Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1) header
Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1) profile picture

Former Corporation Chairman (TS-VCC),Government Of Telangana and BRS Party State Spokes Person.

Hyderabad, Telangana
Joined July 2018
Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)Photo by Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1)
తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు.. అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ కు గుంపులో గోవింద లెక్క మహిళా కమిషన్ మెంబర్ కట్టబెట్టి ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నావ్ కదా సీఎం గారు ? శంకరమ్మకు 2014 లో బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది కేసీఆర్. ఒడగొట్టింది ఎవరు మీరు కాదా? అమరుడు శ్రీకాంత్ చారి కుటుంబానికి రూ.10లక్షలతో పాటు శ్రీకాంత్ చారి తమ్ముడికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం మరియు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఎల్బీనగర్ జంక్షన్కు శ్రీకాంత్ చారి జంక్షన్ గా నామకరణం చేసి శ్రీకాంత్ చారి వీరత్వాన్ని భావితరాలకు చాటిచెప్పినము. శంకరమ్మ పై పోటీ చేసి అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. శంకరమ్మ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంది, అండగ ఉంది బీఆర్ఎస్ పార్టీ యే.. శంకరమ్మను పేరు మీద రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు.. ఇటీవల శంకరమ్మ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కుమారుడి వర్ధంతి, జయంతిని అడ్డుకుంటున్నారని చెప్పింది. బిఆర్ఎస్ పార్టీ హయాంలో మా కుటుంబానికి గౌరవం ఉన్నదని చెప్పింది. దీన్ని బట్టి మీ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఉన్న గౌరవం తెలిసిపోతుంది. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే ప్రజలు నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అని నవ్వుకుంటారు ఉద్యమం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
2
165
అన్ని అనుకూలతలు ఉన్నవారే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ రోజుల్లో.. 90 శాతం వైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు వీల్ చైర్ దివ్యాంగుడు చంద్రకాంత్ సాగర్. వైకల్యం శరీరానికే కానీ.. సంకల్పానికి కాదని నిరూపించిన స్ఫూర్తిదాయక వ్యక్తి చంద్రకాంత్ సాగర్. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా.. తానే ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. ఒకరు ఉద్యోగం పొందడం కంటే.. పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్న కేటీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతూ, పలువురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను కేటీఆర్ అభినందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి, ఆయన పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన కేటీఆర్. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో చంద్రకాంత్ సాగర్‌తో కేటీఆర్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్వయంకృషి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. వైకల్యాన్ని చూసి వెనకడుగు వేయకుండా.. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే విజయమే వరిస్తుందని నిరూపించిన చంద్రకాంత్ సాగర్ ఎందరికో ఆదర్శం.
1
18
299
అచ్చ విద్యాసాగర్ గారి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు అచ్చ విద్యాసాగర్ గారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్న. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అచ్చ విద్యాసాగర్ గారు పోషించిన పాత్ర, పార్టీ బలోపేతానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. ఉద్యమ ప్రస్థానం నుంచి పార్టీ కార్యక్రమాల వరకు తనదైన ముద్ర వేసిన విద్యాసాగర్ గారి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. పార్టీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని, తెలంగాణ ఉద్యమం ఒక క్రియాశీల కార్యకర్తను కోల్పోయింది. ఆయన మరణం పార్టీ శ్రేణులకు తీరని బాధను మిగిల్చింది. ఈ సందర్భంగా అచ్చ విద్యాసాగర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
1
435
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, సోదరులు @BRSNarenderWGL గారి కుమారుడు లోకేష్ పటేల్ వివాహం, హైదరాబాద్‌లోని శామీర్‌పేట ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్‌లో నీక్షత రావు గారితో ఘనంగా జరగగా ఈ వివాహ వేడుకకు బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన నాయకులతో కలసి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాను.
1
1
222
భూపాలపల్లి జయశంకర్ జిల్లా, భూపాలపల్లి నియోజకవర్గం: సంప్రదాయాల నడుమ... కుటుంబ సభ్యుల మధ్య ఆనందాల దీపావళి సంబరాలు. భూపాలపల్లి నియోజకవర్గంలోని స్వగ్రామం గొర్లవీడులో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించాను. అనంతరం చిన్నారులతో కలిసి టపాసులు కాలుస్తూ, వారి ఆనందంలో భాగస్వామినై దీపావళి సంబరాలను మరింత ప్రత్యేకంగా జరుపుకున్నాము. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి, మన సంప్రదాయాలను పాటిస్తూ ఆప్యాయతలు, అనుబంధాల మధ్య పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని శ్రీ కేదారేశ్వర స్వామివారిని ప్రార్థించాను. కుటుంబ బంధాలకు, సంప్రదాయాలకు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. 🪔 అందరికీ దీపావళి శుభాకాంక్షలు. #DiwaliCelebrations #KedareswaraVratham #Gorrlaveedu #Bhupalpally #HappyDiwali
18
641
చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే పండుగ దీపావళి🪔 ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి... ప్రతి హృదయంలో సంతోషాల వెలుగులు విరజిమ్మాలి... ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలి... చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర దీపావళి పర్వదినం మీ జీవితాల్లో కొత్త ఆశలను, సరికొత్త అవకాశాలను, సిరిసంపదలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు 💐 సర్వేజనా సుఖినోభవంతు. 🪔 #HappyDiwali2026
9
181
హైదరాబాద్ : విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహం… యువత నాయకత్వానికి నూతన వేదిక.. వరంగల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులను వెంట బెట్టుకొని, ఎమ్మెల్సీ @PSReddyTRS గారితో కలిసి ఐటీశాఖ మాజీ మంత్రివర్యులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యార్థుల విద్యా, ఉపాధి అవకాశాలు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, యువతకు అవసరమైన నైపుణ్యాలు వంటి అంశాలపై కేటీఆర్ గారితో విద్యార్థులు ఆసక్తికరంగా చర్చించారు. అదే సమయంలో వరంగల్ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను, సృజనాత్మక ఆలోచనలను, నాయకత్వ లక్షణాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు విద్యార్థులు వినూత్నంగా రూపొందించిన Gen Z Youth Event – LIT 2026, "why Not in Warangal" కార్యక్రమం గురించి వివరించి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కేటీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది. విద్యార్థుల ఆలోచనను అభినందించిన కేటీఆర్ గారు, వారి సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ LIT 2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. యువతలో అపారమైన ప్రతిభ ఉంది… వారికి సరైన వేదిక, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తే అద్భుతాలు సృష్టించగలరు. వరంగల్ యువ ఇంజనీర్ల ఆలోచనలకు, ఆశయాలకు ప్రతిరూపంగా నిలవనున్న LIT 2026 విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. యువత ఆలోచనలకు అండగా… వారి భవిష్యత్తుకు బాటగా… LIT 2026. #LIT2026 #Warangal #GenZ #YoungIndia #EngineeringStudents #KTR #YouthLeadership #BRS
1
9
323
Dr.Kethireddy Vasudeva Reddy retweeted
హనుమకొండ జిల్లా : విద్యార్థుల ఆలోచనకు వేదిక… యువత కలలకు కొత్త దిశ🚀 ఉత్సాహభరితమైన వాతావరణంలో వరంగల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆత్మీయ సోదరులు ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @PSReddyTRS గారితో కలసి పాల్గొన్నడం జరిగింది. విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి ప్రతిభకు, ఆలోచనలకు, నాయకత్వ లక్షణాలకు గుర్తింపు తీసుకొచ్చేలా ఒక వినూత్నమైన Gen Z తరహా యూత్ ఈవెంట్ నిర్వహించాలనే వారి ఆలోచన నిజంగా అభినందనీయం. ఈ అద్భుతమైన ఆలోచనకు అంకురార్పణ జరిగేలా, విద్యార్థుల ఆకాంక్షలను ముఖ్యమైన నాయకుల దృష్టికి తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషించడం ఆనందంగా భావిస్తున్నాను. యువత కేవలం ఆలోచనలకే పరిమితం కాకూడదు… ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశాలు కూడా వారికి కల్పించాలి. ఈ ప్రయాణంలో విద్యార్థులకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారి కలలకు పెద్ద వేదిక లభించాలని, వరంగల్ విద్యార్థుల ఐక్యతకు ఈ కార్యక్రమం ఒక కొత్త అధ్యాయంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ క్రమంలో LIT’26 అధికారిక లోగోను ఖరారు చేయడం కూడా సంతోషకరమైన విషయం. Youth Has Ideas. Youth Deserves a Platform. Let's Make It Happen. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. #LIT2026 #Warangal #GenZ #EngineeringStudents #YouthPower #StudentUnity #యూతలీడర్షిప్
1
5
180
హనుమకొండ జిల్లా : విద్యార్థుల ఆలోచనకు వేదిక… యువత కలలకు కొత్త దిశ🚀 ఉత్సాహభరితమైన వాతావరణంలో వరంగల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆత్మీయ సోదరులు ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @PSReddyTRS గారితో కలసి పాల్గొన్నడం జరిగింది. విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి ప్రతిభకు, ఆలోచనలకు, నాయకత్వ లక్షణాలకు గుర్తింపు తీసుకొచ్చేలా ఒక వినూత్నమైన Gen Z తరహా యూత్ ఈవెంట్ నిర్వహించాలనే వారి ఆలోచన నిజంగా అభినందనీయం. ఈ అద్భుతమైన ఆలోచనకు అంకురార్పణ జరిగేలా, విద్యార్థుల ఆకాంక్షలను ముఖ్యమైన నాయకుల దృష్టికి తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషించడం ఆనందంగా భావిస్తున్నాను. యువత కేవలం ఆలోచనలకే పరిమితం కాకూడదు… ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశాలు కూడా వారికి కల్పించాలి. ఈ ప్రయాణంలో విద్యార్థులకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారి కలలకు పెద్ద వేదిక లభించాలని, వరంగల్ విద్యార్థుల ఐక్యతకు ఈ కార్యక్రమం ఒక కొత్త అధ్యాయంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ క్రమంలో LIT’26 అధికారిక లోగోను ఖరారు చేయడం కూడా సంతోషకరమైన విషయం. Youth Has Ideas. Youth Deserves a Platform. Let's Make It Happen. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. #LIT2026 #Warangal #GenZ #EngineeringStudents #YouthPower #StudentUnity #యూతలీడర్షిప్
1
5
180
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, అనంతరం కాజీపేట రైల్వే స్టేషన్‌లను సందర్శించి, అక్కడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కలిసి పట్టభద్రుల ఓటరు నమోదులో భాగస్వాములు కావాలని పార్టీ ముఖ్య నాయకులతో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.
2
123
హనుమకొండ జిల్లా : ప్రతి పట్టభద్రుడి ఓటు, ప్రజాస్వామ్య బలోపేతానికి పునాది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారిని, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, అనంతరం కాజీపేట రైల్వే స్టేషన్‌లను సందర్శించి, అక్కడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కలిసి పట్టభద్రుల ఓటరు నమోదులో భాగస్వాములు కావాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్ ముదిరాజ్ గార్లతో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చాం. ఓటరు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6, 2026 చివరి తేదీ అని గుర్తుచేస్తూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, తమతో పాటు ఇతర పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది.
1
104
📰 నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో 'నిరంతర విద్యుత్ హామీ ఏమైంది'. ప్రత్యేక కథనం ప్రజా సమస్యలను, ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రశ్నిస్తూ నేను రాసిన వ్యాసం నేటి (30-10-2026) నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైంది. దయచేసి చదవగలరు.
3
169
హన్మకొండ జిల్లా : పట్టభద్రుల ఓటరు నమోదు లో భాగంగా హనుమకొండ లోని విద్యాసంస్థల్లో బీఆర్‌ఎస్ పార్టీ నేతలతో కలసి విస్తృత ప్రచారం. వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కు సంబంధించి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి గార్ల తో కలసి తేజస్విని స్కూల్ మేనేజమెంట్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ గార్లతో తో ప్రత్యేకంగా సమావేశమై, పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించాము. అర్హులైన పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థల యాజమాన్యాల సహకారాన్ని కోరాము. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియపై విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, అర్హులైన పట్టభద్రులు నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునేందుకు తేజస్విని స్కూల్ యాజమాన్యం స్టాఫ్ అందరు ఆన్‌లైన్ ఓటరు నమోదు చేసుకునే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.
7
288
వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్ ముదిరాజ్ గార్లతో పాటు బిఆర్ఎస్వి నాయకులతో కలిసి క్యాంపస్‌లో విస్తృతంగా పర్యటించి ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసి, యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఆన్లైన్ సెంటర్ ను ప్రారంభించాము.
156
హన్మకొండ జిల్లా: 📍 కాకతీయ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం. వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కేయూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్ ముదిరాజ్ గార్లతో కలిసి క్యాంపస్‌లో విస్తృతంగా పర్యటించాము. ఈ సందర్భంగా కేయూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం, పరీక్షల విభాగం, వివిధ డిపార్ట్‌మెంట్లు, హ్యుమానిటీస్ భవనంతో పాటు పలు విభాగాలను సందర్శించి, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశాము. 🗳️ ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలి. ఈ కార్యక్రమంలో కేయూ బీఆర్‌ఎస్‌వీ నాయకులు పాల్గొన్నారు.
1
3
235
హన్మకొండ: పట్టభద్రుల ఓటరు నమోదుపై కిట్స్, ఎస్‌ఆర్ విద్యాసంస్థల్లో బీఆర్‌ఎస్ పార్టీ నేతల విస్తృత ప్రచారం. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, సతీష్ కుమార్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి గార్ల తో కలసి ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది. ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యానికి చెందిన మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎస్‌ఆర్ విద్యాసంస్థల యాజమాన్యానికి చెందిన వరదారెడ్డితో నాయకులు ప్రత్యేకంగా సమావేశమై, పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించారు. అర్హులైన పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థల యాజమాన్యాల సహకారాన్ని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియపై విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, అర్హులైన పట్టభద్రులు నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునేందుకు కిట్స్ కళాశాల ప్రాంగణంలో ఆన్‌లైన్ ఓటరు నమోదు కౌంటర్‌ను అందుబాటులో ఉంచారు. పట్టభద్రులు తమ అర్హతను నిర్ధారించుకుని, నిర్దేశిత నిబంధనల ప్రకారం ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి – ప్రతి ఓటు ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడాలి అనే సందేశంతో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు.
6
239
పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో న్యాయవాదులు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి హనుమకొండ, వరంగల్ జిల్లాల కోర్టు సముదాయంలో మాజీ ఎంపీ @vinodboianpalli గారు స్థానిక మాజీ ఎమ్మెల్యే @dasyamofficial గార్లతో, లీగల్ సెల్ న్యాయవాదులతో కలిసి పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాము. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని అవగాహన కల్పించడం తో పాటు కోర్టు ఆవరణలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ కౌంటర్ ను అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. #పట్టభద్రులఓటరునమోదు #వరంగల్ #హనుమకొండ #న్యాయవాదులు #MLCElection
11
351
హన్మకొండ జిల్లా: ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఓటర్ నమోదులో ముందుండాలి. పట్టభద్రుల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. వరంగల్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశం స్థానిక మాజీ శాసన సభ్యులు దాస్యం వినయభాస్కర్ గారి నేతృత్వంలో జరగగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గార్లతో కలసి మాట్లాడడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవసరమైన మొదటి అడుగు ఓటరు నమోదు. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా చూడటం మనందరి బాధ్యత. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి పట్టభద్రుడికి భాగస్వామ్యం కల్పించే ఒక ముఖ్యమైన బాధ్యత. మన పార్టీ గులాబీ సైన్యం ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో, ప్రతి కాలనీలో విస్తృతంగా పనిచేయాలి. అర్హులైన పట్టభద్రులను గుర్తించాలి. వారికి ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించాలి. అవసరమైన దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించి, ఎవరూ ఓటు హక్కుకు దూరం కాకుండా కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పనితీరు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రజల్లో తీవ్ర చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పట్టభద్రుల సమస్యలు, వారి ఆకాంక్షలు, భవిష్యత్తు అవకాశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలు కావాలి. పట్టభద్రుల సమస్యలే పరిష్కారంగా ప్రధాన ఎజెండాగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు, రాష్ట్ర అభివృద్ధి నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాల వరకు మన పార్టీ చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదే సమయంలో, ప్రస్తుత ప్రభుత్వ హామీలు ఎంతవరకు అమలయ్యాయి? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల పరిస్థితి ఏమిటి? ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? విద్యార్థులకు అందుతున్న అవకాశాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై వాస్తవాల ఆధారంగా ప్రజల్లో చర్చ జరగాలి. ప్రజల సమస్యలను వినాలి. వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. మన పార్టీ తరఫున స్పష్టమైన విధానాలను, గతంలో చేసిన పనులను, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించాలి. ముఖ్యంగా ఓటర్ నమోదు కార్యక్రమం కేవలం సమావేశాలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలి. మనం చేసే ప్రతి ప్రయత్నం అర్హులైన పట్టభద్రులకు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలి. వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల సమస్యలు, ప్రభుత్వ పనితీరు, యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు ప్రధాన చర్చాంశాలుగా నిలవాలి. ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి సమస్యలపై నిరంతరం స్పందించాలి. వారి మధ్యకు వెళ్లాలి. వారి గొంతుకగా నిలవాలి. కాబట్టి ఈరోజు ఈ సమావేశం నుంచి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలి. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించాలి. నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రజాస్వామ్య హక్కులపై అవగాహన పెంచాలి. మనమందరం సమన్వయంతో పనిచేసి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిస్తున్నాను. జై తెలంగాణ. జై కేసీఆర్..
17
481
📚 పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం హన్మకొండలో కళాశాల అధ్యాపకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాము. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా హనుమకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల అధ్యాపకులను కలిసి, పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేశాము. పట్టభద్రుల ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి బలం. ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని, తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చాము. ఓటరు నమోదు ప్రజాస్వామ్య బలోపేతానికి తొలి అడుగు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు.
4
248