@MissionTG

Digital news handle of Telangana's first and leading news portal - https://nitter.cf/t.co/RF0bqgHv8c

Joined November 2013
❇️ ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ❇️ చిత్రబృందంపై ప్రశంసల జల్లు ❇️ తెలంగాణ నేల, భాష, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్య కావ్యం: కేటీఆర్ ❇️ అణచివేతపై ప్రజల పోరాటాన్ని కళ్లకు కట్టారన్న కేటీఆర్ ❇️ ఈ చిత్రానికి ప్రేరణ ఎవరో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య👇 భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో హీరో నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల) ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. అనంతరం థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. "సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం గళమెత్తే తీరును ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. అణచివేతకు గురైన ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడి, ఆ సమాజాన్ని ఎలా ముందుండి నడిపించాడో చక్కటి కథాంశంతో ఆవిష్కరించారు. ఈ అస్తిత్వ పోరాటానికి అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గారికి, హీరో సోదరుడు నాని గారికి, అలాగే చిత్ర నిర్మాణ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలంగాణ నేల నేపథ్యంలో, సహజసిద్ధమైన తెలంగాణ యాస, భాషలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఒక గొప్ప కావ్యంలా సాగింది. అణచివేతకు గురైనప్పుడు ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూపిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమా నేపథ్యం, ఇందులో చూపించిన పోరాటానికి అసలైన ప్రేరణ ఎవరో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది." తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, చారిత్రక పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కించిన చిత్ర యూనిట్‌ను కేటీఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
11
57
731
❇️ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ కసరత్తు ❇️ ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ❇️ ఆరు జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన కేటీఆర్👇 రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో కేటీఆర్ విడివిడిగా భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌ అత్యంత కీలకమైన అంశమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేయాలని సూచించారు. ఎన్‌రోల్‌మెంట్‌కు సంబంధించి పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయానికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లను మోసం చేసిందన్న ఆగ్రహం వారిలో తీవ్రంగా ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. చదువుకున్నవారు తమ సమస్యలతోపాటు తమ కుటుంబాలు, అన్నదాతలు, మహిళలు, యువత సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు ద్రోహం చేసిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని అన్నారు. అయితే ఆ వ్యతిరేకత బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటుగా మారేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మరో రెండు రోజుల్లో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలతో కేటీఆర్‌ సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల నేతలతో విడివిడిగా భేటీ అయి ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా బాధ్యతలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పరిధిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఈసారి పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అభ్యర్థి ఎవరైనా ఎన్నిక పార్టీ గుర్తుపైనే జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
8
39
975
ట్రాన్స్‌కోలో సబ్ స్టేషన్లు, లైన్లు, కెపాసిటీ పెంచి నిమిషం కూడా కరెంట్ పోకుండా చేసినం. ట్రాన్స్‌కో లాభాల్లో నడుస్తుంది.. కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముకుంటున్నట్లే ఇప్పుడు విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తుంది. లాభాల్లో ఉన్న ట్రాన్స్‌కోను ప్రైవేట్‌కు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దేశంలో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పిన చోట ఎక్కడాకూడా మంచి ఫలితాలు రాలేదు. - మాజీ మంత్రి @jagadishBRS
Power sector reforms ❌ Privatisation ✅ Congress government to sell 26% stake in power utilities ⁉️ The Revanth Reddy government appears to be steadily moving towards opening up Telangana’s power sector to private investment, with Telangana Transco reportedly emerging as the first major target for disinvestment. According to reports, the Telangana Power Coordination Committee has decided in principle to explore a 26% stake sale in Transco through a public issue, with PwC likely to be appointed as consultant. Transco is currently wholly owned by the Telangana government. The reported plan is to retain 74% after the proposed sale. The move is being projected as a financial reform, but it raises a larger question: is the government gradually preparing the ground for privatisation of strategic public power utilities? Reports indicate that Transco could be followed by Genco, the two DISCOMs and Singareni in subsequent phases. A proposed power-sector reforms committee is also expected to be headed by economist Professor Arvind Subramanian. The timing is significant. Telangana’s DISCOMs are already under severe financial pressure, with accumulated liabilities and outstanding government dues adding to their burden. Critics argue that using financial distress as a justification for disinvestment could ultimately reduce government control over critical public utilities. The reported proposal also comes amid fresh financial pressure on consumers. Telangana DISCOMs have sought regulatory approval to levy an additional surcharge of ₹0.83 per unit on open-access consumers for October 2026–March 2027. TGERC has invited objections and scheduled a public hearing for October 27. With stake sales, mounting utility debts and additional surcharges unfolding together, the government faces a crucial test: whether these measures will genuinely strengthen Telangana’s power sector or gradually shift a strategic public asset towards private ownership.
9
14
482
హైదరాబాద్‌లో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా ఉండేలా కేసీఆర్ తీర్చిదిద్దిండు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మొట్టమొదటి రివ్యూ చేసింది విద్యుత్ రంగం మీదే.. అద్భుతమైన ఫలితాలు సాధించి చూపించిండు. తెలంగాణ వచ్చిన మూడేళ్లలోనే అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. - మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
3
14
539
2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని సర్వేలన్ని చెబుతున్నయి. సరైన నాయకుడు, సరైన పార్టీని ఎన్నుకుంటేనే మనకు లాభం జరుగుతది.. ఆదమరిచి, ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
2
18
165
2,498
రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు. మూడేళ్ల క్రితమే ఎలక్షన్ల ముందే చెప్పిండు.. ప్రజలు మా చేతిలో మోసపోవాలని కోరుకుంటున్నరు అని అన్నడు, ఆనాటి రోజులు తెస్తా అన్నడు.. అన్నట్టే పాత రోజులు తీసుకొచ్చిండు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
5
21
442
కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ బయటకి రావాలని రోజు అంటున్నరు. కానీ కేసీఆర్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నడు. గణేష్ నిమజ్జనాల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ దేఖ్‌లెంగే పాటలే వినిపిస్తున్నయి. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
6
38
1,062
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. తెలంగాణ భవన్‌లో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు.
5
11
347
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీష్ రెడ్డికి ఇటీవల సర్జరీ అయిన నేపథ్యంలో.. ఆయనను ఏఐజీ ఆసుపత్రిలో పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
5
6
276
Power sector reforms ❌ Privatisation ✅ Congress government to sell 26% stake in power utilities ⁉️ The Revanth Reddy government appears to be steadily moving towards opening up Telangana’s power sector to private investment, with Telangana Transco reportedly emerging as the first major target for disinvestment. According to reports, the Telangana Power Coordination Committee has decided in principle to explore a 26% stake sale in Transco through a public issue, with PwC likely to be appointed as consultant. Transco is currently wholly owned by the Telangana government. The reported plan is to retain 74% after the proposed sale. The move is being projected as a financial reform, but it raises a larger question: is the government gradually preparing the ground for privatisation of strategic public power utilities? Reports indicate that Transco could be followed by Genco, the two DISCOMs and Singareni in subsequent phases. A proposed power-sector reforms committee is also expected to be headed by economist Professor Arvind Subramanian. The timing is significant. Telangana’s DISCOMs are already under severe financial pressure, with accumulated liabilities and outstanding government dues adding to their burden. Critics argue that using financial distress as a justification for disinvestment could ultimately reduce government control over critical public utilities. The reported proposal also comes amid fresh financial pressure on consumers. Telangana DISCOMs have sought regulatory approval to levy an additional surcharge of ₹0.83 per unit on open-access consumers for October 2026–March 2027. TGERC has invited objections and scheduled a public hearing for October 27. With stake sales, mounting utility debts and additional surcharges unfolding together, the government faces a crucial test: whether these measures will genuinely strengthen Telangana’s power sector or gradually shift a strategic public asset towards private ownership.
🤖 Made with AI
10
1
13
708
బీఆర్ఎస్ ఒత్తిడికి మరొక్కసారి తలొగ్గిన రేవంత్ సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్‌లో ప్రారంభమైన ఎత్తిపోతలు. రంగనాయక సాగర్ పంప్‌ హౌస్‌ నుండి గోదావరి జలాలను రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్న పంపులు.
1
12
42
755
❇️ రద్దయిన 1922 నాటి బ్రిటీష్ చట్టంతో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు ❇️ తెలంగాణలో భావప్రకటనా స్వేచ్ఛపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం 👇 తెలంగాణలో ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో తీవ్ర వివాదంలో చిక్కుకుంది. బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఫోన్, ఈమెయిల్ వివరాలు అందజేయాలంటూ సీసీఎస్ ఏసీపీ ‘X’ సంస్థకు పంపిన లేఖ ద్వారా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటీష్ పాలకులు 1922లో ప్రవేశపెట్టిన 'పోలీస్ (ఇన్‌సైట్‌మెంట్ టూ డిసఫెక్షన్) యాక్ట్, 1922' కింద మన్నె క్రిశాంక్‌పై కేసు నమోదు చేసినట్లు సదరు లేఖ ద్వారా వెల్లడైంది. భారత స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో, పోలీసు సిబ్బంది స్వాతంత్ర్య సమరయోధుల ప్రసంగాలకు ప్రభావితమై బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారనే భయంతో వలస ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేయడం, భావప్రకటనా స్వేచ్ఛను హరించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్‌పై ఈ కేసును మొదట ప్రయోగించారు. బ్రిటీష్ కాలం నాటి కాలంచెల్లిన చట్టాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పీసీ జైన్ కమిషన్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసేందుకు, స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు రూపొందించిన వలస పాలన చట్టంగా దీనిని పేర్కొంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని 2023 లో రద్దు చేసింది. అయినప్పటికీ, రద్దయిన 1922 నాటి బ్రిటీష్ చట్టాన్ని ప్రయోగించి మన్నె క్రిశాంక్‌పై అక్రమ కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గం. పోలీసులు ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి, ఇల్లంతా చిందరవందర చేసి, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి అరెస్టు చేశారు. అయితే, బీఆర్ఎస్ లీగల్ సెల్ చేసిన న్యాయపోరాటంతో అదే రోజు సాయంత్రం గౌరవ హైకోర్టు మన్నె క్రిశాంక్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది.
10
18
489
Is Congress planning to ditch Danam Nagender ahead of Khairatabad bypoll ⁉️ Former Khairatabad MLA Danam Nagender appears to be facing fresh uncertainty over his political future after the Supreme Court upheld his disqualification from the Telangana Assembly. Nagender, who had won the Khairatabad seat on a BRS ticket in 2023, later contested the 2024 Lok Sabha election from Secunderabad on a Congress ticket while continuing as an MLA. The Supreme Court dismissed his challenge to the disqualification on September 24. Amid preparations for the Khairatabad by-election, reports indicate that the Congress leadership is considering alternatives to Nagender, with Rohin Reddy emerging as a possible candidate. It is reported that CM Revanth Reddy has discussed the proposal with AICC general secretary KC Venugopal and conveyed his assessment of the constituency’s political equations. Nagender is reportedly seeking clarity from the Congress leadership and is said to have met the Chief Minister twice over the ticket issue. The former MLA is also reportedly unhappy over what he considers a lack of political recognition after joining the Congress. His supporters have expressed concern that he could be denied an opportunity to contest the by-election despite having represented Khairatabad for several terms. Nagender himself has kept his next political move unclear. After the Supreme Court verdict, he said he was ready to contest the by-election but declined to reveal which party he would represent. With Congress yet to formally announce its candidate, speculation over Nagender’s next move and the party’s choice for Khairatabad is likely to intensify in the coming days.
3
7
666
తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం.. తెలంగాణ సోయికి నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించడం ద్వారా మాత్రమే, ఐలమ్మ గారికి నిజమైన నివాళి అర్పించినవాళ్ళమౌతాం: కేసీఆర్ 👇 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బహుజన ఆత్మగౌరవ ప్రతీక, చాకలి ఐలమ్మగా పిలుచుకునే చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా.. కేసీఆర్ వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఘన నివాళులు అర్పించారు. నాటి రాచరిక పాలనలో, తెలంగాణ రైతాంగ న్యాయమైన హక్కులకోసం, ధిక్కార స్వరం వినిపించిన ధీర వనిత, అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీక, ఐలమ్మ అని కేసీఆర్ కొనియాడారు. నాటి భూస్వాములను ఎదురించి ధిక్కార స్ఫూర్తిని, నాటి చట్టాల పరిథిలో న్యాయస్థానంలోనూ పోరాడి గెలిచి ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న, అస్తవ్యస్త పాలనా రాజకీయ పరిస్థితుల్లో చాకలి ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి, ప్రదర్శించిన తెలంగాణ సోయి నేటి యువతకు అనుసరణీయమని స్పష్టం చేశారు. శాంతియుత పంథాలో తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో, ఐలమ్మ అందించిన స్పూర్తి ఇమిడి వున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, వారి జయంతిని అధికారింకగా నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పిందని అన్నారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా,నాటి పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో, మహిళలు శిశు సంక్షేమం, రైతాంగం సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అనేక వినూత్నపథకాలను అమలు చేశామన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ, కుల వృత్తులను పునరుజ్జీవింపచేసి, సబ్బండ కులాల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని మహోన్నతంగా నిలబెట్టినామని కేసీఆర్ గుర్తుచేశారు. అవి సాధించిన ఫలితాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వివరించారు. అదే దిశగా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పాలనా పద్ధతులను మొదటి పాలనా ప్రాధాన్యతలుగా, చిత్తశుద్ధితో అమలు చేయడం ద్వారా మాత్రమే చాకలి ఐలమ్మ గారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
2
6
316
❇️ క్షుద్ర పూజలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు ఈడ్చుతాం ❇️ ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు, కోర్టు ద్వారా బుద్ధి చెబుతాం ❇️ దానం నాగేందర్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు రేవంత్‌కు చెంపపెట్టు ❇️ రాహుల్ గాంధీ మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు ❇️ రాజ్యాంగంపై మీకున్న గౌరవం నిజమే అని నిరూపించు ❇️ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు 👇 ✳️ క్షుద్రపూజలు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు, అద్దంకి దయాకర్ గారు అసత్య ప్రచారం చేస్తున్నారు. ✳️ వారిపై లీగల్‌గా ముందుకు వెళ్తున్నాం.. పరువు నష్టం దావా కేసు ఆధారాలతో సహా ఫైల్ చేసినం ✳️ కోర్టు వారు పిటీషన్ స్వీకరించారు.. వచ్చే బుధవారం నాడు మళ్లీ పిలిచారు.. స్టేట్మెంట్స్ రికార్డు చేస్తం అని చెప్పారు ✳️ దేవుళ్ల దగ్గరకు వెళ్తే కూడా క్షుద్ర పూజలు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ✳️ ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవు.. దిగజారుడు వ్యాఖ్యలు ఉండవు ✳️ మాపై చిల్లరగా ఆరోపణలు చేస్తే, వాళ్ల లాగా మేము స్థాయి దిగజారి మాట్లాడం ✳️ వాళ్లు బురదలో ఉన్నరు మాకు బురద అంటించే ప్రయత్నం చేస్తున్నరు ✳️ ప్రజల సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నరు ✳️ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏమైనవి అని అడిగితే లేని పోని నిందలు చేస్తున్నరు ✳️ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు ✳️ శాసనసభలో కూడా అనేక అబద్దాలు మాట్లాడుతున్నారు.. స్పీకర్ గారికి నోటీసులు కూడా ఇచ్చినం ✳️ మూడేళ్లు అయినా డిప్యూటీ స్పీకర్‌ను కూడా అపాయింట్ చేయలేదు ✳️ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ గారు ఉంటారు.. వారు ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటారు ✳️ కానీ మూడేళ్లు అయినా అపాయింట్మెంట్ జరగలేదు ✳️ ఎన్నిసార్లు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా స్పీకర్ గారు పట్టించుకోవడం లేదు ✳️ మూడేళ్ల నుంచి డైవర్షన్ డ్రామా తప్ప కాంగ్రెస్ పాలనలో చేసిందేం లేదు ✳️ ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే తప్ప, ప్రజల గురించి పట్టించుకోవడం లేదు ✳️ మాటలతో కాలం గడుపుతున్నారు. రాష్ట్రం తిరోగమనం దిశలో పయనిస్తున్నది ✳️ నీళ్ల కష్టాలు, కరెంట్ కష్టాలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదు ✳️ ఎల్ నినో పేరు చెప్పి చేతులు ముడుచుకు కూర్చుంటున్నరు. ప్రతిపక్షంగా మేం ప్రభుత్వాన్ని నిలదీస్తే సహించలేకపోతున్నరు ✳️ ఎవరెన్ని అన్నా, ఎన్ని కేసులు పెట్టినా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది ✳️ మాపై కాంగ్రెస్ నాయకులు చిల్లర కామెంట్స్ చేసినా మేం వాళ్లలాగా నోరు జారడం లేదు ✳️ క్షుద్రపూజలు అంటూ ఆరోపణలు చేసిన వారికి కోర్టు తగిన బుద్ధి చెబుతుందని, తగిన చర్యలు తీసుకుంటుందని బలంగా నమ్ముతున్నాను ✳️బీగోబెల్స్ ప్రచారం చేస్తే వదిలిపెట్టం, ఎంతటి వారినైనా వదలం, ఎంత దూరం అయినా పోతాం.. వారికి శిక్ష పడేదాక వదిలిపెట్టం ✳️ ఈరోజు దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి సుప్రీం కోర్టుగట్టి తీర్పు ఇచ్చింది. ✳️ దానం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రేవంత్‌కు చెంపపెట్టు ✳️ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న రేవంత్‌కు ఇది గట్టి గుణపాఠం ✳️ అధికారంలో చేతిలో ఉంది కదా అని ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు రేవంత్ రెడ్డి ✳️ అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగ విలువలను కాలరాస్తుంటే, ప్రతిపక్షాలను వేధిస్తుంటే న్యాయస్థానాలు గట్టి బుద్ధి చెబుతున్నాయి ✳️ న్యాయవ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా వస్తున్న తీర్పులను స్వాగతిస్తున్నాం ✳️ దానం నాగేందర్ ఒక్కరే కాదు పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రండి. ✳️ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ గారికి తెలంగాణ జరుగుతున్న రాజ్యాంగ హననం కనిపించడం లేదా? ✳️ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటే కనిపించడం లేదా? మీ మాటల్లో నిజాయితీ లేదా? ✳️ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది అని చెప్పుకునే రాహుల్ గాంధీ మరి ఎందుకు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు ✳️ రాజ్యాంగం మీద మీకు నిజంగా గౌరవం ఉంటే, వెంటనే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి ✳️ కాంగ్రెస్ తప్పు చేసిందని, స్పీకర్ గారు ఫిరాయింపుదారులను కాపాడే ప్రయత్నం చేసారని సుప్రీం తీర్పుతో బట్టబయలైంది. మిగతా అందరి శాసన సభ్యులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది ✳️ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అయినా మిగతా వారితో రాజీనామా చేయించండి. అప్పుడు ప్రజలు తీర్పు చెబుతారు ✳️ రేవంత్ రెడ్డి అరాచకాలు సుప్రీం తీర్పుతో బట్టబయలు అయ్యాయి
2
6
464
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే నిరంకుశంగా మారుతున్నది: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ 👇 ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు దాదాపు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, ఎన్నికల సంఘం పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముగ్గురిలో ఇద్దరు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది మెజారిటీ కాదా? ఇప్పటివరకు మెజారిటీ అంటే ఇదే కదా.. ఇప్పుడు దాని నిర్వచనం కూడా మారుతున్నట్టుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చడం వంటి అంశాల్లో సందేహాలకు తావిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే.. “అసలు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?” అని ఆయన నిలదీశారు. దేశ భవిష్యత్తును ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ఉన్న సంస్థ పునాదులే బలహీనపడుతున్న పరిస్థితిలో దాని నిర్ణయాలకు వదిలేయలేమని కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, పౌర సంఘాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు కలిసి ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుపైనా కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. “తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపులు బీఆర్‌ఎస్‌ గెలిచిన స్థానాల్లోనే ఉండటం ఆశ్చర్యం కలిగించలేదు” అని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఒకే పోరాటం జరుగుతున్నదని, అది “కేసీఆర్‌ వర్సెస్‌ అందరూ” అని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి అనైతిక, అక్రమ, బహిరంగంగా ప్రకటించని కుమ్మక్కుకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆ కుమ్మక్కులోకి ఎన్నికల సంఘం కూడా చేరుతున్నట్టుగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ న్యాయస్థానాల్లోనూ, ప్రజల మధ్యనూ పోరాడుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా తొలగించిన ప్రతి ఓటును తిరిగి చేర్పిస్తామని ప్రకటించారు. చివరగా ఆయన తన రాజకీయ సందేశాన్ని మరోసారి స్పష్టం చేస్తూ.. “తెలంగాణలో ఒకే ఒక్క ‘సార్‌’ ఉన్నారు.. అది కేసీఆర్‌ సార్‌. ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమను ఏ ‘ఎస్‌ఐఆర్‌’ కూడా ఓడించలేదు” అని అన్నారు.
1
6
17
431
ఆనాటి రోజులు తెస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్లే తెచ్చారు.. రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు వచ్చాయి.. పరిశ్రమలకు, పంటలకు పవర్ హాలిడేలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయకపోవడం వల్లే కరెంట్ కోతలు వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో సింగరేణి 72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేది.. ఇప్పుడు అది 58 లక్షల టన్నుల పడిపోయింది. 24 గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి నుండి రైతులకు కేవలం 6 గంటలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. - హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
3
12
366
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్ళిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం.
2
17
495
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకొని, లోపలికి వెళ్లకుండా ఆపిన పోలీసులు. పవర్ ప్లాంట్ ఎదుట నిరసనకు దిగిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు.
7
21
433
సుప్రీం కోర్టులో సైతం దానం నాగేందర్‌కు లభించని ఊరట. దానం నాగేందర్‌ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం.
ఫలించిన బీఆర్ఎస్ పార్టీ పోరాటం! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవి ఔట్. ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్. దానం నాగేందర్ పార్టీ మారలేదని, స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు.
1
6
411