Velampalli Srinivasa Rao (@VelampalliSR) header
Velampalli Srinivasa Rao (@VelampalliSR) profile picture

Ex Minister | Ex MLA | Vijayawada West Incharge -YSRCP| Ex YSRCP President - NTR District.

Vijayawada, India
Joined November 2018
Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)Photo by Velampalli Srinivasa Rao (@VelampalliSR)
.@ncbn గారూ, మల్లాది విష్ణు గారు ఏమైనా నేరస్తుడా? శాంతియుతంగా రిలే దీక్ష చేస్తున్న ఆయనపై టీడీపీ గూండాలతో దాడి చేయించడం ఏంటి? డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్ర‌శ్నిస్తే దాడులు చేయిస్తారా?ఈ దాడిని ఖండిస్తున్నా. వీటికి మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. #NaraLokeshMustResign
25
28
384
🔥 పశ్చిమలో వైకాపా ‘జెన్ జీ వార్’ షురూ! ✊
1
1
5
192
Velampalli Srinivasa Rao retweeted
పని వైయస్సార్‌సీపీది … ప్రచారం చంద్రబాబుది! ‘క్రెడిట్‌ వితౌట్‌ కంట్రిబ్యూషన్‌’-అదే చంద్రబాబు మార్కు రాజకీయం ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశవిదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబుగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ ‌క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. @ncbn గారూ… భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? జూన్‌ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్‌ సంస్థతో కన్సెషన్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్‌ అక్విజషన్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌, సైట్‌ క్లియరెన్స్‌, ఎన్‌ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్‌, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్‌ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ? అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్‌ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ? ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని NOCలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్‌ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్‌ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం. మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం. కానీ చంద్రబాబుగారూ… మీరు అప్పడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడంలేదు. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ‘‘ఎయిర్‌పోర్టు ఉంది… కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవేకోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడితీసుకురావడంతో, కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబుగారూ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి. సంబంధిత ఆధారాలు- tinyurl.com/rv5udede #CreditChorBabu
374
1,207
76
3,662
315,577
Velampalli Srinivasa Rao retweeted
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government. We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in? ‘నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’. ‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? #NaraLokeshMustResign
727
1,928
413
7,370
1,393,058
Velampalli Srinivasa Rao retweeted
ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి @ncbn గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైయస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబుగారు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర. సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైయస్సార్‌సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్‌ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా? అరెస్టులతో వైయస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబుగారూ... అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు. English Version- tinyurl.com/3xf8648k
602
788
159
2,786
610,654
పాలన చేతకాని BR నాయుడు వెంటనే అరెస్ట్ చేయాలి
2
129
గుంటూరులో దళిత మహిళను వివస్త్రను చేసి ఘోరంగా వేధించిన టిడిపి నేతల అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుశ్చర్యకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహం వద్ద శాంతియుత నిరసన.
1
5
145
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కీ.శే. ముద్రగడ్డ పద్మనాభం గారి చివరి విశ్రాంతి స్థలం వద్ద ప్రణమిల్లి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించాము. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.
1
6
187
Velampalli Srinivasa Rao retweeted
𝗧𝗵𝗲 𝗙𝘂𝘁𝘂𝗿𝗲 𝗼𝗳 𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺 𝗣𝗼𝗿𝘁: 𝗗𝗲𝘃𝗲𝗹𝗼𝗽𝗺𝗲𝗻𝘁 𝗼𝗿 𝗦𝗰𝗮𝗺! 𝗗𝗶𝘀𝗶𝗻𝘃𝗲𝘀𝘁𝗺𝗲𝗻𝘁 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗦𝘁𝗮𝘁𝗲'𝘀 𝗘𝘅𝗽𝗲𝗻𝘀𝗲? Port led development provides enormous potential for economic development of the successor State of Andhra Pradesh. With this consciousness, the YSRCP Government ensured commendable progress with respect to development of three ports at Ramayapatnam, Machilipatnam and Mulapeta. The YSRCP Government ensured completion of all the crucial tasks such as land procurement, statutory approvals including financial closure, with respect to all three ports. The YSRCP Government also executed the EPC contracts for completion of the projects and also ensured significant physical progress with respect to the three ports before June, 2024. Some of the examples of economic development that are completely attributable to the Ramayapatnam port demonstrating significant progress are the BPCL’s upcoming greenfield refinery and petrochemical complex and Indosol Solar’s Giga Scale manufacturing plant. The BPCL plant is in close proximity to the port with a refining capacity of 9-12 MMTPA and an estimated investment of over Rs. 1 lakh crore, capitalizing on the port’s deep water capabilities to import crude oil. The Indosol facility is designed as a fully integrated "quartz-to-module" ecosystem and for the project, proximity to the deep-water Ramayapatnam Port is crucial for importing raw materials and exporting the final finished solar modules efficiently. Further JSW Steel is developing two berths in Ramayapatnam port, and the primary purpose of which is handling bulk raw materials such as iron ore and coking coal, needed for the integrated steel plant that JSW Steel is constructing in the YSR Kadapa district. All these projects contribute immensely in generating employment to thousands of individuals and also in increasing State's own revenues. While there so many economic advantages associated possible from the development of Ramayapatnam port, both in terms of securing investments to the State and also contributing significantly to the Tax and Non-tax revenues of the State Government, all that the TDP Government can think of is, the means to turn the Ramayapatnam port into a scam to generate cash flows for the bigwigs of the TDP. The TDP Government is offering a port on which, the Government is spending Rs. 4,929 crores against an upfront payment of only Rs. 1,500 crores by private parties, causing significant loss to the State exchequer, with the State Government having to endure the debt servicing burden to the tune of over Rs. 3,500 crores! 𝗪𝗵𝗮𝘁 𝗞𝗶𝗻𝗱 𝗼𝗳 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝗶𝗰𝘀 𝗶𝘀 𝘁𝗵𝗶𝘀 @ncbn 𝗴𝗮𝗿𝘂 !
119
775
17
2,312
73,530
తిరుమలలో భక్తులు గ‌దుల కోసం రోజుల త‌ర‌బ‌డి వేచి చూడాలి కానీ, @ncbn హయాంలో అగోడ ప్రైవేట్ యాప్‌లో మాత్రం వెంట‌నే దొరికేస్తాయి. ఇదేమీ పాల‌నా? దీనికి ఎవ‌రు స‌మాధానం చెబుతారు బాబూ? #TDPBoodidaParty #SadistChandraBabu
19
16
357
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా పశ్చిమలో నిర్వహించిన కార్యక్రమాలలో
11
205
విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలలో...
3
20
348
దేవాలయాల్లో వరుస హుండీ చోరీలు, అవినీతిపై ఎండోమెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసాం. ​కూటమి పాలనలో గుడుల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఆదాయం తగ్గుతోంది అంటే లోపల ఎంత పెద్ద దోపిడీ జరుగుతుందో అర్థమవుతోంది. కల్తీ నెయ్యి పేరుతో డ్రామాలు ఆడి రేట్లు పెంచి దోచుకుంటున్నారు.
1
2
14
509
ఇన్ని జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు ఎందుకు స్పందించడం లేదు? పవన్ కళ్యాణ్ గారివి దీక్షలా.. డ్రామాలా? ​#APPolitics #TemplesProtection #YSRCP
42
Velampalli Srinivasa Rao retweeted
పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా గారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
122
954
35
5,139
251,887
Velampalli Srinivasa Rao retweeted
హే రామ్‌… సేవ్‌ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం @ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్‌ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్‌ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు పెడతారా? కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది? పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు. సాయికృష్ణ లాకప్‌డెత్‌, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్‌ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్‌, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్‌ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు లింక్‌ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసుల‌కు హుకుం జారీ చేసిన‌ట్లుగా స‌మాచారం వ‌స్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, ఉస్మానియా గోల్డ్‌మెడల్‌ జర్నలిస్ట్‌ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్‌ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం. యూట్యూబర్‌ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్‌ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషన్లపై త‌మ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్‌స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్‌ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్‌ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్‌ వ్యవస్థ కావాలి. హే రామ్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌. English Version- tinyurl.com/3ueswry7
936
1,588
321
4,908
790,016
Velampalli Srinivasa Rao retweeted
నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు. నాన్నగారు.. దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. రోశయ్యగారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
64
561
23
3,258
190,044
అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో
9
384
కీ ॥ శే ॥ వంగవీటి మోహన రంగా గారి 79 జయంతి 💐 కార్యక్రమం లో
1
8
251
కొణిజేటి రోశయ్య గారి 93వ జయంతి కార్యక్రమంలో
1
20
881