిక. పెద్దవాళ్లకు ఇది ఒక కనెక్ట్ ప్లాట్‌ఫాం. ఇదే ఈ ఈవెంట్ స్పెషల్. ఈ వేదిక మీద మాట్లాడేది ఒక్క మాటే, అదే తెలంగాణ ఇప్పుడు లోకల్ కాదు, గ్లోబల్. ప్రతీ దేశంలో ఒక చిన్న తెలంగాణ తయారవుతున్నది. ప్రతీ నగరంలో ఒక కమ్యూనిటీ ఎనర్జీ ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఈ తరహా కార్యక్రమాలు లండన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అలాగే గల్ఫ్‌లో కూడా జరుగనున్నాయి. అంటే ఇది ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక మూవ్‌మెంట్. ఈ మొత్తం ప్రయాణం చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఇప్పుడు ఒక రాష్ట్రం మాత్రమే కాదు. అది ఒక భావం, ఒక గ్లోబల్ నెట్‌వర్క్, ఒక ఐడెంటిటీ. ఆ దిశగా మలేషియా వేదిక మరో కీలక మైలురాయి.
– వ్యాసకర్త: మహేశ్ బిగాల,
బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్
@mbigala
MAHESH BIGALA retweeted
తెలంగాణ అంటే గ్లోబల్ నెట్‌వర్క్
మలేషియాలోని కౌలాలంపూర్‌లో గల ప్రముఖ మ్యాట్రేడ్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 6న జరుగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు సాధారణ కమ్యూనిటీ కార్యక్రమం కాదు. ఇది ఒక గ్లోబల్ తెలంగాణ శక్తి ప్రదర్శనగా మారుతున్నది. బీఆర్‌ఎస్ మలేషియా-మైటా, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఉత్సవాలు ప్రవాస తెలంగాణలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక్కడ విషయం కేవలం సంబురాలు కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పేందుకు ఒక పెద్ద వేదికగా మారనున్నది.
మలేషియా లాంటి దేశంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావోత్సవం జరగడం చాలా ప్రత్యేకం. అక్కడ ఉన్న తెలుగు, భారతీయ కమ్యూనిటీలు ఎప్పటినుంచో తమ మూలాలను కాపాడుకొంటూ, కొత్త దేశంలో కూడా బలమైన స్థానం సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే కమ్యూనిటీ తెలంగాణ ఆవిర్భావ వేడుకల ద్వారా ఒక్కటవుతున్నది. ఇది కేవలం పండగ కాదు, ఒక కనెక్ట్, ఒక ఎమోషన్, ఒక ఐడెంటిటీ రీయూనియన్ లాంటిది.
మలేషియాలో తెలుగు సమాజానికి దీర్ఘ చరిత్ర ఉన్నది. 1955 నుంచే తెలుగు సంఘాలు అక్కడ స్థిరపడుతూ వచ్చాయి. ప్రస్తుతం అక్కడ సుమారు 5 లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ఈ సమాజం ఇప్పుడు 4 నుంచి 5 తరాలుగా విస్తరించింది. అయినప్పటికీ భాష, సంస్కృ తి, సంప్రదాయాలను కాపాడుకొంటూ ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వారికి ఒక ఐడెంటిటీ రీయూనియన్‌లా మారుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మలేషియా తెలుగు సంఘం ఆహ్వానించింది.
ఈ మొత్తం ఉత్సవాల మధ్యలో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. తెలంగాణ డయాస్పోరా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నది? అనే ప్రశ్న. సమాధానం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఇక విడివిడిగా ఉన్న సంఘాల సమాహారం కాదు. ఇది ఒక గ్లోబల్ నెట్‌వర్క్‌గా మారుతున్నది. అమెరికా నుంచి ఆసియా వరకు, గల్ఫ్ నుంచి ఆఫ్రికా వరకు తెలంగాణ పేరు వినిపించే ప్రతీ చోట ఒకే ఎనర్జీ కనిపిస్తున్నది. నిరుడు అమెరికాలోని డాలస్‌లో జరిగిన కార్యక్రమాలు ఈ మార్పునకు బలమైన పునాది వేశాయి.
ప్రత్యేకంగా డాలస్ ఈవెంట్ అయితే వేలాది మంది ప్రవాసుల సమక్షంలో తెలంగాణ అభివృద్ధిని ప్రత్యక్షంగా చర్చించే ఒక హిస్టారికల్ మీటింగ్‌లా నిలిచింది. అక్కడ చర్చలు కేవలం సాంస్కృతికంగా ఆగలేదు. పెట్టుబడులు, స్టార్టప్‌లు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, గ్లోబల్ అవకాశాల వరకు వెళ్లాయి.
సింగపూర్‌లోని బీఆర్‌ఎస్ అనుబంధ సం ఘాలు మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇది కేవలం రాజకీయ అనుబంధం కాకుండా ఒక సాంస్కృతిక ఐక్యత ఉద్యమంగా మారుతున్నది. ఈ మొత్తం గ్లోబల్ కనెక్ట్ వెనుక బలంగా వినిపిస్తున్న పేరు కేటీఆర్. ఆయన రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ లీడర్‌గా కూడా ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన వెళ్లిన ప్రతీ వేదికలో తెలంగాణ గురించి మాట్లాడటం అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ప్రెజెంటేషన్‌లాగా మారింది. ప్రత్యేకంగా ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రసంగాలు తెలంగాణను ఒక ఆవిష్కరణల రంగంలో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా చూపించాయి.
అక్కడ ఆయన చెప్పిన మాటలు, చేసిన చర్చలు, పెట్టుబడిదారులతో జరిగిన సమావేశాలు ఇవన్నీ తెలంగాణకు కొత్త అవకాశాల ద్వారాలు తెరిచాయి. ఇక ఈ మొత్తం ప్రయాణం వెనుక మరో బలమైన దృష్టి ఉన్నది. అదే కేసీఆర్ వ్యూహాత్మక ఆలోచన. బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరపాలని తీసుకున్న నిర్ణయం వల్లే ఈ డయాస్పోరా ఉద్య మం ఇలా విస్తరించింది. తెలంగాణను కేవలం రా ష్ట్రంగా కాకుండా ఒక గ్లోబల్ ఐడెంటిటీగా నిలబెట్టాలన్న ఆలోచన ఇప్పుడు వాస్తవంగా మారుతున్నది.
మలేషియా వేడుక ఇప్పుడు కేవలం స్టేజ్ ప్రోగ్రామ్ కాదు. ఇది ఒక నెట్‌వర్కింగ్ హబ్. ఒకవైపు కుటుంబాలు, సంస్కృతి, ఆనందం, బిజినెస్, స్టార్టప్స్, ఇన్వెస్ట్‌మెంట్స్. యువతకు ఇది ఒక అవకాశాల వేదిక. పెద్దవాళ్లకు ఇది ఒక కనెక్ట్ ప్లాట్‌ఫాం. ఇదే ఈ ఈవెంట్ స్పెషల్. ఈ వేదిక మీద మాట్లాడేది ఒక్క మాటే, అదే తెలంగాణ ఇప్పుడు లోకల్ కాదు, గ్లోబల్. ప్రతీ దేశంలో ఒక చిన్న తెలంగాణ తయారవుతున్నది. ప్రతీ నగరంలో ఒక కమ్యూనిటీ ఎనర్జీ ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఈ తరహా కార్యక్రమాలు లండన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అలాగే గల్ఫ్‌లో కూడా జరుగనున్నాయి. అంటే ఇది ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక మూవ్‌మెంట్. ఈ మొత్తం ప్రయాణం చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఇప్పుడు ఒక రాష్ట్రం మాత్రమే కాదు. అది ఒక భావం, ఒక గ్లోబల్ నెట్‌వర్క్, ఒక ఐడెంటిటీ. ఆ దిశగా మలేషియా వేదిక మరో కీలక మైలురాయి.
– వ్యాసకర్త: మహేశ్ బిగాల,
బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్
@mbigala @KTRBRS
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన మహేష్ బిగాల
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్ 6న కౌలాలంపూర్‌లోని ప్రముఖ MATRADE ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మలేషియాతో పాటు వివిధ దేశాల నుంచి తెలంగాణ వాసులు, సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కేటీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను నిర్వాహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.
ఈ వేడుకల ఏర్పాట్లను బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పర్యవేక్షించారు. వేదిక వద్ద మౌలిక సదుపాయాలు, అతిథుల స్వాగత ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలు, భద్రతా చర్యలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహార వసతులు తదితర అంశాలను సమీక్షించారు. కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన మరియు గుర్తుండిపోయే అనుభవం కల్పించేందుకు బృంద సభ్యులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు బీఆర్ఎస్ మలేషియా మరియు MYTA ముఖ్య సభ్యులు టీ. మారుతి కుర్మ, తిరుపతి, సందీప్ గౌడ్, నరేందర్ రెడ్డి, అనిల్, జ్యోతి, మోనా, పూర్ణచంద్రరావు, దీపిక తదితరులు సహా పలువురు బృంద సభ్యులు పాల్గొన్నారు. తుది ఏర్పాట్లపై మహేష్ బిగాల మార్గనిర్దేశం చేస్తూ, ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ పోరాట స్ఫూర్తి, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి విజయాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఈ వేడుకలు మంచి అవకాశంగా నిలుస్తాయని తెలిపారు.
భారతదేశం వెలుపల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అంత పెద్ద స్థాయిలో నిర్వహించడం ప్రవాస తెలంగాణ సమాజానికి గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
#WATCH | Hyderabad: Former Telangana minister G Jagadish Reddy unveils the brochure for BRS Malaysia's Telangana formation day event.
BRS NRI coordinator, B Mahesh, says, "We planned grand celebrations of Telangana Formation Day on June 6th in Malaysia. June 2nd is the Telangana Formation Day here. We requested our BRS working president, KTR, to take part in Malaysia... He will come to Malaysia to be part of it.... BRS Working President KTR is personally coming to the event as the chief guest..." (22.05)
MAHESH BIGALA retweeted
VIDEO | Hyderabad: BRS NRI Global Coordinator Mahesh Bigala says, "We are planning to celebrate Telangana formation day in Malaysia on June 6. People have been requesting KT Rama Rao to come over here. We requested on behalf of Malaysia BRS, and he has accepted our invitation, and he will attend the event in Malaysia."
(Full video available on PTI Videos - ptivideos.com)
జూన్ 6న మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS హాజరు
బీఆర్‌ఎస్ మలేషియా ఆధ్వర్యంలో జూన్ 6, 2026న కౌలాలంపూర్‌లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ @mbigala ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ మలేషియా ప్రతినిధులు మారుతి కుర్మా, చిట్టిబాబు, శ్రీధర్, ప్రియ తదితరులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ గారు స్వీకరించి, జూన్ 6న మలేషియాలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్నట్లు ధృవీకరించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ @RamanaLgandula, మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS కూడా పాల్గొన్నారు.
తెలంగాణ మరియు తెలుగు ప్రజలను ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఈ చారిత్రాత్మక వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ మలేషియా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
గౌరవనీయులైన బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు పార్టీ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారితో చర్చించిన అనంతరం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కమిటీలన్నీ తక్షణమే రద్దు చేయబడినవి.
త్వరలోనే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమగ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కొత్త సభ్యత్వ ప్రాతిపదికన, పద్ధతిగా మరియు వ్యవస్థీకృతంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయబడును.
ఈ మార్పుల దశలో అన్ని సభ్యులు, మద్దతుదారులు సహకరించి, పార్టీ నాయకత్వం మరియు దాని దూరదృష్టికి తమ మద్దతును కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
మహేష్ బిగాలా
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల ప్రభావం గల్ఫ్ దేశాలపై పడుతోంది.
ఈ సందర్భంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఏ విధమైన సహాయం అవసరమైనా, గల్ఫ్ దేశాలలో ఉన్న బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులను వెంటనే సంప్రదించాలని సూచించారు. అక్కడ ఉన్న ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితులను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రజల భద్రతే మా ప్రాధాన్యత అని, అవసరమైతే అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మహేష్ బిగాల గారు స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో.. తెలంగాణ ఉద్యమ సారధి, స్వరాష్ట్ర సాధకుడు, బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
అమెరికా నుండి ఆఫ్రికా వరకు, యూరోప్, ఆస్ట్రేలియా నుండి గల్ఫ్ దేశాల వరకు ఉన్న ఎన్నారైలు వివిధ సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యకలాపాలు మరియు రక్తదాన శిబిరాల ద్వారా ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఎన్నారై.. కేసీఆర్ గారు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం ఆయన మార్గదర్శకత్వంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ విధంగా కేసీఆర్ గారి జన్మదినం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సేవా మరియు చారిటీ కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసిన బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల, మాజీ మంత్రి @VSrinivasGoud, బీఆర్‌ఎస్ యూఎస్‌ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు.
On the occasion of the birthday of BRS President and the first Chief Minister of Telangana, Sri KCR Garu, BRS NRI Global members from across the world extend their heartfelt birthday wishes. Under the leadership of Global NRI Coordinator Mahesh Bigala, grand celebrations were organized from the USA to Africa and Europe to Australia, featuring extensive social service activities and blood donation drives. NRIs worldwide prayed for his long life and health, reaffirming their commitment to the progress of Telangana.
#HappyBirthdayKCR
@mbigala
సిట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేయడం, రేవంత్ రెడ్డి చేపట్టిన డైవర్షన్ రాజకీయాల్లో భాగమేనని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వెబ్ సిరీస్ తరహా రాజకీయ నాటకాన్ని నడుపుతోందని ఆయన విమర్శించారు. ఒకరోజు కేటీఆర్, మరోరోజు హరీష్‌రావు, నిన్న సంతోష్‌రావు… ఇలా రోజుకో బీఆర్ఎస్ నాయకుడిని సిట్ పేరుతో పిలుస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగా, అక్కడ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇక్కడ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మహేష్ బిగాల ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి కక్షపూరిత కేసులు, విచారణలు చేపడుతున్నారని స్పష్టం చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు రైతుల కష్టాలు, నిరుద్యోగం, హామీల అమలులో వైఫల్యం వీటిపై సమాధానం చెప్పలేక, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి "కాళేశ్వరం", "సిట్" అంటూ కాలయాపన చేస్తూ, అసలు పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు.
పరిపాలనా చేతకానితనం నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అలాగే సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి తప్పించుకునేందుకు సిట్ నోటీసులను ఒక అస్త్రంగా వాడుకోవడం హేయనీయమని మహేష్ బిగాల అన్నారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్‌రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇలాంటి రాజకీయ డ్రామాలతో వారిని ఎంతో కాలం మోసం చేయలేరని హితవు పలికారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారైల తరఫున ముక్తకంఠంతో ఖండిస్తున్నామని మహేష్ బిగాల స్పష్టం చేశారు.









































