Steve Harrington🏌️ retweeted
List:- 1 @RajaShekar7307 @sonubharath6 @hitheswarnaidu @devoteoftarak0 @HowleyGadu @YOGIRED35461376 @STRA1909 @AAsunny017 @tweetscrazee @silentsoulzone @Harsha_Dhfm6
@kiran481607 @VadhuSarojaa @AAdhfManohar @manadude12 @ssummanthwas2 @NaniBhayya
Steve Harrington🏌️ retweeted
#BewareOfOriginalScamsters
సామాన్యుడిగా మొదలై 1000 కోట్లకి అధిపతి..
ఇదేదో స్ఫూర్తిదాయకమైన కథ కాదు.
జగన్ వ్యక్తిగత సహాయకుడు ప్రభుత్వ సొమ్ము దోచి కూడబెట్టిన సొమ్ములు. అదేంటో జగన్ తో సహా వైసీపీలో చాలామందిది ఇదే తంతు.
సామాన్యుడిగా మొదలయ్యి రాజకీయాల్లోకి వచ్చి వేల/ లక్షల కోట్లు సంపాదించేశారు.
ఆ విజయ రహస్యం ఏంటో ప్రజలందరికీ చెబితే దేశంలో పేదరికం లేకపోదును కదా!!
Steve Harrington🏌️ retweeted
అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి
•పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి
•ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
Steve Harrington🏌️ retweeted
Check these ID's
@Hrithik_Trends
@hellosri8
@K23139100Charan
@RohanReddy2000
@Raju_ch_11
@tweetscrazee
@catlyn9955
@IAM_Adarsh07
@RuthvikaaMSD
@MoodUplifter
@Prathap_reddy26
@sudarxhan
@munna0q
@sai69157
@Rebelstaaaarrrr
@Giri_046
🔁 Retweet is mandatory
Drop your ID's.
Steve Harrington🏌️ retweeted
అక్వాన్ తుపాన్ పట్ల అత్యంత అప్రమత్తత అవసరం
•గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం
•రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం
•నెల్లూరు - తుని మధ్య తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోంది
•భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి
•ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలి
•అక్వాన్ తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష
అక్వాన్ తుపాను రూపంలో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది సర్వ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత రెండు తుపానులతో పోలిస్తే అక్వాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నెల 19, 20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నెల రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు రూపంలో రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం లేనప్పటికీ, పంట నష్టం, ఆస్తి నష్టం తప్పలేదు. తుపానుల కారణంగా దాదాపు 520 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, ధ్వంసమైన రోడ్లు వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాం. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలి.
అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున, తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలి. పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
రైతుల్ని అప్రమత్తం చేయండి
గ్రామీణ ప్రాంతాల్లో వరి పంట చేతికి వస్తుందనగా అక్వాన్ తుపాను రూపంలో విపత్తు సంభవించడం దురదృష్టకరం. రైతులకు పంట నష్టం తగ్గించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తగిన సహకారం అందించాలి. కోతకు వచ్చిన పంటను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. దీంతో పాటు విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్నందున, వాటి తక్షణ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలి. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు తక్షణం సేకరించి, పునరుద్ధరణ ప్రక్రియ త్వరగా ప్రారంభం కావాలి.
ప్రజలు బీచ్‌ల వైపు వెళ్లకుండా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల తుపాను గాలుల్లో చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారుల జీవితాలు విషాదాంతమైన విషయాన్ని ప్రస్తావించాలి. ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలను తూచా తప్పకుండా పాటిస్తూ, యంత్రాంగానికి సహకరించాలని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు క్షేత్రస్థాయి సిబ్బందితో సహా యంత్రాంగమంతా గ్రామాల్లోనే ఉండాలని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల”ని ఆదేశించారు.
@PIB_India @IPR_AP @pibvijayawada
Steve Harrington🏌️ retweeted
Definitely కొడతాం 😎🔥
That’s the statement from our #KAAKA Megastar @KChiruTweets garu 💥
JAN 13th Sankranthi 2027❤️🔥
#KAAKAOnJan13
Steve Harrington🏌️ retweeted
బ్లో అవుట్ ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan ఆరా
•ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
•వరుస బ్లో అవుట్ ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని దిశా నిర్దేశం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక సమీపంలో ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి వద్ద చోటుచేసుకున్న బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా తీశారు. తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఓఎన్జీసీ సాంకేతిక బృందం బావి వద్దకు చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు, మరో ఐదు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇటీవల తరచూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Steve Harrington🏌️ retweeted
Last name ever.
First name Greatest.
#ForOurThala
Steve Harrington🏌️ retweeted
బ్లో అవుట్ ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆరా
•ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
•వరుస బ్లో అవుట్ ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని దిశా నిర్దేశం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక సమీపంలో ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి వద్ద చోటుచేసుకున్న బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆరా తీశారు. తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ తెలిపారు.
గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఓఎన్జీసీ సాంకేతిక బృందం బావి వద్దకు చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు, మరో ఐదు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఇటీవల తరచూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
@PIB_India @IPR_AP @pibvijayawada
Steve Harrington🏌️ retweeted
సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు
• ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది
• దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు
• తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం
• సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు
• శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం
• రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు.
రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ @AmitShah గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు. ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి. పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం.
• పలు విషయాలపై చర్చించేవారు
కొన్ని సందర్భాల్లో వారిని నేను ప్రత్యక్షంగా కలిశాను. ఫిల్మ్ సిటీలో షూటింగుల్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గానీ వారితో కలిశాను.
వారితోనూ కిరణ్ గారితోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కరోనా అనంతరం కలిసాను. ఆ సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి దేశంలోని అన్ని విషయాల పట్ల చర్చ ఉండేది. ఆయన విషయ అవగాహన చూసి నాకు ఆశ్చర్యం వేసేది.
శ్రీ రామోజీరావు గారి మనోభావాలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం కోసం వారు పడ్డ తపన, ఆరోజు వారితో పంచుకున్న భావాలు నాకు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన "ఈనాడు" గురించి చాలా విషయాలు చెప్పారు. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.
• సమాజంపై ఎంతో బాధ్యత ఉంది
శ్రీ రామోజీరావు గారు ఆలోచనలో సమాజం పై బాధ్యత కనిపిస్తుంది. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి అంశాలల్లో ప్రజలకు ఎలా చైతన్యం కల్పించారో ఆయన నాకు వివరించారు.
వారి కృషి, కార్యదక్షత, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి.
ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నాను.
ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్న వారి జీవితాలు చాలా గొప్ప విలువైన విషయాలు నేర్పుతాయి. శారీరక వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో గుర్తింపు సాధించిన వారు,
పేదల పిల్ల విద్య కోసం పని చేస్తున్నవారు, గిరిజన హక్కులు, రైతు సమస్యలు, పర్యావరణ పరిరక్షణ కోసం కలంతో పోరాడుతున్న జర్నలిస్టులు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, జల సంరక్షణ, వైద్య రంగం, గ్రామీణ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. వైద్య విద్యలో వివక్షతను ఎదుర్కొని న్యాయ పోరాటంతో విజయం సాధించిన వారి సంకల్పం చాలా అభినందనీయం. వైకల్యం మనిషి శరీరానికి ఉండవచ్చు.. కానీ సంకల్పానికి ఉండకూడదు. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది.
ఒక వ్యక్తి విజయం, అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రోత్సాహం కూడా మీ విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మన కోసం...మనం సాధించేది విజయం. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందించే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిని అందించిన రామోజీ రావు గారిని మరోమారు తలుచుకుంటూ వారి అడుగుజాడలు, స్ఫూర్తి, మనందరికీ ఒక బలమైన దారి వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అన్నారు.
Steve Harrington🏌️ retweeted
మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు
రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు.
శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి శ్రీమతి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. రాజాం నుంచి శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి
Steve Harrington🏌️ retweeted
Happy Birthday @MusicThaman anna 🔥🔥🔥🔥
Sankranthi ki Nuvu Shrushtinche Vidhwamsam kosam Prapancham Edhuruchusthundhi 😎😎😎
#KAAKA - JAN 13th Sankranthi 2027❤️🔥
#KAAKAOnJan13
Steve Harrington🏌️ retweeted
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#RamojiExcellenceAwards2026
Steve Harrington🏌️ retweeted
Happy Birthday @MusicThaman anna ❤️❤️ Lots of love and more power to you 🧿🧿
Steve Harrington🏌️ retweeted
Following my recent meeting with Hon’ble Union Home Minister Shri @AmitShah ji and as advised by him, I have submitted a memorandum to Union Minister Shri @kishanreddybjp garu, addressed to the Union Home Ministry and the Ministry of Information & Broadcasting, seeking stronger safeguards against AI misuse, deepfakes and digital impersonation.
Grateful to Shri Kishan Reddy garu for his assurance to coordinate with the concerned ministries and take these concerns forward.
Protecting the dignity, identity and creative rights of artists, alongside the safety of every citizen, is a shared responsibility.
Technology should enhance creativity, not destroy dignity.
#UniteAgainstDigitalAbuse





































