IAS,Managing Director, Hyderabad Metro Water Supply and Sewerage Board, Govt of Telangana.

Hyderabad
Joined February 2011
Ashok Reddy Korem retweeted
“Saluting the Unsung Heroes” @HMWSSBOnline KPHB Colony Ward held a heartfelt birthday felicitation for Sewerage Work Inspector P. Venkatesh Goud. HMWSSB DGM Degala Venkata Trinadha Rao honored sewerage workers for their tireless service and dedication @MDHMWSSB #SewerageWorkers
2
4
93
Ashok Reddy Korem retweeted
ప్రైవేట్ ఎస్టీపీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి ====================== # అక్టోబర్ 1లోగా నమోదు పూర్తి చేయాలి: జలమండలి # శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ # ప్రైవేట్ ఎస్టీపీల సర్వే, జియో ట్యాగింగ్.. జలమండలి డేటాబేస్‌తో అనుసంధానం # గార్డెనింగ్, పరిశ్రమలు, నిర్మాణాలు, క్లీనింగ్ అవసరాలకు శుద్ధి చేసిన నీరు హైదరాబాద్ నగరంలో శుద్ధి చేసిన మురుగునీటి (Treated Wastewater) పునర్వినియోగాన్ని పెంచడంతో పాటు తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించి, నీటి సంరక్షణను మరింత బలోపేతం చేసేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జలమండలి పరిధిలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు చెందిన అనేక మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STPs) ఉన్నాయి. వీటిలో శుద్ధి చేసిన నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ఒక క్రమబద్ధమైన వ్యవస్థను జలమండలి ఏర్పాటు చేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్, పరిశ్రమల అవసరాలు, క్లీనింగ్, నిర్మాణ కార్యకలాపాలు తదితర తాగేతర అవసరాలకు వినియోగించేలా ప్రోత్సహించనున్నారు. తద్వారా అవసరమైన ప్రాంతాలకు సమీపంలోని ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీటిని అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. *ప్రైవేట్ ఎస్టీపీల సమగ్ర వివరాల నమోదు:* ఈ కార్యక్రమంలో భాగంగా జలమండలి పరిధిలోని అన్ని ప్రైవేట్ ఎస్టీపీలను సర్వే చేసి, జియో ట్యాగింగ్ చేయడంతో పాటు వాటి వివరాలను జలమండలి డేటాబేస్‌లో నమోదు చేయనున్నారు. ప్రతి ఎస్టీపీకి సంబంధించి శుద్ధి సామర్థ్యం, రోజువారీ శుద్ధి చేసిన నీటి పరిమాణం, COD, BOD, pH, TSS తదితర నీటి నాణ్యత ప్రమాణాలను నమోదు చేస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆసక్తి చూపే ప్రైవేట్ ఎస్టీపీలను శుద్ధి చేసిన నీటి నమోదిత సరఫరాదారులుగా గుర్తించనున్నారు. నీటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనే అంశంపై జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. నమోదైన ఎస్టీపీలకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ వద్ద అందుబాటులో ఉన్న శుద్ధి చేసిన నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే అవకాశం కల్పించనున్నారు. *ప్రధాన ప్రయోజనాలు:* ఈ విధానం ద్వారా శుద్ధి చేసిన నీటిని అవసరమైన ప్రాంతాలకు సమీపంలోని ఎస్టీపీల నుంచి అందుబాటులోకి తీసుకురావచ్చు. తద్వారా మంచినీటిని తాగేతర అవసరాలకు వినియోగించడం తగ్గించడంతో పాటు నీటి వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చు. అలాగే ప్రైవేట్ ఎస్టీపీల పనితీరు, శుద్ధి చేసిన నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ, ధ్రువీకరణకు అవకాశం ఏర్పడుతుంది. *అక్టోబర్ 1లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి:* జలమండలి పరిధిలోని అన్ని ప్రైవేట్ ఎస్టీపీ నిర్వాహకులు 2026 అక్టోబర్ 1లోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం జలమండలి అధికారిక వెబ్‌సైట్‌లోని Quick Links → Private STP Registration విభాగాన్ని ఉపయోగించాలి. దరఖాస్తు సమయంలో CAN నంబర్, దరఖాస్తుదారు/సొసైటీ పేరు, ఎస్టీపీ సామర్థ్యం, సాంకేతిక వివరాలు, నిర్వహిస్తున్న నీటి నాణ్యత ప్రమాణాలు, జియో లొకేషన్, ఎస్టీపీ ఫొటోలు, EPTRI ధ్రువీకరణ తదితర వివరాలను సమర్పించాలి. ప్రైవేట్ ఎస్టీపీ నిర్వాహకులు నిర్ణీత గడువులోగా నమోదు పూర్తి చేసి, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని పెంచేందుకు జలమండలి చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరడమైనది.
1
3
2
7
3,993
Appeal to all the citizens of Hyderabad.
19
11
1
30
11,344
Friends .. some one created Fake account with my profile pic .. reported to cybersecurity to take action . Kindly ignore the messages from above no. Regards.. Ashok Reddy IAS MD HMWSSB
1
1
4
785
Congratulations to Mothi nagar.. avanthinagar colony welfare Association 💐💐💐… in view of El Niño and drought conditions..we all should work together.. to recharge ground water in CURE area … @CURErecharge5tmc 🙏
147
Ashok Reddy Korem retweeted
నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు ================ # జూబ్లీహిల్స్‌లో వినియోగదారుడికి రూ.5 వేల జరిమానా తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 33లోని ఒక భవనం వద్ద తాగునీటితో ప్రాంగణాన్ని కడుగుతూ నీటిని వృథా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్–6 అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వినియోగదారుడికి రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. జరిమానా మొత్తాన్ని నోటీసు అందుకున్న ఏడు రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. జలమండలి చట్టం–1989లోని సెక్షన్‌ 38, 39 ప్రకారం నీటిని పొదుపుగా వినియోగించాలని, నీటి దుర్వినియోగాన్ని గుర్తించేందుకు అధికారులు ప్రాంగణాలను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారని స్పష్టం చేశారు. మరోసారి నీటిని వృథా చేస్తే సెక్షన్‌ 42 ప్రకారం తాగునీరు, మురుగునీటి కనెక్షన్లను నిలిపివేయడంతో పాటు తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగునీటిని వాహనాలు, రహదారులు, ప్రాంగణాల శుభ్రతకు వినియోగించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పొదుపుగా వాడాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
59
21
1
90
36,093
When such people will realise?… it’s not lack of awareness… irresponsible..
14
1
3
224
Ashok Reddy Korem retweeted
కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలి ======================== # ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితిని తగ్గించాలి # వర్షపు నీటి సంరక్షణ ప్రతి అపార్ట్‌మెంట్ బాధ్యత కావాలి # ఇంజక్షన్ బోర్ వెల్ ను ప్రారంభించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి అపార్ట్‌మెంట్‌, గేటెడ్ కమ్యూనిటీ వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి బాధ్యతగా స్వీకరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గుట్టల బేగంపేటలోని బీవర్లీ హిల్స్ లోని బీవర్లీ స్ప్రింగ్ అపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన మూడు ఇంకుడు గుంతలను, మరో ఇంకుడు గుంతను డ్రిల్లింగ్ చేసి ఇంజెక్షన్ బోర్‌గా మార్చిన రీచార్జ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఇంకుడు గుంతను, పాడైపోయిన బోరుబావిని వినియోగించి ఏర్పాటు చేసిన రీఛార్జ్ పిట్‌(ఇంజక్షన్ బోర్ వెల్)ను ఆయన ప్రారంభించారు. అనంతరం అపార్ట్‌మెంట్ వాసులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను కేవలం భవన నిర్మాణ అనుమతులు లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందడం కోసమే నామమాత్రంగా ఏర్పాటు చేయవద్దని ఎండీ స్పష్టం చేశారు. ప్రతి భవనం పైకప్పుపై కురిసే వర్షపు నీటి ప్రతి చుక్కను అదే ప్రాంగణంలో భూమిలోకి ఇంకేలా శాస్త్రీయంగా రూఫ్‌టాప్ రేన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు, ఇంకుడు గుంతలు, రీఛార్జ్ పిట్లు నిర్మించాలని సూచించారు. ప్రతి ఇంటిని, కుటుంబాన్ని, అపార్ట్‌మెంట్‌ను నీటి కొరత నుంచి రక్షించుకోవాలంటే వర్షపు నీటి సంరక్షణను మీ బాధ్యతగా స్వీకరించాలి అన్నారు. ప్రభుత్వం, జలమండలి చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే నగరానికి శాశ్వత నీటి భద్రత సాధ్యమవుతుందని అని ఎండీ పేర్కొన్నారు. ట్యాంకర్ బుకింగ్‌లలో భారీ పెరుగుదల: -------------------------- గత ఏడాది వేసవిలో సుమారు 4 వేల అపార్ట్‌మెంట్లు జలమండలి ట్యాంకర్ నీటిని వినియోగించగా, ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 12,500 అపార్ట్‌మెంట్లకు పెరిగిందని ఎండీ తెలిపారు. వర్షాలు కురుస్తున్న రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ట్యాంకర్ బుకింగ్‌లు నమోదవుతున్నాయని చెప్పారు. ట్యాంకర్ బుకింగ్ వ్యవస్థ ద్వారా ప్రతి అపార్ట్‌మెంట్‌, భవనం, ప్రాంతానికి సంబంధించిన రోజువారీ నీటి అవసరాల డేటా జలమండలి వద్ద అందుబాటులో ఉందన్నారు. ఈ సమాచారాన్ని విశ్లేషించి, అత్యధికంగా ట్యాంకర్లు బుక్ చేస్తున్న ప్రాంతాలను గుర్తించడంతో పాటు అవసరమైన ఫిల్లింగ్ స్టేషన్లు, ట్యాంకర్లు, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. గతంలో అయ్యప్ప సొసైటీ, కూకట్‌పల్లి, ఎస్‌.ఆర్‌.నగర్‌, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్యాంకర్ డిమాండ్ అధికంగా ఉండేదని, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ తగ్గినప్పటికీ, సాధారణంగా నీటి సమస్య తక్కువగా ఉండే ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, ఎన్‌టీఆర్‌నగర్‌, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లో డిమాండ్ అనూహ్యంగా పెరిగిందన్నారు. వర్షాలు ఆలస్యంగా కురవడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, బోర్లు ఎండిపోవడం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ: --------------------- గతంలో 300 గజాల స్థలంలో ఒక కుటుంబం నివసించగా, ప్రస్తుతం అదే విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అనేక కుటుంబాలు నివసిస్తున్నాయని ఎండీ పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నీటి అవసరం అనేక రెట్లు పెరుగుతోందన్నారు. జనాభా పెరుగుదల, నీటి డిమాండ్‌, సాంకేతిక అవసరాల ఆధారంగా పంపిణీ లైన్లు, రిజర్వాయర్లు, పంపింగ్ వ్యవస్థలు, వాల్వులు, అంతర్గత నెట్‌వర్క్‌లను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి తదితర దూరప్రాంత జలవనరుల నుంచి అనేక దశల్లో నీటిని పంపింగ్ చేసి తీసుకువస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీ విద్యుత్ వ్యయం, పంపింగ్ స్టేషన్లు, ప్రధాన పైప్‌లైన్లు, నిరంతర పర్యవేక్షణ అవసరమవుతుందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత పరిష్కారం: ------------------------ పైప్‌లైన్ ద్వారా అందించే నీటికి ట్యాంకర్ సరఫరాను శాశ్వత ప్రత్యామ్నాయంగా భావించరాదని ఎండీ సూచించారు. అపార్ట్‌మెంట్ సంఘాలు నీటి వినియోగంపై ఆడిట్ నిర్వహించడం, లీకేజీలను అరికట్టడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, పాడైన బోరుబావులను రీఛార్జ్ పిట్లుగా మార్చడం ద్వారా ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితిని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. బీవర్లీ హిల్స్ లోని అపార్ట్‌మెంట్ వాసులు చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఎండీ అభినందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ కాలనీ ట్యాంకర్ నీటి అవసరం లేకుండా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్ ఇదే స్ఫూర్తితో ముందుకు వచ్చి వర్షపు ప్రతి చుక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు.
5
5
1
9
6,791
Ashok Reddy Korem retweeted
కొత్త సీఎస్ సంజయ్ జాజును మర్యాదపూర్వకంగా కలిసిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ======================= తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బుధవారం అయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు పర్యావరణ హితం కోరుతూ మొక్కను అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
5
3
36
14,138
Ashok Reddy Korem retweeted
12,000 borewells dried up. If this doesn't shake us into action, nothing will. 📉 💧Rainwater harvesting isn't just a policy; it’s an individual and RWA duty. 💧Cleaning and desilting soak pits is a simple wonder that rejuvenates groundwater. ⛈️🌧️Now the rains will give us a second chance. Let’s not waste it to harvest it . 💧Are we ready to act? 🌧️👇 Clips showing cleaning of soak pits in our society 👇👇 #HyderabadWaterCrisis #SaveWater #BorewellRecharge #RWA #ActiveCitizens
7
27
3
48
1,479
Ashok Reddy Korem retweeted
జల మండలిలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ======================== # 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎండీ అశోక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కార్యాచరణను జలమండలి అన్నీ కార్యాలయాలలో నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జలమండలి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పేరుతో 06.03.2026 నుండి ప్రారంభమయ్యే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించిందని, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి.. జలమండలి సంబంధించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి అధికారి శక్తివంచన లేకుండా పనిచేయాలని అన్నారు. జలమండలి ప్రధాన కార్యాయలంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని ఈడీపీ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ వద్ద ఫైల్ డిస్పోసల్ ను పరిశీలించిన ఎండీ పేరుకుపోయిన పాత ఫైళ్లను తొలగించి కార్యాలయాన్ని పరిశ్రుభంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. అవసరమైన ఫైళ్లను భద్రపరచాలి సూచించారు. అవరం మేరకు డాక్యుమెంట్లను స్కాన్ చేసి బ్యాక్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. అన్ని కార్యాలయాలు మరియు పరిసర ప్రాంగణాలను శుభ్రపరిచే కార్యక్రమంతో పాటు మొక్కల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. జలమండలి చెందిన అన్ని కార్యాలయాలలో కార్యాలయ ప్రాంగణం పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని, అలాగే మూసివేసిన ఫైళ్లను సూచిక (ఇండెక్స్) ప్రకారం క్రమబద్ధీకరించి రికార్డు గదిలో భద్రపరచాలని చెప్పారు. ప్రతి కార్యాలయంలో ఈ-ఆఫీస్ వ్యవస్థ, డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, ప్రస్తుతం ఉన్న అన్ని ఫైళ్లను 15 రోజులలో డిజిటల్ రూపంలోకి మార్చాలని ఆదేశించారు. ప్రతి ఫైలు స్కాన్ చేసి రేపటి నుంచి పది రోజులల్లో ఫీజికల్ ఫైళ్లనుతొలగించాలని, అవసరమైన మాన్యువల్ ఫైల్స్ ని ఈ-ఆఫీస్ కి కన్వర్ట్ చేసి పద్ధతి ప్రకారం బధ్రపరచాలని అన్నారు. ప్రతి ఫైలు ఈ-ఆఫిస్ ద్వారా రావాలని, ఒక్కసారి ఈ-ఆఫిస్ లో స్కాన్ అయ్యాక అదే లెటర్ ప్రతి ఒక్కరు మళ్ళి స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదని, అది పై ఆఫిసర్ కు పంపడానికి ప్రతిసారి స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదని వివరించారు. ముందుగా జారీ చేసిన సూచనల మేరకు ప్రతి కార్యాలయం ఉదయం తనిఖీలు నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలనీ, సాధ్యమైనంతవరకు ప్రజాప్రతినిధులను కూడా ఈ తనిఖీల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఉదయం తనిఖీల సమయంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలనీ, ఆమోదించబడిన అన్ని పనులను 7 రోజులలోపే ప్రారంభించి పనులను 99 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వారి పనిచేసే స్థలంపాటు బాధ్యతల వివరాలతో ధృవీకరించి అవుట్‌సోర్సింగ్ డేటాను సిద్ధం చేయాలని చెప్పారు. వీటితో పాటు అన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) కార్యక్రమం నిర్వహించి, నీరు నిలిచే ప్రాంతాలు.. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే ఉపయోగంలో లేని బోర్‌వెల్లను రీచార్జ్ పిట్లుగా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, కలుషిత నీటికి సంబంధించిన అన్ని ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, సీవరేజ్ ఓవర్‌ఫ్లోలు, కస్టమర్ చోకేజీ ఫిర్యాదులను గడువులో పరిష్కరించాలని అన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రతి వార్డులో కనీసం 500 రన్నింగ్ మీటర్లు సీవర్ లైన్లను డీసిల్టింగ్ చేయాలని, 25 మాన్‌హోల్స్ శుభ్రం చేయాలి. దెబ్బతిన్న మాన్‌హోల్స్ మరమ్మత్తులు చేయడంతో పాటు మాన్‌హోల్ కవర్లు 99 రోజుల కార్యక్రమంలో మార్చాలని అన్నారు. నీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక సమయం కేటాయించాలని, ఫీల్డ్ లెవల్ సిబ్బంది, మేనేజర్లు, డీజీఎంలు రోజువారీగా నీటి నాణ్యత, సరఫరా సమయాలు తదితర అంశాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, ఓఅండ్ ఏం, ఫైనాన్స్, పీ అండ్ ఏ, ఐటీ, రెవిన్యూ, ట్రాన్స్మిషన్ సీజీఎంలు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
3
4
12
1,543
Ashok Reddy Korem retweeted
లింగ వివక్షలేని సమాజం కోసం కృషి చేయాలి: ఎండీ అశోక్ రెడ్డి ===================== # జ‌ల‌మండ‌లిలో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం లింగ వివక్షత లేని సమాజం మన అందరి బాధ్యత అని.. అందుకు ప్రతి ఒక్కరూ లింగ వివక్ష నిర్మూలనకు ఇంటి నుండే నాంది పలకాలని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌ల‌మండలి ఉమెన్స్ మినిస్టీరియ‌ల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా, జేఎండీ మియాంక్ మిట్టల్ తో హాజ‌రై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ... లింగ వివక్షతను సమూలంగా నిర్మూలించుటకు మనమందరం మన ఇంటి నుండే ప్రారంభించాలని అన్నారు. కాలానుగుణంగా లింగ వివక్షత తగ్గుతున్నదని సమూల నిర్మూలనకు ప్రజలను మరింత చైతన్య పరచవలసిన అవసరము ఉందని అన్నారు. అలాగే స్వేచ్ఛ ప్రతి మనిషికి అవసరమని, అయితే ఆ స్వేచ్ఛ పరిమితులతో, బాధ్యతలతో ఉంటేనే సమాజం సురక్షితంగా.. సమతుల్యంగా ఉంటుందని చెప్పారు. అయితే అదే సమయంలో, స్వేచ్ఛతో పాటు బాధ్యత, సంస్కారం, మరియు భద్రతపై అవగాహన ఉండాలి. మహిళలకు స్వేచ్ఛ అవసరని అది విద్యలో, ఉద్యోగంలో, అభివృద్ధిలో ముందుకు సాగడానికి అవకాశాలు ఉండాలని ఆకాంక్షించారు. జేఎండీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో శ్రామిక మహిళలు పోరాటం చేసి సాధించుకున్న హక్కుల ఫలితంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారని చెప్పారు. ముందుకాలంతో పోల్చితే రోజురోజుకి మహిళలు ముందుకు సాగుతున్నారని అన్నారు.ఈ రోజున వారు సాధించిన విజయాలకి గుర్తుగా వారిని గౌరివించే రోజని గుర్తు చేసారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళా ఉద్యోగుల‌కు ప‌లు పోటీలు నిర్వ‌హించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ప్ర‌ధానం చేశారు. జ‌ల‌మండలి ఉమెన్స్ మినిస్టీరియ‌ల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్య‌క్షురాలు శైల‌జ‌ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు టీఎన్జీవో రాష్ట్ర మహిళా మాజీ అధ్యక్షురాలు రేచల్, ప్ర‌త్యేక‌ అతిథిగా మదర్ ఫౌండేష‌న్ చైర్మన్ సంధ్య రెడ్డి, ప్రముఖ వైద్యురాలు అఖిలా సుందర్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి ప‌ర్స‌న‌ల్ డైరెక్ట‌ర్ ముహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఉమెన్స్ మినిస్టీరియ‌ల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ బిల్కిస్ బాను బోర్డు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
1
2
9
1,299
Ashok Reddy Korem retweeted
మాన్ హోల్ అంటే.. చెత్త బుట్ట కాదు..! మ్యాన్ హోళ్ల‌లో నుంచి బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు.. డీ-సిల్టింగ్ లో వెలితీత ================== # అవగాహనా కల్పించినా.. మారని తీరు, జల మండలికి తల నొప్పులు # మ్యాన్ హోళ్ల‌లో ఘ‌న ప‌దార్థాలు.. వ్య‌ర్థాలను వేస్తున్న ప్రజలు జ‌ల‌మండ‌లి ఓ అండ్ ఎం డివిజ‌న్ నం-21 పరిధిలో గత రెండు నెలలుగా మాధాపూర్ సర్కిల్, చందర్ నాయక్ తండా.. పరిసర ప్రాంతాలలో సీవ‌రేజ్ ఓవ‌ర్ ఫ్లో ను అధికారులు అరిక‌ట్టారు. వివరాలలోకి వెళ్తే.. చందర్ నాయక్ తండా.. పరిసర ప్రాంతాలలో ప్రధాన సీవరేజ్ పైపులో ఏర్పడిన తీవ్ర చోకేజి కారణంగా మురుగు నీరు వెనక్కి రావడం (బ్యాక్ ఫ్లో).. రోడ్లపైకి మురుగు ప్రవహించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై సోషల్ మీడియా, జలమండలి మెట్రో కస్టమర్ కేర్ కు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు మాధాపూర్ సర్కిల్ బృందం గత మూడు రోజులుగా నిరంతరం శ్రమించి, హై ప్రెషర్ జెట్టింగ్ మెషిన్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్ గ్రాబర్ యంత్రాలతో సహాయంతో ప్రధాన సీవరేజ్ పైపులో ఏర్పడిన సిల్ట్ ను బ‌య‌టికి తీసి మురుగు నీటి ప్ర‌వాహానికి ఆటంకం లేకుండా చేశారు. ఇలా నగరంలో చాల ప్రాంతాల్లో తరుచూ సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫిర్యాదులు నమోదు కావడంతో అధికారులు డీ- సిల్టింగ్ పను చేపడుతున్నారు.. అయితే మ్యాన్ హోళ్ల‌లో నుంచి బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు ఇతర ఘన పదార్థాలను వెలికితీస్తున్నారు. ఆ కారణంగా ఆ ప్రాంతంలో సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతున్నట్టు గుర్తించి.. వాస్త‌వానికి స్పెష‌ల్ డ్రైవ్ లో భాగంగా ఇక్క‌డ డీ-సిల్టింగ్ ప‌నులు నిర్వ‌హించి సిల్ట్ అంతా తొలగించినా, కానీ మ‌ళ్లీ అందులో వ్య‌ర్థాలు వేయ‌డం వ‌ల్ల అది పేరుకుపోయి మ‌ళ్లీ ఓవ‌ర్ ఫ్లో కావడం సర్వసాధారణం అయింది. ప్ర‌జ‌ల అవ‌గాహ‌న లేమితో ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య మ‌ళ్లీ ఉత్ప‌న్న‌మయింది. జ‌నాల్లో అవ‌గాహ‌న‌, వారి నుంచి స‌రైన స‌హ‌కారం లేకుంటే ఇలాంటి స్పెష‌ల్ డ్రైవ్ లు ఎన్ని చేప‌ట్టినా స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉంటాయి. జ‌ల‌మండ‌లి చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్ లో సీవ‌రేజ్ పైపు లైన్లు, మ్యాన్ హోళ్ల‌లో డీ-సిల్టింగ్ ప‌నులు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మ్యాన్ హోళ్ల నుంచి భారీగా వ్య‌ర్థాల‌ను (సిల్ట్) బ‌య‌టికి తీశారు. ఎన్నో రోజుల నుంచి ఈ వ్య‌ర్థాలు పేరుకుపోయాయి. దీంతో ఇవి మురుగు నీటి ప్ర‌వాహానికి అడ్డుగా మారి మ్యాన్ హోళ్లు పొంగిపోతున్నాయి. ప్ర‌జ‌లు మ్యాన్ హోళ్ల‌లో బ్లాంకెట్లు, బేడీషీట్లు, ప్లాస్టిక్ వ‌స్తువులు, క‌వ‌ర్లు, వాట‌ర్ బాటిళ్లు, ఘ‌న ప‌దార్థాలు లాంటి వ్య‌ర్థాలు వేస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో అయితే మ్యాన్ హోళ్ల నుంచి దిండ్లు, ప‌రుపులు తీసిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి. ఇవ‌న్నీ వేయ‌డం వ‌ల్ల అందులో ప్ర‌వ‌హించే మురుగు నీరుకు ఆటంకం ఏర్ప‌డుతుంది. అది సాఫీగా లేక‌పోవ‌డంతో మ్యాన్ హోల్ మూత‌ల నుంచి బ‌య‌టికి వ‌చ్చి ఓవ‌ర్ ఫ్లో అవుతుంది. ప్ర‌జ‌ల అవ‌గాహ‌న లేమితో ఇలా చేయ‌డం వ‌ల్ల ఓవ‌ర్ ఫ్లో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అదే పౌరుల నుంచి స‌రైన భాగ‌స్వామ్యం ఉంటే, ఓవ‌ర్ ఫ్లో స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇదే కాకుండా.. హోట‌ళ్లు, కార్యాల‌యాలు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య భవనాల య‌జ‌మానులు, బహుళ అంతస్తు భవన సముదాయాల నిర్వాహకులు.. తమ సీవరేజ్ పైపు లైన్ ను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్ వర్క్ కు అనుసంధానం చేయడంతో వాటి నుంచి వచ్చే ఆహార, వ్యర్థ పదార్థాలు మ్యాన్ హోళ్లలో చేరుతున్నాయి. సిల్ట్ ఛాంబ‌ర్లు నిర్మించుకోక‌పోవ‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఫలితంగా సీవరేజ్ పైపు లైన్లపై ఒత్తిడి పెరిగి అవి ఓవ‌ర్ ఫ్లో అవుతున్నాయి. పైన పేర్కొన్న వారంతా త‌మ ప్రాంతాల్లో సిల్ట్ ఛాంబ‌ర్లు ఏర్పాటు చేసుకుంటే.. ఘ‌న వ్య‌ర్థాలు అందులోనే ఆగి మ్యాన్ హోళ్ల‌లోకి మురుగు నీరు మాత్ర‌మే ప్ర‌వ‌హిస్తుంది. తద్వారా వాటిలో నుంచి వచ్చే వ్యర్థాలు మ్యాన్ హోళ్లలో కలవకుండా ఉంటాయి. ఫ‌లితంగా మ్యాన్ హోళ్ల‌లో మురుగు ప్రవాహం సాఫీగా సాగి, ఓవ‌ర్ ఫ్లో వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌వు. వారంతా సిల్ట్ ఛాంబ‌ర్లు నిర్మించుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి మాన్ హోల్ లలో చెత్త వేయకుండా సహకరించాలి. ప్రజలే సహకరించకపోతే హైదరాబాద్ నగరాన్ని ఎవరు కాపాడతారు…? మన మహా నగరం మనందరిది.. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా మాన్ హోల్ లలో చెత్త, ప్లాస్టిక్, నిర్మాణ అవశేషాలు వంటి ఘన వ్యర్థాలను వేస్తున్నారు. జలమండలి సిబ్బంది రాత్రింబవళ్ళు శ్రమించి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజల సహకారం లేకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచడం సాధ్యం కాదు. మాన్ హోల్ అంటే.. చెత్త బుట్ట కాదు..! మన బాధ్యత.. మనమే గుర్తుంచుకుందాం..!! మాన్ హోల్‌లలో చెత్త లేదా ఘన పదార్థాలు వేయకుండా జాగ్రత్త పడదాం..!!
3
6
1
25
3,114
Ashok Reddy Korem retweeted
తాగునీటి సరఫరాపై ఎండీ సమీక్ష ================ వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా విధానాన్ని, ప్రస్తుత డిమాండ్-సప్లై పరిస్థితులను, వివిధ జలాశయాలలో ఉన్న నీటి నిల్వలు, పంపింగ్ సామర్థ్యం, పంపిణీ వ్యవస్థ తదితర అంశాలపై ట్రాన్స్‌మిషన్, ఓఅండ్ఎమ్ విభాగాల ఉన్నతాధికారులతో ఎండీ సమీక్షించారు. ఎండీ మాట్లాడుతూ.. రాబోయే 60 రోజులు తాగునీరు సరఫరా చేసేందుకు క్షేత్ర స్థాయిలో అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలకు కేటాయించే నీటి సరఫరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా సప్లైలో తక్కవ నీరుంటే.. సర్దుబాటు చేసే లాగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నీటి సరఫరా చేసేటప్పుడు సమయ పాలన పాటించాలన్నారు. ఒకవేళ అందులో ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగా ప్రజలకు సమాచారమివ్వాలని తెలిపారు. అలాగే అంగీకరించిన నీటిని సరఫరా కంటే అందనగా సప్లై అవుతున్న నీటిని తగ్గించి తక్కువగా అందుతున్న ప్రాంతాలను గుర్తించి , సమతుల్య పంపిణీకి తక్షణ చర్యలు చేపట్టాలని ట్రాన్స్ మిషన్ అధికారులను ఆదేశించారు. అధికంగా నీరు అందుతున్న ప్రాంతాల్లో సరఫరాను సర్దుబాటు చేసి, తక్కువగా అందుతున్న ప్రాంతాలకు మళ్లించడం ద్వారా ప్రతి ప్రాంతానికి సమానంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల వాల్వ్ ఆపరేషన్లు పునఃసమీక్షించి, సప్లై సమయాలను పునర్వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు. అలాగే, లీకేజీలు, అనధికార కనెక్షన్లు, నీటి వృధాను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఎండీ ఆదేశించారు. పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు, కీలక సరఫరా లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని డిమాండును అంచనా వేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. నగరంలో ఇప్పటికే 1250 ట్యాంకర్లు, 90 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు, 145 ఫిల్లింగ్ పాయింట్స్ ఉండగా.. డిమాండ్ ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ప్రతి జీఎం.. సక్రమ నీటి సరఫరాకు ట్రాన్స్ మిషన్ అధికారుల సమన్వయంతో ఇన్ ఫ్లో ను పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే డిమాండ్ ను తట్టుకునేందుకు వీలుగా.. ఇక నుంచి రాత్రి సమయాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు.. రాత్రి వేళ కమర్షియల్ అవసరాలకు ట్యాంకర్లను డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుకోవాలని సూచించారు. ప్రజలు జలమండలి సరఫరా చేసే నీటిని త్రాగటానికి కాకుండా ప్రాంగణాలు, వాహనాలు కడగడానికి.. ఇతర అవసరాలకు నీటిని వృధా చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని.. అలాగే తాగునీటి సరఫరా సమయాల్లో కొంత మంది మోటార్లతో నీటిని తోడుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి ఈడీ సామ్రాట్ అశోక్, ఆపరేషన్ డైరెక్టర్, నారాయణ, సీజీఎంలు, రెవిన్యూ, ఐటీ విభాగపు అధికారులు పాల్గొన్నారు.
4
3
21
2,537
Ashok Reddy Korem retweeted
నల్లాకు అక్రమంగా బిగించిన మోటార్లు స్వాధీనం ================== జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరానికి జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్ల బిగించుకోవడం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. దీని వల్ల మిగిలిన వినియోగదారులకు.. లో- ప్రెజర్ తో నీటి సరఫరా జరుగుతోంది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న మోటార్లు సీజ్ చేసారు. బుధవారం రోజున ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-6, ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టి కాలనీలో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని స్థానికులు జలమండలి విజిలెన్సు అధికారులకు సమాచారం అందించారు.. దీంతో స్పందించిన అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. ఒకవేళ తక్కువ ప్రెజర్ తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు.
14
33
2
95
8,900
Ashok Reddy Korem retweeted
సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో జాయింట్ ఇన్స్పెక్షన్ ==================== # రెయిన్ వాటర్ డ్రైన్, సీవరేజ్ లైన్లను వేరువేరుగా నిర్మించాలని సూచన # రెయిన్ వాటర్ డ్రైన్ లో సీవరేజ్ కలవకుండా సీవరేజ్ ట్రంక్ మెయిన్ లైన్లను నిర్మాణానికి నిర్ణయం # సైబరాబాద్ కమిషనర్ సృజనతో కలిసి ఎండీ అశోక్ రెడ్డి పర్యటన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెయిన్ వాటర్ డ్రెయిన్ లో మురుగు కలవకుండా ట్రంక్ మెయిన్‌ల అభివృద్ధిపై జలమండలి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మున్సిపల్ జోనల్ కమిషనర్ హేమంత్ కలిసి పర్యటించారు. దుర్గం చెరువు నుంచి ఇబ్రహీమ్ చెరువు ఉన్న ఏ చెరువులోనూ మురుగు చేరకుండా చెరువుల పరిరక్షణ చర్యగా భాగంగా.. మల్కం చెరువు నుంచి నెక్నంపూర్ వరకు బాక్స్ డ్రైన్, సీవరేజ్ ట్రంక్ మెయిన్ ల విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో చిత్రపురి కాలనీ ఎస్టీపీ, ఖాజా కుంటా ఎస్టీపీ, నానక్ రామ్ గూడా ఎస్టీపీ, నెక్నంపూర్ లోని ఇబ్రహీమ్ చెరువు వరకు చేపట్టాల్సిన పనులను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక ప్రదేశాలను సందర్శించి, ప్రస్తుత మురుగు ప్రవాహ పరిస్థితులు, వాననీటి కాల్వల స్థితి, ట్రంక్ మెయిన్‌ల నిర్మాణ పనుల సాధ్యాసాధ్యాలు వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా, వర్షాకాలంలో వాననీటి కాల్వల్లోకి మురుగు నీరు కలిసే ప్రాంతాలను గుర్తించి, ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ ఉన్న అన్ని సీవరేజ్ లైన్లను సర్వే చేసి, ఎక్కడెక్కడి నుంచి మురుగు వాననీటి కాల్వల్లోకి చేరుతోందో మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆ ప్రాంతాల్లో ట్రంక్ మెయిన్‌ల నిర్మాణాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రతిపాదనలు రూపొందించాలని ఎండీ జలమండలి అధికారులను ఆదేశించారు. అన్ని సీవరేజ్ ప్రవాహాలను సమగ్రంగా ఎస్‌టీపీలకు మళ్లించాలని స్పష్టం చేశారు. ప్రతి చుక్క మురుగు నీరు శుద్ధి కావాలని అధికారులకు ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే మొత్తం మురుగు నీటిని ట్రంక్ మెయిన్‌ల ద్వారా సమీప మురుగు శుద్ధి కేంద్రాలకు తరలించి, అక్కడ పూర్తిగా శుద్ధి చేసిన తరువాత మాత్రమే మూసీ నదిలో విడుదల చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శుద్ధి చేయని మురుగు నీరు మూసీలోకి చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్టార్మ్ వాటర్ డ్రైన్స్ సామర్థ్యాన్ని పెంచడం, సీవరేజ్, వర్షపు నీటి కాల్వలను పూర్తిగా వేరు చేయడం, ట్రంక్ మెయిన్‌లకు అనుసంధానమైన నెట్‌ వర్క్‌ను ఆధునికీకరించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయడం, పాత లైన్లను మార్పులు చేయడం, మరియు కాల్వల్లో ఎక్కడైనా మురుగు ప్రవాహం కలిసే పరిస్థితులు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని తెలిపారు. దీనికోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం కోసం వినియోగదారుల డిమాండ్ అంచనా వేయాలని సూచించారు. ప్రతి ఎస్టీపీలో డిజైన్‌లో శుద్ధి చేసిన నీటి సరఫరాకు యూనిట్‌ను తప్పనిసరిగా చేర్చాలని, శుద్ధి చేసిన నీటి నిల్వ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, అనగా ట్రీటెడ్ వాటర్ సంప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిసర ప్రాంతాలలో గార్డెనింగ్, నిర్మాణ కార్యకలాపాలు, ఫ్లషింగ్, ల్యాండ్‌స్కేపింగ్ తదితర అవసరాల కోసం ట్యాంకర్ ద్వారా శుద్ధి చేసిన శుద్ధి జలాన్ని సరఫరా చేయడానికి ప్రత్యేక ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్టు సీజీఎంలు పద్మజ, సుజాత, సీఎంసీ చీఫ్ ఇంజినీర్ శ్రీ లక్ష్మి, ఇరిగేషన్ ఈఈ మల్లేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
3
5
24
3,213
Ashok Reddy Korem retweeted
నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ సమీక్ష ================ # ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచన వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ నీటి వినియోగంపై ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున, నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్ మెంట్ పై ఎండీ అశోక్ రెడ్డి జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి రీజినల్ ఈడీలు,డైరెక్టర్లలు, సీజీఎంలు, జీఎంలతో జూమ్ మీటింగ్ సమీక్ష నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ ఘననీయంగా పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు. గత ఏడాది కంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్ పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్లో నీటి సరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్ స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్ ని డెలివరీ చేసేలాగా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి పొదుపుపై ఎండీ విజ్ఞప్తి: -------------------------- హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు .. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజులలో నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి పౌరుడు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. పౌరులకు ముఖ్య సూచనలు: ------------------------- 1. విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు, ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు. 2. బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి. 3. స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు. 4. లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి. 5. అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి. జలమండలి ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని ఎండీ తెలిపారు. అయినప్పటికీ, వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. “నీరు అమూల్యమైన వనరు. ప్రతి చుక్కను విలువైనదిగా భావించి వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలం” అని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి పౌరుడు నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను పాటిస్తూ జలమండలికి సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో లో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, డైరెక్టర్లు ఆపరేషన్స్-1,2,3 వినోద్ భార్గవ, నారాయణ, శీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
22
35
4
90
10,148