
Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]
Joined December 2020
- Tweets1.4K
- Following36
- Followers30.5K
- Likes278
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నడికుడి-మాచర్ల టర్నింగ్ వద్ద ఒక మహిళ ప్రమాదానికి గురైతే గంట సేపైనా అంబులెన్స్ రాలేదని, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రచారం అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అసత్యం మరియు తప్పుదోవ పట్టించేలా ఉంది.
బాధితురాలి ప్రకటన :-
ప్రమాదానికి గురైన దేవుళ్ళ లలిత అనే మహిళ స్వయంగా స్పందిస్తూ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. దాచేపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి తమను హాస్పిటల్‌కు తరలించారని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స అందించారని చెప్పారు. పాల వ్యాన్ డ్రైవర్ కూడా వచ్చి వైద్య సహాయానికి, చికిత్సకు అయ్యే ఖర్చులకు సహకరించారని తెలిపారు. సంఘటన స్థలంలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వంపై, అధికారులపై ఆరోపణలు చేస్తూ వీడియో తీశాడని బాధితురాలు స్పష్టం చేశారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యక్తి ఎవరో కూడా తమకు తెలియదని బాధితురాలు స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖలు (పోలీస్ & వైద్య విభాగాలు) వేగంగా స్పందించి బాధితురాలికి సకాలంలో సహాయం అందించాయి. మద్యం మత్తులో ఒక వ్యక్తి తీసిన వీడియోను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఇలాంటి తప్పుడు వార్తలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
#FactCheck
#AndhraPradesh
ఏపీలో మరో దారుణం… బధిరులను కూడా వదలరా? అంటూ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్న బధిరుల ఐటీఐ పై అసంబద్ధమైన కథనాలను కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నెల రోజుల కిందట ఒక కాంట్రాక్టు ఉద్యోగి తాను పని నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న విద్యార్ధులతో వంట పని చేయించినట్లు తెలియగానే సంబంధిత అధికారులు అతడిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించడం జరిగింది. సదరు కాంట్రాక్టు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా తగిన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యత లేని కాంట్రాక్టు ఉద్యోగిని విధుల్లోకి తీసుకున్నందుకు సంబంధిత అధికారుల పైనా, ప్రిన్సిపల్ పైనా కూడా క్రమ శిక్షణా చర్యలకు ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం కరెక్టు కాదు. సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారంటే అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డుపైనా, అధికారులపైనా ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు మాత్రమే అని అనుకోవాల్సి వస్తున్నది. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రజలు నమ్మవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అధికారులు అనుక్షణం అప్రమత్తతతోనే ఉన్నారు.
#FactCheck
#AndhraPradesh
అనకాపల్లిలోని క్రిటికల్ కేర్ విభాగంలో మానిటర్స్ పని చేయకపోవడం వల్ల ఒక చిన్నారి మృతి చెందినట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. రాష్ట్రంలో ఎంతో పటిష్టంగా అందుతున్న వైద్య సేవలపై ప్రజల్లో అపోహలు కలిగించే దురుద్దేశంతోనే కొందరు పనిగట్టుకుని ఈ చెడు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవం ఏమిటంటే:
తెగడ గ్రామానికి చెందిన నానుబిల్లి పరమేష్, సుగుణ దంపతులు 13 నెలల వయసు ఉన్న తమ చిన్నారి కి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నదని ఉదయం 6.45 నిమిషాలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అంతకు కిందటి రోజు సాయంత్రం నుంచే ఆ చిన్నారి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నదని కూడా వారు చెప్పారు. వైద్యులు ఆ చిన్నారికి వచ్చిన సమస్యను గుర్తించి చికిత్స ప్రారంభించే లోపునే ఈ దుర్ఘటన సంభవించింది. ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకువచ్చిన 13 నిమిషాలలోనే ఇదంతా జరిగింది. ఈ విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగానీ, ఆసుపత్రిలో వైద్య పరికరాల లోపం గానీ లేదు. ఆ దంపతులు తమ చిన్నారిని తీసుకుని ఆసుపత్రికి వచ్చిన దృశ్యాలు, వైద్య సిబ్బంది చేసిన సహాయం అంతా కూడా సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయి ఉన్నది. మొత్తం 13 నిమిషాలలోనే ఆ చిన్నారి తుది శ్వాస విడిచింది.
జరిగిన ఈ సంఘటన సహజంగానే బాధితులకు ఆగ్రహం తెప్పిస్తుంది. అయితే వారికి సీసీ టీవీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలు, వైద్య సిబ్బంది, వైద్యులు తీసుకున్న తక్షణ చర్యల గురించి వివరించి 13 నిమిషాలలోపే అకస్మాత్తుగా చిన్నారి ఆరోగ్యం విషమించడంతో ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయతను వివరించగా వారు సమస్యను అర్ధం చేసుకున్నారు.
జరిగిన ఈ దురదృష్టకర సంఘటనను ఉపయోగించుకుని ప్రజలలో అపోహలు రేకెత్తించేందుకు కొందరు పనిగట్టుకుని ప్రయత్నిస్తూ, ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిని, ఇలాంటి పోస్టులను షేర్ చేసుకునే వారిని గుర్తించి ప్రభుత్వం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh
29.09.2026న విజయవాడ సివిల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ ఒక దినపత్రికలో ప్రచురితమైన వార్తలు పూర్తిగా అవాస్తవం, అభూతకల్పన. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తోంది.
వాస్తవాలు :
కొంతమంది న్యాయవాదులు తమ డిమాండ్స్ పై నిరసన తెలిపే సమయంలో అదే రూట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి Z+ కేటగిరీ కాన్వాయ్ పర్యటన ఉంది. ఈ సమయంలో విఐపి భద్రత, సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వారిని కేవలం 2 నిమిషాలు ఆగాలని కోరినప్పటికీ, లాయర్లు బందర్ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారు.
ఈ సమయంలో పోలీసులు వారికి నచ్చజెప్పి అంబేడ్కర్ స్మారక ద్వారం వద్దకు పంపగా వారు తమ వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఏ పోలీస్ అధికారి వద్ద గానీ, సిబ్బంది వద్ద గానీ ఎలాంటి లాఠీలు లేవు. అలాంటప్పుడు లాఠీఛార్జ్ చేసే ఆస్కారమే లేదు. న్యాయవాదుల పట్ల పోలీసులు ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదు, లాఠీఛార్జ్ కూడా జరగలేదు.
కాని వాస్తవాలను గమనించకుండా పోలీస్ వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా, ప్రజల్లో పోలీసులపై అభద్రతా భావం కలిగేలా ఆ దినపత్రిక కథనాన్ని ప్రచురించడం శోచనీయం.
#FactCheck
#AndhraPradesh
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక లిక్కర్ మార్ట్‌లో కొనుగోలు చేసిన మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా "QR Code Not Found / Error" అని వచ్చిందని, మంగళగిరిలో భారీగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మద్యం సీసాపై ఉండే ఇతర క్యూఆర్ కోడ్లు లేదా యాప్ ఇన్స్టాలేషన్ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం వల్ల యాప్‌లో 'Error' వచ్చింది. మద్యం సీసా అసలైందో కాదో ధృవీకరించుకోవడానికి సీసా మూతపై (బాటిల్ క్యాప్‌పై) ఉండే 'వెరిఫికేషన్ క్యూఆర్ కోడ్' (Verification QR Code) ను మాత్రమే 'AP Excise Suraksha' యాప్ ద్వారా స్కాన్ చేయాలి. సరైన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయకుండా 'Error' అని రాగానే నకిలీ మద్యం అనడం నిరాధారమని, ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మవద్దని ఎక్సైజ్ శాఖ కోరింది.
#FactCheck
#AndhraPradesh
గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక మహిళ గౌరవాన్ని తగ్గిస్తూ తప్పుడు ఆరోపణలు చేసి వాటిని సోషల్ మీడియాలో కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక మహిళా టీచర్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.
DSC 2025 లో స్పోర్ట్స్ కోటా నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పారదర్శకంగా నియమ నిబంధనల మేరకు మాత్రమే అభ్యర్ధుల ఎంపిక జరిగిందని పలుమార్లు అధికారులు స్పష్టంగా చెప్పినా కూడా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
ఆరోపణ: ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నం కు చెందిన యోగేశ్వరరావు, ఆయన చెల్లికి స్పోర్ట్స్ కోటాలో ఎస్ జీ టీ ఉద్యోగాలు ఇచ్చారు. వారి సర్టిఫికెట్లు నకిలీవి.
వాస్తవం: జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. పేద వ్యవసాయదారుని కుటుంబానికి చెందిన యోగేశ్వరరావు, ఆయన చెల్లి మోహినీ దేవి ఎంతో కష్టపడి చదువుకోవడమే కాకుండా ఆటల్లో రాణించి ఖోఖో ఆటలో ఛాంపియన్లుగా నిలిచారు. వారిద్దరూ కూడా నిబంధనల మేరకు Teacher Eligibility Test – TET అర్హత సాధించిన వారే. అన్నా చెల్లెలు ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనలేదని ఇప్పుడు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీ కింద అన్నా చెల్లెళ్లకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు అనే దిగజారుడు కామెట్లు చేస్తున్నారు.
అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రతిభ చూపిన వారేనని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది.
ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు SAP కు ఇచ్చిన అధికారిక సమాచారం ఈ విధంగా ఉంది.
చిల్లా యోగేశ్వరరావు నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రధమ స్థానం పొందారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం F.No.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025)
చిల్లా మోహినీదేవి నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం F.No.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025)
వాస్తవాలు ఈ విధంగా ఉండగా క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, గౌరవ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం తగదు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.
#FactCheck
#AndhraPradesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన ను ఎగతాళి చేస్తూ ఒక మీడియాలో వచ్చిన వార్తను, దాని ఆధారంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. పర్యావరణ పరిరక్షణకు ప్రధమ ప్రాధాన్యతను ఇస్తూ, పేద ప్రజల సముద్ధరణకు సకల చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం క్షంతవ్యం కాదు. ఈ నెల 19వ తేదీన విశాఖ లో ‘‘పేదలకు పట్టాభిషేకం’’ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి అక్కడి 28,445 మంది పేదలకు ఇళ్ల హక్కులు కల్పిస్తూ పట్టాలను అందచేసిన అనంతరం, విశాఖ ఆర్ కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొని, బీచ్ లో మురి మిక్సర్ అమ్ముకునే మహిళతో కొద్ది సేపు మాట్లాడారు. ఆమె ఒంటరి మహిళ అని తెలుసుకున్న వెంటనే సంబంధిత ఉన్నతాధికారులను పిలిచి ఆమెకు పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చేస్తున్న పర్యటనలు, అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించడం, చెత్తను ఎరువుగా ఇంధనంగా మార్చే కార్యక్రమాలను పర్యవేక్షించడం వల్ల ఇప్పటికే సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ఇంతటి పాజిటీవ్ కార్యక్రమంపై కళ్లు కుట్టిన కొందరు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. విశాఖ బీచ్ లో మురి మిక్సర్ బండ్లు చాలా ఉన్నాయి. సీఎం కోసం సెట్టింగ్ వేసినట్లు ఆ తర్వాత వాటిని ఎత్తివేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లాంటి పవిత్ర కార్యక్రమాలను నిండు హృదయంతో ఆశీర్వదించాలని కోరడమైనది.
#FactCheck
#AndhraPradesh
ముఖ్యమంత్రి (CM), ఉప ముఖ్యమంత్రి (Dy CM), మరియు విద్యాశాఖ మంత్రి (HRD మంత్రి) పర్యటనలకు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వాడకం కోసం ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ & HRD మంత్రి శ్రీ నారా లోకేష్ తమ అధికారిక పర్యటన ల కోసం APACL ద్వారా ఎటువంటి ఖర్చు చేయటం లేదు, విమానయాన సేవలు తీసుకోవడం లేదు.
APACL కు బడ్జెట్ కేటాయింపు కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనలకు మాత్రమే నిర్దేశించినవి కాదు. ఇందులో గవర్నర్ పర్యటనలు, కేంద్ర మంత్రుల పర్యటనలకు ఇచ్చే హెలికాప్టర్లు, గిరిజన ప్రాంతాల్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు, నేపాల్ వంటి చోట్ల చిక్కుకున్న తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ఖర్చులు కూడా కలిసే ఉన్నాయి.
APACL కు కేటాయించిన నిధులు బడ్జెట్ పరిమితులకు లోబడే ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి APACL కి మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ 54.63 కోట్లు. ఇందులో మొదటి రెండు త్రైమాసికాలకు (Q1 & Q2) కలిపి సుమారు రూ 30.95 కోట్లు (రూ. 19.12 కోట్లు + రూ.11.83 కోట్లు) మాత్రమే విడుదలయ్యాయి.
2021-22 నుండి 2023-24 వరకు జిల్లాల పర్యటనలకు ఏటా రూ. 51.45 కోట్ల నుండి రూ. 55 కోట్ల వరకు ఖర్చు చేశారు. కోవిడ్ లాక్డౌన్ పరిమితులు ఉన్న 2020-21 సంవత్సరంలో కూడా రూ. 30 కోట్ల బడ్జెట్ వినియోగించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి 'పేదల సేవలో', 'స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర', 'పట్టాదార్ పాస్‌బుక్స్ పంపిణీ', 'సంజీవని' వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం తరచూ జిల్లాల్లో పర్యటిస్తున్నప్పటికీ, ఈ విమానయాన ఖర్చులు కేటాయించిన బడ్జెట్ పరిమితి లోపే ఉన్నాయి.
ప్రజల పట్ల బాధ్యత తో వ్యవహరించే కూటమి ప్రభుత్వం ఎలాంటి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఈ అంశంపై జరుపుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో ఏర్పాటైన సుమారు 500 కు పైగా వినాయకచవితి పందిళ్లలో ప్రశాంతంగా, భక్తిభావనలతో ప్రజలు గణపతి నవరాత్రులు నిర్వహించుకుంటుండగా కోటి గాజుల గణపతి విగ్రహం వద్ద నిర్వాహకులు ప్రజా భద్రతను గాలికి వదిలేసి జాతీయ రహదారికి సమీపంలో వినాయక మండప స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించారు. పోలీసులు, ఇతర ప్రభుత్వం అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోగా దీనికి కులం రంగు పులుముతూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.
వాస్తవంగా జరిగినది ఏమిటంటే: గాజువాక నియోజకవర్గానికి చెందిన కోసిరెడ్డి గణేష్ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా 108 అడుగుల మట్టి గాజులతో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. వినాయక పందిరి ఏర్పాటు చేసే స్థలానికి మాత్రమే పోలీసుల నుండి పర్మిషన్ తీసుకుని షాపులను లీజు కు ఇచ్చారు.
షాపులను ఏర్పాటు చేయడం వల్ల జాతీయ రహదారి కావడం ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని జీవీఎంసి, పోలీసు, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్ మెంట్ జాయింట్ టీమ్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి నిర్ధారించింది. అక్కడ వారు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాణిజ్య దుకాణాలను తొలగించేందుకు వెళ్లగా గణేష్, ఆయన తల్లి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి వారి విధి నిర్వహణను అడ్డుకున్నారు.
సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ వినాయక చవితి పందిరికి ఎలాంటి నష్టం జరగలేదు. కేవలం అక్కడి అనుమతి లేని షాపులను మాత్రమే తొలగించడం జరిగింది. శాంతిభద్రతలను కాపాడుతూ, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చేయడమే కాకుండా వినాయక చవితి పందిరి పేరుతో వాణిజ్య కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh
‘‘అంగట్లో వెటర్నరీ పోస్టులు’’ అనే శీర్షికతో ఒక దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవం. మెగా డిఎస్సీ మాదిరిగానే పశు సంవర్ధక శాఖలో అడ్డగోలు వ్యవహారాలు అంటూ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.
ఆరోపణ: ఏపీపీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని ముందుగా చెప్పి ఆ తర్వాత డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా మెరిట్ ప్రాతిపదికన సవరించిన జీవోను విడుదల చేశారు.
వాస్తవం: గత 8 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (VAS) పోస్టులు భర్తీ చేయలేదు. దాంతో ప్రభుత్వం తొలి విడతలో 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. నియామక ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఎంతో మంది అభ్యర్ధులు ఇప్పటికే అర్హతలు సాధించి, దీర్ఘకాలంగా నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా పోస్టులు భర్తీ చేయాలనే ఉద్దేశ్యం ఒక వైపు, సంబంధిత సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు మరోవైపు ఉండగా గతంలో అమల్లో ఉన్న మెరిట్, వెయిటేజీ విధానాన్ని కొనసాగిస్తూ నియామకాలు చేపట్టాలని తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
2016లో జారీ చేసిన GO No.52 ప్రకారం మొత్తం 100 మార్కులకు మెరిట్ నిర్ణయించడం జరుగుతుంది. అందులో బీవీఎస్సీ (B.V.Sc.)కి 60 మార్కులు, ఎంవీఎస్సీ (M.V.Sc.)కి 10 మార్కులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో సేవలకు 10 మార్కులు, డిగ్రీ పూర్తైనప్పటి నుంచి సీనియారిటీకి ఏడాదికి 4 మార్కులు చొప్పున గరిష్టంగా 20 మార్కులు కేటాయించబడతాయి. ఈ విధానం ప్రత్యేక నిబంధనలకు లోబడి అమలవుతుంది. అదేవిధంగా, రిజర్వేషన్ మరియు రోస్టర్ నిబంధనలు తప్పనిసరిగా పాటించబడతాయి.
అర్హతలు సాధించి ఎంతో కాలంగా నియామకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు ప్రాధాన్యత కల్పించే సదుద్దేశ్యంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది తప్ప ఎలాంటి పక్షపాత ధోరణి చూపేందుకు కాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంబంధిత వ్యక్తులు, ఉద్యోగార్ధులు, పశు సంవర్ధక శాఖ నిపుణులు హర్షిస్తుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం సబబు కాదు.
#FactCheck
#AndhraPradesh
ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నం కు చెందిన యోగేశ్వరరావు, ఆయన చెల్లికి స్పోర్ట్స్ కోటాలో ఎస్ జీ టీ ఉద్యోగాలు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఖమ్మంలో జరిగిన ఖోఖో ఛాంపియన్ షిప్ లో పాల్గొనకపోయినా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ లకు ఫ్యామిలీ ప్యాకేజీ కింద అన్నా చెల్లెళ్లకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు అనే దిగజారుడు కామెట్లు కూడా చేయడాన్ని ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తున్నది. అంతే కాకుండా ఏడు దశల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామని అధికారులతో అబద్ధాలు చెప్పించారు అనే ఆరోపణ కూడా అసత్యమే.
వాస్తవం ఏమిటంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచార బాధితులు ఇద్దరూ కూడా ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రతిభ చూపిన వారేనని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది.
ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు SAP కు ఇచ్చిన అధికారిక సమాచారం ఈ విధంగా ఉంది.
చిల్లా యోగేశ్వరరావు నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రధమ స్థానం పొందారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం F.No.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025)
చిల్లా మోహినీదేవి నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం F.No.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025)
వాస్తవాలు ఈ విధంగా ఉండగా క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, గౌరవ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం తగదు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
ప్రాంతాల మధ్య విభేదాలు రేకెత్తించే విధంగా సోషల్ మీడియాలో కొందరు తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారు. విశాఖ నగరంలో స్థలం లేని కారణంగా ఐ టీ కంపెనీ లను అమరావతి కి తరలించాలని ఇటీవల ముగిసిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు లో నిర్ణయించినట్లు ఒక తప్పుడు వార్త ను కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఈ పోస్టు పెట్టిన వారిపై, దీన్ని వైరల్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh
తిరుమలకు రోజుకు 15,000 వాహనాలకే అనుమతి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ప్రైవేటు వాహనాల సంఖ్యపై టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
#FactCheck
#AndhraPradesh
ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నం కు చెందిన యోగేశ్వరరావు, ఆయన చెల్లికి స్పోర్ట్స్ కోటాలో ఎస్ జీ టీ ఉద్యోగాలు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఖమ్మంలో జరిగిన ఖోఖో ఛాంపియన్ షిప్ లో పాల్గొనకపోయినా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ లకు ఫ్యామిలీ ప్యాకేజీ కింద అన్నా చెల్లెళ్లకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు అనే దిగజారుడు కామెట్లు కూడా చేయడాన్ని ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తున్నది. అంతే కాకుండా ఏడు దశల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామని అధికారులతో అబద్ధాలు చెప్పించారు అనే ఆరోపణ కూడా అసత్యమే.
వాస్తవం ఏమిటంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచార బాధితులు ఇద్దరూ కూడా ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రతిభ చూపిన వారేనని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది.
ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు SAP కు ఇచ్చిన అధికారిక సమాచారం ఈ విధంగా ఉంది.
చిల్లా యోగేశ్వరరావు నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రధమ స్థానం పొందారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం F.No.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025)
చిల్లా మోహినీదేవి నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం F.No.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025)
వాస్తవాలు ఈ విధంగా ఉండగా క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, గౌరవ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం తగదు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
క్రీడాకారులను ప్రోత్సహించాలనే సదాశయంతో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నియమనిబంధనల ప్రకారం, DSC 2025 నోటిఫికేషన్ లో ముందుగానే పెట్టిన షరతులకు లోబడి DSC 2025 స్పోర్ట్స్ కోటా ను భర్తీ చేయడం జరిగిందని పదే పదే చెబుతున్నా కూడా ప్రజల్లో అపోహలు రేపేందుకు కొందరు తప్పుడు ప్రచారం ఆపడం లేదు. క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, రాష్ట్రంలో క్రీడాకారులను తీవ్రంగా నిరుత్సాహ పరిచే విధంగా ఈ తప్పుడు ప్రచారం సాగుతున్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.
ఆరోపణ: సాఫ్ట్ బాల్ క్రీడ పేరుతో ఎటువంటి పరీక్ష లేకుండా 38 మందికి ఉద్యోగాలు ఇచ్చేసినారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్.
వాస్తవం: ఎటువంటి పరీక్ష లేకుండా క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు అనేది పూర్తిగా అవాస్తవం. ఇక ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ విషయానికి వస్తే ఆ అసోషియేషన్ లో విభేదాల కారణంగా SAP ఆ అసోసియేషన్ గుర్తింపును రద్దు చేసింది. అయితే SAP గుర్తింపు ఉన్న సమయంలో ఆడిన క్రీడాకారులకు ఈ DSC లో ఎలాంటి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ విషయాన్ని భారత సాఫ్ట్ బాల్ ఫెడరేషన్ దృష్టికి తీసుకువెళ్లగా SAP గుర్తింపు ఉన్న సమయంలో ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన టోర్నమెంట్లలో పాల్గొన్న క్రీడాకారులకు అప్పటిలో జారీ చేసిన సర్టిఫికెట్లను ధృవీకరించే అధికారాన్ని ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్ దఖలుపరుస్తున్నట్లు తెలిపారు.
సాధారణంగా అసోసియేషన్ కార్యదర్శి మాత్రమే సర్టిఫికెట్లను ధృవీకరించాలనే నిబంధన ఉన్నా కూడా ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అధ్యక్షుడికి ఆ బాధ్యతలను అప్పగిస్తూ ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్నది. ఈ కారణంగానే ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ పాత సర్టిఫికెట్లు సరైనవా కావా అనే విషయాన్ని ధృవీకరించారు తప్ప కొత్త సర్టిఫికెట్లు జారీ చేయలేదు.
ఒక్కొక్క క్రీడాకారుడిని అవమానపరిచే రీతిలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. వీలైతే క్రీడల్ని ప్రోత్సహించండి, క్రీడాకారులను గౌరవించండి… అంతే కానీ క్రీడాకారులను అవమానించవద్దు.
#FactCheck
#AndhraPradesh
DSC 2025 స్పోర్ట్స్ కోటా నియామకాల పై తప్పుడు సమాచారాన్ని భారీ ఎత్తున కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు. నియామకాల సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు తగినంత సమయం ఇచ్చినా కూడా అప్పుడు ఎలాంటి ఫిర్యాదులు చెయ్యని వారు నియామకాలు జరిగి ఏడాది గడచిన తర్వాత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. DSC 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రధాన ఉద్దేశ్యంతోనే వారు ఇలా నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
ఆరోపణ: జూడో అనే ఆట ఆడిన 39 మందికి ఎలాంటి పరీక్షలు పెట్టకుండా పోస్టింగ్ లు ఇచ్చారు. 2013లో ఖమ్మంలో జూడో ఛాంపియన్ షిప్ జరగలేదు.
వాస్తవం: TET అర్హత లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని ఇప్పటికే పలుమార్లు, పలు దఫాలుగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు పూర్తి స్థాయి వివరణలు ఇచ్చినా కూడా మళ్లీ మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారు. జూడో క్రీడకు సంబంధించి ఏపి జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా మాత్రమే స్పోర్ట్స్ కోటాలో అభ్యర్ధులను ఎంపిక చేయడం జరిగింది.
ఏపి జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లను అధీకృత వ్యక్తులు ధృవీకరించిన తర్వాత, ఈ సర్టిఫికెట్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చునని 2025 ఆగస్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకూ టైమ్ ఇవ్వడం జరిగింది. DSC 2025 నిబంధనల ప్రకారం ఆ సమయంలో వచ్చిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఉద్యోగాలు రానివారు కానీ, ఇతరులు కానీ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఎవరు ధృవీకరించాలి అనే అంశంపై కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ వారి DoPT నుంచి వచ్చిన నియమనిబంధనల ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గౌడ్ లైన్స్, DSC 2025 నిబంధనల ప్రకారం మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేయడం జరిగిందని స్పష్టంగా చెబుతున్నా, నిర్ణీత గడువులో అభ్యంతరాలు వ్యక్తం చేయని వారు ఏడాది తర్వాత ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
#FactCheck
#AndhraPradesh
టీచర్ పోస్టుల కోసం కొందరు డబ్బులు తీసుకున్నారని, ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. బాధ్యత గల పదవులలో ఉన్న వారు వాస్తవాలు తెలుసుకోకుండా, తెలిసినా పట్టించుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం కరెక్టు కాదు.
ఆరోపణ: టీచర్ పోస్టుల కోసం కొందరు డబ్బులు తీసుకున్నారనే ఆడియో కాల్స్ బయటకు వచ్చినా విచారణ జరపలేదు. వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.
వాస్తవం: DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారంలో భాగంగా ఈ ఆడియో కాల్ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అలా ఆడియో కాల్ చేసిన వ్యక్తి పేరు బొంత రోశయ్య. ఇతను SAP లో గానీ, మరే ఇతర ప్రభుత్వ విభాగంలో కాని పని చేయడం లేదు. ఇతను ఒక పార్టీకి చెందిన కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. ఒక పార్టీకి చెందిన నాయకులతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బొంత రోశయ్య అనే ఇతడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
బొంత రోశయ్య SAP పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిందే SAP అధికారులు. SAP అధికారులు సైబర్ క్రై పోలీసులకు ఫిర్యాదు చేయగానే పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఇప్పుడు చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నది.
వాస్తవాలు ఇలా ఉంటే SAP పైనా, SAP అధికారులపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు. SAP అధికారులే ఫిర్యాదు చేయగా పోలీసులు తగిన చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేస్తే దానిపై చిలవలు పలవలుగా చెప్పడం సరికాదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. ఎలాంటి అపోహలకు గురికావద్దు. DSC 2025 నియామకాలు జరిగిన ఏడాది తర్వాత చేస్తున్న తప్పుడు ప్రచారాలను అధికారులు ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నందున ఇలాంటి వాస్తవ విరుద్ధమైన అంశాలను తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
DSC 2025 నియామకాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటా అభ్యర్ధుల విషయంలో పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి అర్హతలు లేనివారితో 372 పోస్టులు భర్తీ చేశారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం బాధ్యతగల వ్యక్తులకు తగదు.
ఆరోపణ: పరీక్ష కూడా పెట్టకుండానే స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు భర్తీ చేశారు.
వాస్తవం: ఇది పచ్చి అసత్యం. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు పలుమార్లు చెప్పారు. అయినా పట్టించుకోకుండా మళ్లీ పాత ఆరోపణలే చేయడం కరెక్టు కాదు. అసలు జరిగింది ఏమిటంటే: స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసే సమయంలోనే TET అనే కాలమ్ ఉంటుంది. అందులో వారు TET స్కోర్ ఎంటర్ చేయాల్సిందే. TET స్కోర్ ఆధారంగానే వారిని స్కృటినీ కమిటీ పరిశీలిస్తుంది. వారి విద్యార్హత, TET స్కోర్ ను పరిశీలించిన తర్వాతే వారిని పరిగణనలోకి తీసుకున్నారు. వారికి ఉన్న స్పోర్ట్స్ సర్టిఫికెట్ ను వారు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తర్వాత స్కృటినీ కమిటీ తొలి రౌండ్ లో పరిశీలించి ఆ తర్వాత వాటిని భౌతికంగా కూడా తనిఖీ చేయడం జరిగింది.
భౌతికంగా ఆ సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాత వాటిని సంబంధిత అసోసియేషన్లు, ఫెడరేషన్లు, యూనివర్సిటీలకు పంపి వారి నుంచి ధృవీకరణ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాతే పూర్తి అర్హతలు ఉన్నవారికే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
సర్టిఫికెట్లపైనా, అభ్యర్ధుల అర్హత పైనా DSC జరుగుతున్న నాటి నుంచి పలుమార్లు గ్రీవెన్సీ సెల్ కు ఫిర్యాదులు చేసే అవకాశం కూడా కల్పించడం జరిగింది. వచ్చిన ఫిర్యాదులకు బాధ్యతతో సమాధానం చెప్పి, వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫిర్యాదులను ముగించారు. ఇలా అన్ని స్థాయిలలో ఎలాంటి వివాదాలు లేకుండా చేసిన ఎంపికలపై వక్రభాష్యం చెబుతూ తప్పుడు ప్రచారం చేయడం సరైన చర్య కాదు.
#FactCheck
#AndhraPradesh
DSC 2025 నియామకాలపై సామాన్య ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రతి సారీ నవీన్ అనే వ్యక్తి పేరును, అతనికి వచ్చిన ర్యాంక్ ను పదే పదే వినియోగించుకుంటున్నారు. నవీన్ అనే ఆ వ్యక్తికి ర్యాంకు వచ్చినా కూడా DSC 2025 నియమ నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోస్టింగ్ ఇవ్వడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా కూడా విననట్టు, అర్ధం కానట్టు మళ్లీ మళ్లీ అదే విషయాన్ని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
ఆరోపణ: నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్టును పదే పదే మార్చారు. అతని ఐడిని బ్లాక్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నవీన్ ను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలవలేదు.
వాస్తవం: నవీన్ అనే వ్యక్తి SCRT లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా 2026 నుంచి ని చేస్తున్నాడు. DSC 2025 పరీక్ష రాసిన తర్వాత తన పోస్టుకు రాజీనామా చేశాడు. నవీన్ తెలుగు, సోషల్ స్టడీస్ పరీక్షలు రాయగా ఒక దాంట్లో జిల్లాలో మొదటి ర్యాంకు, మరో దాంట్లో జిల్లాలో ఆరో ర్యాంకు వచ్చాయి. మొదట పబ్లిష్ చేసిన జాబితాలో ఇవే వివరాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వానికి తెలిసిన సమాచారం ఏమిటంటే అతను ప్రభుత్వంలో పని చేస్తూ ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా DSC 2025 పరీక్ష రాశాడు. ఏ ఉద్యోగి అయినా పరీక్షలు రాసే సమయంలో ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. నవీన్ కుమార్ అలా తీసుకోలేదు.
ఆ తర్వాత నవీన్ కుమార్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాలేదు. తుది ఎంపిక జాబితా పబ్లిష్ చేసిన తర్వాత అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానానికి ప్రభుత్వం తన వాదన వినిపించింది. గ్రీవెన్సీ సెల్ లో అతనికి తగిన వివరణ ఇవ్వడం జరిగింది.
జాబితాలను తొలగించారనేది కూడా తప్పుడు ప్రచారమే. ఆన్ లైన్ లో మొత్తం సమాచారం ఉన్నది.
వాస్తవాలు ఈ విధంగా ఉండగా మళ్లీ మళ్లీ తప్పుడు ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడటం సబబు కాదు.
#FactCheck
#AndhraPradesh
DSC 2025 నియామకాలకు సంబంధించి పలు రకాలుగా, పలు దఫాలుగా అధికారికంగా అనుమాన నివృత్తి చేసినా కూడా మళ్లీ మళ్లీ అవే ఆరోపణలను ప్రస్తావిస్తూ, కొత్త అంశాలుగా తెరపైకి తీసుకువస్తుండటం కొందరికి అలవాటుగా మారింది. గత ఏడాది కాలంగా అద్భుతంగా పని చేస్తూ విద్యావ్యవస్థకు మెరుగులు దిద్దుతూ లక్షలాది మంది పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతున్న వేలాది మంది ఉపాధ్యాయులను అవమానిస్తూ, వారిపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తే విధంగా ప్రచారం చేయడం తీవ్ర అభ్యంతరకరం.
ఆరోపణ: ప్రశ్నా పత్రాల తయారీ, DSC పరీక్షల నిర్వహణను ఒకే వ్యక్తి చేతిలో పెట్టారు.
వాస్తవం: ప్రశ్నా పత్రం తయారీ అనే అంశమే DSC 2025 లో లేదు. ఎందుకంటే అది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT). ఈ విధానం ఎలా ఉంటుందంటే మొత్తం 42 వేల ప్రశ్నలతో ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. TCS ION ప్లాట్ ఫారమ్ ద్వారా ఈ CBT నిర్వహించారు.
ఈ TCS ION అనేది 23 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పబ్లిక్ రంగ సంస్థలు, RRB, NATS, IITs, IIMs, AIIMS కూడా ఇదే ప్లాట్ ఫారమ్ ను పరీక్షల నిర్వహణకు వినియోగిస్తున్నాయి. దీనిలోకి క్వశ్చన్ బ్యాంక్ ను అప్ లోడ్ చేయడానికి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం జరిగింది. వారు ప్రతి రోజూ పాస్ వర్డ్ మారుస్తారు. ప్రశ్నలను అప్ లోడ్ చేసే క్రమంలో తాత్కాలిక ఉద్యోగులను నియమించలేదు. వేరే ఎవరికి ఆ కంప్యూటర్లతో యాక్సెస్ ఉండదు.
42 వేల ప్రశ్నలను గుర్తు పెట్టుకోవడం వాటిని బయటకు వచ్చి చెప్పడం అసాధ్యం. 42 వేల ప్రశ్నలు రాన్ డమ్ పద్ధతిలో అభ్యర్ధులకు వస్తాయి. అందువల్ల పేపర్ లీక్ కావడం అనే సమస్య ఉత్పన్నం కాదు.
ప్రభుత్వం ఇంత పారదర్శకంగా DSC 2025 నిర్వహిస్తే పరీక్ష నిర్వహణపై తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదు. CBT విధానంలో జరిగిన పరీక్షపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం సబబు కాదు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh











