పవిత్ర తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో సైతం డబ్బుల కోసం కక్కుర్తి పడి నెయ్యి కాని కల్తీ కెమికల్ నెయ్యిని సరఫరా చేసి, హిందువుల మనోభావాలతో ఆటలాడిన వైకాపా, ఇప్పుడు తామే హిందువులకు ప్రతినిధులం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక సినిమాలో వచ్చిన రాముల వారి పాటను రాములవారి కీర్తనగా చెపుతూ "మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు పేరుతో పాడి ఒక టీడీపీ కార్యకర్త అవమానించాడనే తప్పుడు ప్రచారాన్ని గొడ్డలి పార్టీ చేస్తున్నది". గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని, మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారిని ఏకవచనంతో సంబోధిస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఈ ఫేక్ పార్టీ సభ్య సమాజంలో ఉండే అర్హత కూడా కోల్పోయింది. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరుతున్నాం. అన్ని మతాల వారిని సమానంగా గౌరవించడం, వారికి ప్రభుత్వంలో, రాజకీయ వ్యవస్థలో సమాన వాటా ఇవ్వడం తెలుగుదేశం సిద్ధాంతం. హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్న ఈ గొడ్డలి పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అందరూ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నాం.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#FactCheckTDP
#AndhraPradesh
పేదవారికి పట్టెడన్నం పెట్టాలనే సదుద్దేశం తో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్నా క్యాంటీన్ ల పై గొడ్డలి పార్టీ తొత్తు పత్రిక సాక్షి తరచు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నది. తాజాగా ఆళ్లగడ్డ లోని అన్నా క్యాంటీన్ పై ఇదే తరహా దుష్ప్రచారం ప్రారంభించింది. మధ్యాహ్నం 3.30pm సమయంలో అన్నా క్యాంటీన్ టైం దాటిన తర్వాత వచ్చిన వారందరికీ కూడా భోజనం అన్నా క్యాంటీన్ సిబ్బంది వడ్డించారు. అక్కడికి వచ్చిన సాక్షి రిపోర్టర్ ముందుగానే అన్నా క్యాంటీన్ సిబ్బందితో భోజనం బాగోలేదు ఇప్పటివరకు ఎందుకు పెడుతున్నారు అంటూ ఆరోపణలు చేసి అక్కడ ఉన్నవారిని రెట్టించి రెట్టించి ఇదేవిధంగా అందరితో చెప్పించాలని ప్రయత్నించాడు.
వాస్తవానికి అక్కడి అన్నా క్యాంటీన్ లో ఎంతో పరిశుభ్రమైన ఆహారాలను అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్ లో అందిస్తున్న ఆహారం పట్ల ఎంతో మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆళ్లగడ్డ కు చెందిన తప్పుడు ' సాక్షి ' రిపోర్టర్ ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడుతున్న జగన్ రెడ్డికి, ఆయన పరివారానికి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడం లేదు. 2014- 2019 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున టిడ్కో ఇళ్లు నిర్మించిన విషయం తెలిసిందే. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉండగా ఎన్నికలు రావడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లకు సౌకర్యాలు కల్పించి లబ్దిదారులకు ఇవ్వాల్సి ఉండగా వాటిని పాడుపెట్టాడు. తన ఐదేళ్ల కాలంలో టిడ్కో ఇళ్లకు తన పార్టీ రంగులు వేసుకున్నాడు తప్ప వాటిని లబ్దిదారులకు ఇవ్వలేదు. అలాంటి జగన్ రెడ్డి, ఆ ‘గొడ్డలి పార్టీ’ నాయకులు ఇప్పుడు సిగ్గు లేకుండా ఆ టిడ్కో ఇళ్లు జగనన్న కట్టినవి అంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. నీలి రంగు పులుముకుని వస్తున్న ఈ బ్లేడ్ బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. దీన్నే క్రెడిట్ చోరీ డిజార్డర్ అంటారు… జగన్.
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
తప్పుడు ప్రచారమే తన ఆయుధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు చేస్తున్న ‘గొడ్డలి పార్టీ’ మరో తప్పుడు ప్రచారానికి తెరలేపింది. తణుకు ఎమ్మెల్యే శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ పేద పిల్లల పట్ల వివక్ష చూపించారంటూ సామాజిక మాధ్యమాలలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నది.
ఈ నెల 24వ తేదీన ఎమ్మెల్యే శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ తణుకు మండలం దువ్వ గ్రామంలో కూటమి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రూ.2.80 కోట్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్, 5 స్లూయిజ్ గేట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణితో కలిసి పరిశీలించారు. ఈ నూతన రిటైనింగ్ వాల్ 5 స్లూయిజ్ గేట్ల కారణంగా అక్కడి జనావాసాలు భారీ వర్షాలు కురిసినా కూడా ముంపునకు గురికాలేదు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ రక్షణ పనులతో 500 కుటుంబాలకు మేలు జగడమే కాకుండా, సుమారు 1,000 ఎకరాల ఆయకట్టుకు వరద ముప్పు నుంచి రక్షణ లభించింది. దువ్వ గ్రామానికి శాశ్వత వరద రక్షణ కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నందున భారీ వర్షాల వల్ల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణితో కలిసి ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న సమయంలో స్లూయిజ్ గేటుపై పక్షి మలం ఉన్న విషయాన్ని చూసుకోలేదు. కలెక్టర్ తో బాటు ఆయన చేతికి కూడా అది అంటింది. దాన్ని సానిటైజ్ చేసుకోవడం మాత్రమే జరిగింది.
ఎమ్మెల్యే శ్రీ రాధాకృష్ణ కుడి చేతితో కరచాలనం చేస్తున్న విషయం వీడియోలో స్పష్టంగా ఉన్నది. పిల్లలను శ్రీ రాధాకృష్ణ ఎంతో ఆప్యాయంగా పలకరించి వారితో కరచాలనం చేశారు. అక్కడి పిల్లలు కలెక్టర్ తో కూడా కరచాలనం చేశారు.
వాస్తవాలు ఈ విధంగా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం వైసీపీ దుష్ట ఆలోచనకు ప్రతీకగా ఉంది.
అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న తణుకు అసెంబ్లీ నియోజకవర్గం చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్న వైసీపీ ఇలా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దు.
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
ఫేక్ బతుకుల ‘గొడలి పార్టీ’ నేతలు నిజమైన క్రీడాకారులను ఫేక్ అంటున్నారు. DSC 2025లో తమ ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులను దారుణంగా అవమానిస్తున్నారు. గొడ్డలి పార్టీ హయాంలో SAP చైర్మన్ గా పని చేసిన వ్యక్తి ఆనాడు పొగిడిన క్రీడాకారులనే ఈనాడు తిడుతున్నాడు. అధికారం కోల్పోగానే మతి పోయిందా? మరచిపోయారా? అంటూ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు.
కడప జిల్లా కు చెందిన ఎన్ శివాజీ నాయక్ సుండిపల్లి మండలం ZPHS మడితాడు ఉర్దూ స్కూల్ లో పీఈటీ గా పని చేస్తున్నారు. సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన శివాజీ నాయక్ ను ‘గొడ్డలి పార్టీ’ ఫేక్ అంటున్నది. 2022 లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన జాతీయ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన ఈ క్రీడాకారుడిని మనం ఎంతో గౌరవంతో చూసుకోవాలి. అంతే కానీ ఫేక్ అంటే ఎలా? ఇదే విషయాన్ని శివాజీ నాయక్ అడుగుతున్నారు.
‘ఆట బతకాలి’ అంటూ ఎంతో ఆవేదనతో చెబుతున్నారు శివాజీ నాయక్. గురు స్థానంలోకి వచ్చిన ఆయన తనలాంటి క్రీడాకారులను తయారు చేయాలనే పవిత్ర లక్ష్యంతో పని చేస్తున్నారు. రెండు శాతం స్పోర్ట్స్ కోటా మాత్రమే ఉండేదని, దాన్ని కూటమి ప్రభుత్వం 3 శాతానికి పెంచి క్రీడాకారులను ఆదుకున్నదని శివాజీ నాయక్ చెబుతున్నారు.
రాజకీయ కారణాలతో ఫేక్ ప్రచారాలు చేస్తూ క్రీడాకారులను అవమానిస్తున్న వైసీపీని గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగమే కాకుండా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషం గా శ్రమిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడుకోవడం తమ బాధ్యత అని ప్రతి టీడీపీ నాయకుడు భావిస్తాడు. అలాంటి వారిలో ఒకరు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు. ప్రజా సమస్యలు తీర్చడం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తుంటే ' గొడ్డలి పార్టీ ' తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఆయన ను ప్రజలు నిలదీసినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
పారదర్శకంగా, నిస్పక్షపాతంగా జరిగిన DSC 2025 నియామకాలపై వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారం చేసుకుంటూ ఆత్మానందం పొందుతున్నారు. ఒక వైపు ఈ ఫేక్ ప్రచారంపై ప్రజలు ఛీ కొడుతున్నా కూడా వైసీపీ మాత్రం క్రీడాకారులను అవమానిస్తూనే ఉన్నది. పెద్దాపురం నియోజకవర్గంలో ఒక క్రీడాకారిణి దేశానికే పేరు తెచ్చేలా కబడ్డీ పోటీలో రాణించి ఆ తర్వాత DSC 2025 లో ఉద్యోగం సాధిస్తే ఆ మహిళపై నీచాతినీచంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఎంతో ఆత్మాభిమానం గల ఆ మహిళా టీచర్ ను అవమానిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారానికి ఎంతో బాధపడుతూ శ్వేత అనే ఆ కబడ్డీ ప్లేయర్ చెప్పిన విషయాలు అందరికి కంటతడిపెట్టిస్తాయి. దేశానికే పేరు తెచ్చిన ఇలాంటి క్రీడాకారులపై కూడా తప్పుడు ప్రచారం చేయడం కరెక్టా జగన్ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
2005లో జరిగిన ప్రధమ మహిళా ఏసియన్ కబడీ ఛాంపియన్ షిప్ బంగారు పతకం సాధించిన శ్వేతపై అభాండాలు మోపుతూ వైసీపీ ఫేక్ ప్రచారం చేసింది. శ్వేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కబడీ ఛాంపియన్ గా నిలిచిన తొలి మహిళా క్రీడాకారిణి.
అలాంటి ఉత్తమ క్రీడాకారిణిపై తప్పుడు ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలి జగన్…
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు తన ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ‘డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు’ అంటూ ఆయన తప్పుడు సమాచారాన్ని సిగ్గు లేకుండా చెబుతూనే ఉన్నాడు. జగన్ రెడ్డి తన పాలనాకాలంలో దారుణమైన నేరాలు చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తుతో బాటు ఇప్పుడు ఎన్ ఫొర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో దిగింది. ఏపిపిఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో జగన్ రెడ్డి బ్యాచ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యి కేసులో కూడా ఈడీ జోక్యం చేసుకుని అరెస్టులు ప్రారంభించింది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ‘గొడ్డలి పార్టీ’ DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
జగన్ రెడ్డి పదే పదే టీచర్లను అవమానిస్తూ ‘డబ్బులు పెట్టి పోస్టులు కొనుక్కున్నారు’ అంటున్నాడు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. వివరణలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టతనిచ్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జగన్ రెడ్డి చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు DSC 2025 లో ఎంపికై గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న గాయత్రి అనే టీచర్ జగన్ రెడ్డి కళ్లు తెరిపించేలా మాట్లాడారు. ఇది విని అయినా సిగ్గు తెచ్చుకో జగన్….
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
ముస్లిం మైనారిటీలు క్రీడలలో రాణిస్తుంటే ‘గొడ్డలి పార్టీ’ భరించలేకపోతున్నది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ముస్లిం మైనారిటీ క్రీడాకారులను పదే పదే అవమానించే రీతిలో తన పత్రికలో, తన ఛానెల్ లో, తన సోషల్ మీడియాలో విషయం చిమ్ముతున్నాడు.
కర్నూలు జిల్లా దొర్నిపాడుకు చెందిన నాసుం కరిష్మా నకిలీ జూడో సర్టిఫికెట్ తో DSC 2025 స్పోర్ట్స్ కోటా ఉద్యోగం పొందారని జగన్ రెడ్డి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా ఆమె భర్త షేక్ ఇమామ్ హుస్సేన్ కూడా ఇదే దారిలో ఉద్యోగం పొందారనేది జగన్ రెడ్డి చేస్తున్న మరో ఆరోపణ. భార్యా భర్త ఒకే ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో ఎలా ఆడారు? ముస్లిం మైనారిటీలైన ఇద్దరికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అంటూ ‘గొడ్డలి పార్టీ’ ప్రశ్నిస్తున్నది.
ముస్లింగా పుట్టిన నాసుం కరిష్మా క్రీడల్లో రాణించడానికి ఎంతగా శ్రమించి ఉంటారో మనం అర్ధం చేసుకోవచ్చు. జూడోలో ఎంతో ప్రతిభ చూపించి, రాణించి DSC 2025 స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధిస్తే దాన్ని కూడా తప్పు పడుతున్నారంటే ముస్లింల పట్ల ‘గొడ్డలి పార్టీ’ కి ఎంత విముఖత ఉందో అర్ధం అవుతున్నది.
భార్తాభర్తలు ఇద్దరూ ఒకే స్పోర్ట్స్ ఆడకూడదని, గెలవకూడదని ఎక్కడా నియమ నిబంధనలు లేవు. ఆ ఇద్దరికి ఇంటర్ డిస్ట్రిక్ట్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అవి ఒరిజినల్ సర్టిఫికెట్లేనని తనిఖీలో తేలింది. స్పోర్ట్స్ పర్సన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నా లేకపోయినా క్రీడలో పాల్గొనవచ్చు. ఆ తర్వాత విద్యార్హత సాధించవచ్చు. ఇమామ్ హుస్సేన్ కర్నాటకలో చదువుతున్నారని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఆడరాదనే నిబంధన ఏదీ లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా స్వరాష్ట్రంలో ఆడవచ్చు.
అత్యంత పేద కుటుంబానికి చెందిన ఈ దంపతులు క్రీడల్లో, చదువుల్లో రాణించి టీచర్ ఉద్యోగాలు సాధిస్తే జగన్ రెడ్డి చూసి ఓర్వలేకపోతున్నాడు. ఇమామ్ చిన్నప్పటి నుంచి కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆడాడు. గెలిచాడు. పట్టుదలతో తనకు ఎంతో ఇష్టమైన టీచర్ వృత్తిలోకి ప్రవేశించాడు. ఇలాంటి క్రీడాకారులను గౌరవించాల్సింది పోయి తీవ్రంగా అవమానిస్తున్న ‘గొడ్డలి పార్టీ’ ఇకనైనా తీరు మార్చుకోవాలి.
విద్యనందించే గురువుల పట్ల ‘గొడ్డలి పార్టీ’ కొంతైనా బాధ్యతతో వ్యవహరించాలి. రాజకీయ కారణాలతో ఇలా ముస్లిం మైనారిటీలపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు.
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
క్రీడాకారులను అవమానించడం, క్రీడాకారుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం ‘గొడ్డలి పార్టీ’ కి అలవాటుగా మారింది. ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు జగన్ రెడ్డి ప్రస్తావించిన అందరు క్రీడాకారుల గురించి అధికారులు, సంబంధిత క్రీడా సంఘాలు, బాధిత క్రీడాకారులు ఎన్ని సార్లు వివరణ ఇచ్చినా ‘గొడ్డలి పార్టీ’ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్ద అప్పలరాజు పై కూడా ‘గొడ్డలి పార్టీ’ ఇలాంటి తప్పుడు ఆరోపణలే చేస్తున్నది.
ఎలైట్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పెద్ద అప్పలరాజు ను ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారంతా ఎంతో గౌరవించాల్సి ఉంది. అలాంటి వ్యక్తిని కూడా ‘గొడ్డలి పార్టీ’ వివాదాల్లోకి లాగుతున్నది. స్పోర్ట్స్ కోటా అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయడానికి ఒకటి కన్నా ఎక్కువ సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయడానికి, ఒకటి కన్నా ఎక్కువ సార్లు వాటిని మార్చుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. శ్రీ పెద్ద అప్పలరాజు తమ్ముడు కూడా ఇదే స్పోర్ట్స్ లో ప్రతిభ కలిగిన వ్యక్తి. ఒక్క సారి పొరబాటున ఆయన తన తమ్ముడి సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేసి తీసేశారు. శ్రీ పెద్ద అప్పల రాజు కరెక్టు సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయడమే కాకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో కూడా వాటిని సంబంధిత అధికారులకు చూపించారు. కొన్ని సర్టిఫికెట్లలో పాండా అప్పల రాజు అని ఉంది అనేది కూడా తప్పుడు ఆరోపణే. వివిధ రాష్ట్రాలలో ఆయన పోటీలలో పాల్గొన్న సమయంలో అక్కడి వారు స్పెల్లింగ్ తప్పు రాసి ఉంటారు. ఆయన నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొన్న సందర్భంగా దూరదర్శన్ లో ప్రసారమైన క్లిప్పింగ్ కూడా చూడవచ్చు.
ఆయన ఇవే విషయాలను ఎన్ని సార్లు చెప్పినా ఈ వైసీపీ మంద కు అర్ధం కావడం లేదు.
రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకువచ్చిన ఇలాంటి క్రీడాకారుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్టు కాదు. విద్యనందించే గురువుల పట్ల ‘గొడ్డలి పార్టీ’ కొంతైనా బాధ్యతతో వ్యవహరించాలి. రాజకీయ కారణాలతో నిజమైన ప్రతిభ చూపిన క్రీడాకారులపై ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు.
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
DSC 2025 పై తప్పుడు ఆరోపణలు చేయడం, వాటిపై అధికారులు వివరణ ఇచ్చినా వినకపోవడం, మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేయడం ‘గొడ్డలి పార్టీ’కి నిత్యకృత్యం అయింది. తమ పార్టీ ఛానెళ్ల ద్వారా, తమ దొంగ సాక్షి పత్రిక ద్వారా, సోషల్ మీడియాలో దొంగ హ్యాండిల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
DSC 2025 లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన పేద, దిగువ మధ్యతరగతికి చెందిన బలహీన వర్గాల యువతీయువకులు తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని వేడుకుంటున్నా ‘గొడ్డలి పార్టీ’ తన తప్పుడు విధానాలను వదలడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారంటూ చాలా కాలంగా ‘గొడ్డలి పార్టీ’ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాఫ్ట్ బాల్ ఆటగాళ్లు ఎప్పుడు సర్టిఫికెట్లు పొందారు? వారు ఎప్పుడు క్రీడల్లో పాల్గొన్నారు? అనే విషయాలలో వాస్తవాలను పలుమార్లు వివరించి చెప్పినా తప్పుడు ప్రచారం ఆపడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో తలెత్తిన విభేదాల కారణంగా దాని గుర్తింపును SAP రద్దు చేసింది. ఇప్పుడు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు గుర్తింపు లేదు. అయితే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు SAP గుర్తింపు ఉన్న సమయంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్న వారికి DSC 2025 లో అన్యాయం జరగరాదు అనే సదాశయంతో SAP కొన్ని చర్యలు తీసుకున్నది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకున్నది. వారు ప్రస్తుత సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ పాత సర్టిఫికెట్లను తనిఖీ చేసి వాటిని ధృవీకరించేందుకు అనుమతించింది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అనుమతి ప్రకారం శ్రీ కూన రవికుమార్ గతంలో సర్టిఫికెట్లు పొందిన అభ్యర్ధులకు మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.
ఈ వాస్తవాన్ని అధికారులు కూడా పలుమార్లు చెప్పారు.
సాఫ్ట్ బాల్ క్రీడాకారులను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శభాష్ అని అభినందించింది కూడా. వారితో ఫొటోలు దిగి సాక్షి పత్రికలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలను ఎంతో బాధతో సాఫ్ట్ బాల్ క్రీడాకారులు చెబుతూనే ఉన్నారు…… ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో జగన్ రెడ్డీ…. పేద క్రీడాకారుల పొట్ట కొట్టవద్దు…
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
అధికారంలో ఉన్నంత కాలం గంజాయి, అక్రమ మద్యం వ్యాపారాల్లో మునిగితేలిన వైకాపా నాయకులు, అధికారం కోల్పోయినా చట్టం కళ్లగప్పి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. అయితే అక్రమార్కుల పాలిట ఛండశాసనుడైన నారా చంద్రబాబునాయుడు గారు అధికారంలో ఉండటం తో వారి ఆటలు సాగడం లేదు.
గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేయగా, ఆ కేసును తప్పుదోవపట్టించే విధంగా వైకాపా నేతలు దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటగట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవంగా గోవా నుంచి తాడిపత్రికి అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరుడు పుట్లూరు రామాంజినేయ రెడ్డి (తాడిపత్రి టౌన్). కాగా అతడిని పోలీసులు పట్టుకోవడంతో వైకాపా నేతలు దొంగనాటకాలను మొదలు పెట్టారు.
వాస్తవానికి జరిగింది ఏమిటంటే:
తాడిపత్రి పట్టణంలో నందలపాడు ప్రాంతంలో NH-544 D ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన 18 తేదీ ఉదయం నుంచి ఒక లారీ (నెంబర్ KA01 AM6363) నిలిచి ఉన్నదని మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తాడిపత్రి పోలీసులకు సమాచారం అందింది. ఎన్నో ఎక్సయిజ్ కేసుల్లో నిందితుడైన పుట్లూరు రామాంజనీయ రెడ్డి ఆ లారీని అక్కడ నిలిపినట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. దాంతో తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పీ. ఆరోహణరావు తనకు అందిన సమాచారాన్ని ఎక్సయిజ్ పోలీసులకు అందించి వారి సహాయంతో లారీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ లారీలో గోవా నుంచి చట్ట విరుద్ధంగా తీసుకువచ్చిన 435 మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఇదే లారీ క్యాబిన్ లో KA01 AM 6363 అనే నెంబర్ ప్లేట్ కూడా దొరికింది. పోలీసులను, ఎక్సయిజ్ పోలీసులను చూసి లారీ నుంచి పారిపోయిన వ్యక్తి పుట్లూరు రామాంజినేయ రెడ్డి (తాడిపత్రి టౌన్) అని పోలీసుల విచారణలో వెల్లడి కాగా సదరు విషయాలన్నీ పెద్దమనుషుల సమక్షంలో మహాజరునామాను తయారుచేశారు. మద్యం బాటిళ్ల శాంపిళ్లను కెమికల్ ఎనాలసిస్ నిమిత్తం పంపారు. పరారీలో ఉన్న పుట్లూరు రామాంజినేయ రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వాస్తవాలు ఈ విధంగా ఉండగా సదరు గోవా మద్యం బాటిళ్లు పట్టుబడ్డ లారీ తెలుగుదేశం పార్టీ నాయకులదని కొందరు తప్పుడు ప్రచారం ప్రారంభించారు.
ప్రధాన నిందితుడైన పుట్లూరు రామాంజినేయ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పుట్లూరు రామాంజినేయ రెడ్డి పై 7 మద్యం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అక్రమ మద్యం సరఫరా కేసులే కాకుండా ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న ముఠా నాయకులు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు వీటిని నమ్మరు.
#YCPFakeBrathuku
#AndhraPradesh
నాడు వైఎస్.. నేడు @ysjagan .. ఫేక్ ప్రచారం పైనే రాజకీయం చేశారు… చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి పింక్ డైమండ్ పై ఇలాగే ఫేక్ ప్రచారాలు చేశారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారనే ప్రచారం కూడా అంతే ఫేక్ వార్త. ఈ అబ్బా కొడుకుల బతుకే ఫేక్ బతుకు. వ్యవసాయం దండగ అన్ని అని తాను అన్నట్లు నిరూపించాలని చంద్రబాబు గారు నిండు అసెంబ్లీలో జగన్ తండ్రికి అప్పటిలో ఛాలెంజ్ విసిరారు. దానికి సమాధానం చెప్పలేక అప్పటిలోనే వై ఎస్ తోక ముడిచాడు. ఇప్పుడు వైఎస్ కొడుకు మళ్లీ అదే ప్రచారం మొదలు పెట్టాడు….
చంద్రబాబు గారు ‘‘మనసులో మాట’’ పుస్తకంలో ఏమి రాసారో చూడండి.. రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, గోడౌన్లు కట్టాలి, రవాణా సౌకర్యాలు కల్పించాలి, వ్యవసాయంలో రిస్క్ తగ్గేవరకూ వారిని కాపాడాలి… ఇలా అనేక విషయాలు రైతుకు ఉపయోగపడేవి, ప్రభుత్వాలు చేయాల్సినవి చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందనేది చంద్రబాబుగారు ఎప్పుడూ చెప్పే మాట.
దేశ ఆదాయానికి, రాష్ట్ర ఆదాయానికి మూల స్తంభం అయిన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు గారు చూపే విజన్, వేసే ప్రణాళికల కారణంగానే చాలా సార్లు వ్యవసాయం లాభసాటిగా మారిన మాట వాస్తవం. సాగు నీటి అవసరాలు తీర్చేందుకు చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
నదుల అనుసంధానం నుంచి ప్రాజెక్టుల నిర్మాణం వరకు చంద్రబాబు గారి దార్శనికత పాలకులందరికి ఆదర్శం.
‘‘గ్రామాలు వదలద్దు… వ్యవసాయం ముద్దు’’ అనే సంకల్పంతో పని చేసే చంద్రబాబు గారిపై వ్యవసాయం దండగ అన్నారని ప్రచారం చేస్తారా ఫేక్ ఫెలోస్?
జగన్ పాలనలో పశ్చిమగోదావరి జిల్లాలో వరి రైతులు తమంతట తామే ‘‘క్రాప్ హాలిడే’’ ప్రకటించుకుని పంటలు వేయలేదు… అలాంటి పార్టీ చంద్రబాబుగారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
దేశంలో మొట్టమొదటి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ధరల స్థిరీకరణ నిధి’’ ఏర్పాటు చేసి రైతులను మార్కెట్ లో ధరల హెచ్చుతగ్గుల నుంచి ఉపశమనం కల్పించిన దార్శనికుడు చంద్రబాబు గారు…. ఈ ఫేక్ ఫెలోస్ కు తెలియని విషయాలు ఇవన్నీ….
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని వివరించే క్రమంలో, 2025 సెప్టెంబర్ 13 నాటికి ప్రాజెక్టు పనులు 86% శాతం పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
అయితే, ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ 86% పనులు 2023లోనే పూర్తయ్యాయని మంత్రి చెప్పినట్లు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు.
#FakenewsAlert
వ్యక్తిగత ఆస్తి తగాదాకు పార్టీ రంగు పులిమి ప్రచారం చేయడం కరెక్టు కాదు. సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కమతంపల్లి గ్రామంలో భాగ్యరాజ్ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధమైనట్టు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయగా దాన్ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తూ ప్రభుత్వ ప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నారు.
వాస్తవంగా జరిగింది ఏమిటంటే
సూర్యనారాయణరెడ్డి, వెంకటరమణా రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనే ముగ్గురు కలిసి 2012 ఫిబ్రవరి 22న గంగన్న నుంచి 118 సర్వే నెంబర్ లోని 11 ఎకరాలు, 132 సర్వే నెంబరు లోని ఒక ఎకరం కొన్నారు. 2021లో రీ సర్వేలో ఆ భూమిలో 44 సెంట్లు తగ్గించారు. దాంతో వారు అనేకమార్లు ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్లకు విన్నవించుకున్నారు.
2016లో డి.శ్రీనివాసులు సర్వే నెంబరు 118లోనే 34 సెంట్లు కొన్నాడు. పై ముగ్గురికి తగ్గించిన 44 సెంట్ల భూమిని రీ సర్వేలో డి.శ్రీనివాసులుకు జత చేశారు. దాంతో అతని 34 సెంట్ల భూమి కాస్తా 78 సెంట్లు అయింది.
అనేకమార్లు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ తప్పిదాన్ని సరిదిద్ది డి.శ్రీనివాసులుకు 34 సెంట్ల భూమి మాత్రమే ఉన్నట్లు మార్పులు చేశారు. తమకు చెందిన 44 సెంట్ల భూమిని (రీ సర్వేలో డి.శ్రీనివాసులు కలిపినది) చూపించాల్సిందిగా సదరు వ్యక్తులు అధికారులకు తగిన రుసుము చెల్లించి చట్టప్రకారం అడిగారు.
2026 జులై 22న ఆ స్థలాన్ని సంబంధిత అధికారులు కొలతలు వేసి చూపించారు. దాంతో వారు హద్దులు వేసుకున్నాను. అయితే అప్పటికే డి. శ్రీనివాసులు అతని 34 సెంట్లు, సదరు వ్యక్తులకు చెందిన 44 సెంట్లు కలిపి ఇల్లు కట్టుకున్నాడు. డి.శ్రీనివాసులు కొడుకు భాగ్యరాజ్ ఆ ఇంట్లో ఉంటున్నాడు.
అయినా తాము ఎవరినీ వత్తిడి చేయలేదని సదరు వ్యక్తులు చెబుతున్నారు. భాగ్యరాజ్ ఇంటికి కావాల్సిన రోడ్డు స్థలం కూడా విడిచిపెట్టినట్లు సూర్యనారాయణరెడ్డి అధికారులకు తెలిపాడు.
ఈ సివిల్ వివాదంతో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే పార్టీల ప్రమేయం ఉన్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తూ తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం.
ఏ మాత్రం నిజం లేని తప్పుడు ప్రచారాలు చేస్తూ వైకాపా వారు కాలక్షేపం చేస్తున్నారు. ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ఈ వ్యక్తులు దిగజారి మరీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిపై తప్పుడు ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల భూముల కొట్టేసిన వైకాపా నాయకులు ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూస్తున్నారు. ప్రస్తుత గోవా గవర్నర్, గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి భూమినే కొట్టేసి జగన్ రెడ్డి తన పార్టీ ఆఫీసు కట్టించుకున్నాడు. తాజాగా అప్పటి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని శీతారామ్ భూ భాగోతం బయటపడి కేసు బుక్ అయింది. రాయలసీమలోని చాలా జిల్లాల్లో వైసీపీ నేతల భూ ఆక్రమణలు బయటకు వచ్చాయి. సాక్ష్యాత్తూ జగన్ రెడ్డి కుట్రలను బట్టబయలు చేస్తూ బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో దోచుకున్న వేలాది ఎకరాలను కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. జగన్ రెడ్డి సొంత కంపెనీ అయిన సరస్వతీ పవర్ భూముల విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇలా ఒక్కక్కొటి బయటపడి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే వైకాపా నాయకులు సంధి ప్రేలాపనలు పేలుతున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుంది తప్ప భూములు ఆక్రమించడానికి, అక్రమ సంపాదనలతో అందలం ఎక్కడానికి కాదు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. సంక్షేమం, అభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు వెళుతున్నాయి. కడుపు మండుతున్న వైకాపా నాయకులు ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వారి తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మవద్దు.
#FakeAlert
#AndhraPradesh
అమరావతిపై జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేరిట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక్సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమైన జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్‌ది కాదా?
👉రాజధాని ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష్ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధాని లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మనాభరెడ్డి లాంటి రైతుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
అన్నదమ్ముల మధ్య తగాదాను తెలుగు దేశం పార్టీ కి అంటగడుతూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తున్నది. అసలు విషయం ఏమిటంటే రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నపల్లి గ్రామానికి చెందిన పంజాగుల చిన్న బాలచిన్ని కుటుంబం మొదటి నుండి టిడిపి పార్టీలో ఉన్నారు. (1/7)
కేసు ఫైల్ కాకుండా ఉండేందుకు సోదరుడైన అనిల్ కు 30 లక్షలు చెల్లించేందుకు ఉప్పర శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. అయితే శ్రీనివాస్ ఆ డబ్బు చెల్లించలేదు. ప్రస్తుతం ఇద్దరి అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత విభేదాలు తారా స్థాయికి చేరాయి. దీనికి తెలుగు దేశం పార్టీ కి ఎలాంటి సంబంధం లేదు. (6/7)
వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారం ఎవరూ నమ్మవద్దు. #FakenewsAlert #Andhrapradesh (7/7)








