Beeda Ravichandra (@brc_tdp) header
Beeda Ravichandra (@brc_tdp) profile picture

Member of Legislative Council, Andhra Pradesh || @jaitdp || TDP President , Nellore Parliament. #TDPTwitter

Nellore, India
Joined February 2018
Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)Photo by Beeda Ravichandra (@brc_tdp)
కార్తీక దీపాల వెలుగులు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు... ఓం నమః శివాయ! హర హర మహాదేవ! 🙏 #కార్తీకపౌర్ణమి #KarthikaPournami #OmNamahShivaya #BeedaRaviChandra
81
నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారితో పాటు వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జిల్లా అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారు.
5
28
399
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారిని నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వారిని సన్మానించిన నెల్లూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్.
11
188
కావలి, గూడూరు, కందుకూరు మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీ నుండి పోటీ చేస్తున్న కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీల నుండి బరిలో ఉన్న అభ్యర్థులను ఆశీర్వదించండి. ఓటమి భయంతో రాద్ధాంతం సృష్టించడానికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన విఫల ప్రయత్నాలను కావలి ప్రజలు గమనిస్తున్నారు. తారు, కంకర కాదు కనీసం మట్టి రోడ్డైనా వేస్తారనే ఆశతో వైసీపీ హయాంలో తుమ్మలపెంట రోడ్డుపై బురదలో దొల్లాడినా ఫలితం లేదు...మీరా అభివృద్ధి గురించి మమ్మల్ని విమర్శించేది? ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 7600 కోట్ల రూపాయల పంచాయతీరాజ్ నిధులను దుర్వినియోగం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో "పల్లె పండుగ" కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. వైసీపీ హయాంలో లైట్లు వేసే దిక్కు లేదు, చీపుర్లు కొనే పరిస్థితి లేదు, కనీసం నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో నాడు సర్పంచులు ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కొనసాగేందుకు కూటమి అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాము. బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. బిజెపి సీనియర్ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్, ముదిరాజ్ సాధికార సమితి కన్వీనర్ పి ఎల్ రావు, TNSF అధ్యక్షులు అమృల్లా, బీసీ సెల్ నేత రాజా, దోర్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ..... తొలి విడతలో జరిగిన మండల పరిషత్, జిల్లా పరిషత్, మేయర్ ఎన్నికలలో పోటీ చేసిన కూటమి పార్టీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రజలు ఘనవిజయాన్ని అందించారు. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి సహకారం, నారా లోకేష్ గారి తోడ్పాటుతో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంను మెచ్చి ప్రజలు ఆశీర్వదించారు. 2014 - 19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 2024 కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖామాత్యులుగా పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ వంటి వినూత్న కార్యక్రమాలతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-24) పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది. గ్రామాల్లో అభివృద్ధికి బదులు విధ్వంసం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 7600 కోట్ల రూపాయలను దారి మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థను గందరగోళంలోకి నెట్టారు నాటి ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో లైట్లు వేసే పరిస్థితి లేదు చీపుర్లు కొనే పరిస్థితి లేదు, కనీసం నీళ్లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతంకి పైగా తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు గెలుపు డిక్లరేషన్ లను పంచుకున్నారు తప్ప గ్రామాల్లో జరిగిన అభివృద్ధి శూన్యం. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోలేక ప్రతి దశలోనూ వైసీపీ నేతలు అడ్డుకున్నారు, ఓటర్ లిస్టులను, రిజర్వేషన్లను అడ్డుకున్నారు, పిటిషన్లు వేసి కోర్టుల చుట్టూ తిరిగారు. మా ప్రభుత్వంలో మాపైనే వైసీపీ నేతలు దాడులు చేశారు, పెట్రోల్ బాంబులు విసిరారు, కార్లతో టిడిపి నేతలను తరిమితరిమి గుద్దారు , కత్తులతో దాడి చేశారు. ఆసుపత్రుల పాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు, పెట్టుబడులను అడ్డుకునేందుకు, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులను గురి చేసేందుకు ప్రయత్నించారు. ఓటమి భయంతో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్నటి రోజున రాద్ధాంతం సృష్టించారు. హుందాగా ఎన్నికల బహిష్కరణ చేస్తే ఇబ్బంది లేదు, ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు టిడిపి నేతలపై నిందలు వేస్తున్నారు. అధికారులను అడ్డుపెట్టుకొని టిడిపి నేతలు నామినేషన్లను తిరస్కరించారనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కుట్ర పూరిత ఆలోచనలతో వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. ఎవరెన్ని డ్రామాలు ఆడిన నాటి తెలుగుదేశం పార్టీ హయాంలో (2014 - 19), 2.5 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో కావలిలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కావలిలో 90 శాతం, 80 శాతం పూర్తి చేసిన అభివృద్ధి పనుల తాలూకు పెండింగ్ పనులను వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కూడా పూర్తి చేయలేకపోయింది.
132
కావలి మున్సిపల్ ఛైర్మన్ కూటమి అభ్యర్థిగా ఎంపికైన గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ గారు …. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారిని నెల్లూరు నగరంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు, కార్పొరేటర్ రఘునాధ రాజుగారు , మండ్ల ఈశ్వరయ్యగారు, శ్రీనివాసుల యాదవ్ గారుఉన్నారు.
4
250
బాలల చిరునవ్వులే రేపటి భారతావనికి వెలుగులు... వారి కలలను సాకారం చేస్తూ, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన బాల్యాన్ని అందించడం మనందరి బాధ్యత. బాలలందరికీ హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు!🎉 #HappyChildrensDay #ChildrensDay2026
2
77
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు @ravi_gottipati
1
2
13
239
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. అజ్ఞానమనే చీకటిని పారదోలే దీపకాంతుల వేడుక.. లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలతో విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు #HappyDiwali #BeedaRaviChandra
4
236
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎనెల్ హాస్పిటల్ ఛైర్మన్ కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ గారి కుమార్తె డాక్టర్ లావణ్య ఆకస్మిక మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వైద్య రంగంలో సుదీర్ఘ భవిష్యత్తు ఉన్న లావణ్య పిన్నవయస్సులోనే తనువు చాలించి ఆత్మీయులకు శోకం మిగల్చడం బాధిస్తోంది. ఎనెల్ హాస్పిటల్ డైరెక్టర్ లావణ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
43
44
5
508
181,941
కూటమి పాలన మెచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు నేటి ఫలితాలు. ఈవీఎం అయినా బ్యాలెట్ పేపర్ అయినా... మున్సిపల్ అయినా జడ్పీ, పంచాయతీ అయినా ఎన్నిక ఏదైనా గెలుపు కూటమి పార్టీలదే ముఖ్యమంత్రిగా పనిచేసి , వైస్సార్సీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ కు ఓటు వేసే ఓపిక లేకపోవడం విచారకరం. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత జగన్ కు, వైస్సార్సీపీ నేతలకు లేదు. 2024 ఎన్నికలకు మించిన విజయాన్ని నేడు కూటమి పార్టీలకు అందించిన ప్రజలకు ధన్యవాదములు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు మించిన విజయాన్ని జడ్పీ, పంచాయతీ ఎన్నికల్లో సాధిస్తాం. బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పిల్ రావు, మనుబోలు శ్రీధర్ రెడ్డి, మాతంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుండి ఎలాగైనా తప్పించుకోవాలని జగన్ స్థాయి నుండి వైసీపీ కార్యకర్త స్థాయి వరకు కోరుకున్నారు. మోసపూరితంగా రిజర్వేషన్ వివాదంను వైసీపీ నేతలు సృష్టించారు, న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు. సర్ ఓటర్ లిస్టు ద్వారా లక్షలాదిమంది వైసీపీ అభిమానుల ఓట్లు తొలగిస్తున్నారని తమకు పాత ఓటర్ లిస్టుతోనే ఎన్నికలు జరపాలని ఆందోళనలు చేశారు. ఎన్నికలను ఏ ఓటర్ లిస్టు ప్రకారం నిర్వహించాలో నిర్ణయించేది ఎన్నికల సంఘమే తప్ప కూటమి పార్టీలు కాదన్న సంగతి వైస్సార్సీపీ నేతలకు తెలియకపోవడం విచారకరం. కొత్త ఓటర్ లిస్టు(సర్) వచ్చేందుకు ఆలస్యం కానుండడం, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా మున్సిపాలిటీ - పంచాయతీ, మండల - జడ్పీలు కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాదంను ప్రభుత్వం గుర్తించింది. ఏ ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలను జరుపగలరో నిర్ణయం తీసుకోవాలని ఏ లిస్టు ప్రకారమైనా తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘానికి కూటమి ప్రభుత్వం తెలియజేసింది. స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ఎన్నికల వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు. 2021 స్థానిక సంస్థల ఎన్నికలను తాను ఎలా నిర్వహించారో జగన్ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను కమ్మవాడని జగన్ అవమానించారు. అధికారులను కులాలతో ముడిపెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల మీద వైసీపీ నేతలు సుప్రీంకి వెళ్లారు....ఎన్నిసార్లు డేటు మార్చినా ప్రజా అభిప్రాయాన్ని మార్చలేకపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని చూసి ఈవీఎమ్ లతో గెలిచామన్నారు, నేడు బ్యాలెట్ పేపర్లతో కూడా 2024కు మించి ఘన విజయం సాధించాం. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్లు వేయనివ్వలేదు. టీడీపీ గెలిచిన స్థానాలను ప్రకటించనివ్వలేదు. నేటి స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నేతలు దూరంగా పారిపోయారు. కొందరు తప్పులు తడకలుగా నామినేషన్లు వేసి ఎన్నికల నుంచి తప్పించుకోవడంతో పాటు కూటమి పార్టీల నేతలపై బురద చల్లుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కోసం ప్రతి రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నారా చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి పాలనను కోరుకుంటున్నారు, కూటమి పాలనతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఓటు రూపంలో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు, వైసీపీ నేతలు ఇప్పటికైనా నాటకాలు కట్టి పెట్టండి.
143
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీల మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి 80,170 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు…. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర గారిని నెల్లూరు నగరంలోని వారి నివాసగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రూప్ కుమార్ యాదవ్ గారిని బీద రవిచంద్ర గారు శాలువాతో సన్మానించారు. అనంతరం మిఠాయి తినిపించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. @PRoopYadav #NelloreMayor #BeedaRavichandra
2
12
298