పల్సర్ బైక్‌లలో మద్యం బాటిళ్ల తరలింపు! సీటు కిందే కాకుండా పెట్రోల్ ట్యాంక్‌లలోనూ లిక్కర్ బాటిళ్లు దాచిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ తెలివేంటి నాయనా! 😲
#LiquorSmuggling #PulsarBike #LiquorSeizure #ViralNews
ఇబ్రహీంపట్నం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. NIUM క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అనంతరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు.
#RevanthReddy #BharatFutureCity #NIUM #Telangana
మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్‌లో అక్టోబర్ 17న కదులుతున్న రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య పడబోతున్న 55 ఏళ్ల మహిళను RPF ASI సోనల్ ఇంగ్లే రక్షించారు.
#SonalIngle #RPF #RailwayProtectionForce
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రాణహిత నీటిని మళ్లించేందుకు నవంబర్ చివరి నాటికి కాఫర్ డ్యామ్ నిర్మించాలని కవిత డిమాండ్ చేశారు. రూ.25 కోట్లతో నెలన్నరలో పనులు పూర్తి చేయవచ్చని పేర్కొంటూ, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
#Kavitha #Kannepalli #Pranahita #Medigadda
హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా వద్ద మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బట్టలకు మంటలు అంటుకోవడంతో భారీగా పొగ వ్యాపించింది. నాలుగు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినా, పొగ తగ్గక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
#HyderabadFire #OldCity #Madina #FireAccident
మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయ కోనేరులోకి ఇన్నోవా క్రిస్టా కారు దూసుకెళ్లి నీటిలో మునిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో డ్రైవర్ ఒక్కరే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
#Maheshwaram #ShivagangaTemple #InnovaCrysta
సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మున్సిపల్ కార్మికులతో కలిసి టిఫిన్ చేశారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో ఆయన గడిపిన సమయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
#HarishRao #Siddipet #MunicipalWorkers #BRS
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు.
#SaddulaBathukamma #Vemulawada #RajannaSircilla
సిద్దిపేటలోని వైశ్య భవన్, భారత్ నగర్, శివాజీ నగర్‌లలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
#HarishRao #Srinitha #Siddipet #Bathukamma #affirestelangana
యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సవాల్లో సందడి చేశారు.
#SaddulaBathukamma #Bhuvanagiri #Yadadri
ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడగా, చికిత్స కోసం వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
#RTCBusAccident #Batasingaram#Khammam
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవుతున్న రష్మిక మందన్నపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బతుకమ్మ చీరతో దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రష్మికను చూసి తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
#RashmikaMandanna #TelanganaCulture #telangana
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నివాసానికి హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విచ్చేశారు. వివాహం తర్వాత తెలంగాణలో తొలి దసరా జరుపుకుంటున్న రష్మికకు భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక బతుకమ్మ చీరను దసరా కానుకగా అందజేశారు.
#VijayDeverakonda #RashmikaMandanna #BhattiVikramarka
పవన్ కళ్యాణ్ ప్రారంభించిన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమంలో భాగంగా JSP Telangana ప్రతినిధులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, ఆకాంక్షలు తెలుసుకున్నారు.
#JSPTelangana #PawanKalyan #GraduateExpress #OsmaniaUniversity
రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై మినీబస్సు కాలువలో పడిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్ నుంచి ఖాటు శ్యామ్‌జీ ఆలయానికి వెళ్తున్న బృందం ప్రమాదానికి గురైంది.
#RajasthanAccident #Kota #DelhiMumbaiExpressway #BusAccident
నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కన్నెపల్లి, దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల వద్దకు వెళ్దామని, నీటిని ఎత్తకుండా వదిలేసిన తీరును నిరూపిస్తానని సవాల్ విసిరారు.
#HarishRao #RevanthReddy #Kannepalli #Devadula
నవంబర్ 6న తెలంగాణ R&B AEE, SSC JE పరీక్షలు ఒకే రోజు ఉండటంతో సివిల్ ఇంజనీరింగ్ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. AEE పరీక్షను వాయిదా వేయాలని TGPSC కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
#TGPSC #Unemployment #AEEExam #SSCJE #CivilEngineering #affirestelangana
హైదరాబాద్ చార్మినార్ వద్ద ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ నిర్వహించిన CJP నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపితే తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిరసనకారులు ప్రశ్నించారు.
#Charminar #CJP #Hyderabad #affirestelangana
సమ్మక్క సాగర్ నుంచి కాకుండా పోలవరం నుంచి నదుల అనుసంధానం చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినట్లు హరీష్ రావు విమర్శించారు. బొల్లేపల్లి రిజర్వాయర్‌కు నీరు అందితే తెలంగాణ ప్రయోజనాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
#HarishRao #ChandrababuNaidu #BRS #TelanganaRights #affirestelangana
దసరా సెలవులు, వీకెండ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వాహనాలు భారీగా తరలివెళ్తున్నాయి. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ బూతుల వద్ద వాహనాలు బారులు తీరాయి.
#PantangiTollPlaza #TrafficJam #DussehraHolidays #Hyderabad

