The official handle of ANAKAPALLI DISTRICT POLICE.... Please don't report Crime here. In case of emergency #Dial 100/#Dial112, #WhatsApp-9346912724

Anakapalli
Joined March 2020
ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ పర్యటన – భద్రతా ఏర్పాట్ల పరిశీలన అనకాపల్లి (బుచ్చయ్యపేట, కొత్తకోట, రోలుగుంట), అక్టోబర్ 22: అనకాపల్లి జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజుకు చేరిన నేపథ్యంలో, నామినేషన్ కేంద్రాలు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు విస్తృతంగా పర్యటించారు. బుచ్చయ్యపేట మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్సై మనోజ్ కుమార్‌లతో కలిసి; రావికమతం ఎంపీడీవో కార్యాలయం వద్ద కొత్తకోట ఎస్సై శ్రీనివాస్‌తో; అలాగే రోలుగుంట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎస్సై రామకృష్ణారావుతో కలిసి జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు జారీ చేసిన ముఖ్య ఆదేశాలు & సూచనలు: ​100 మీటర్ల పరిధిలో గుంపులను అనుమతించవద్దు: నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 100 మీటర్ల లైన్ వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా తక్షణమే అక్కడ ఉన్న గుంపులను చెదరగొట్టాలని స్పష్టం చేశారు. వేర్వేరు పార్టీల వర్గాల మధ్య ఎలాంటి వాగ్వాదాలు, ఘర్షణలు తలెత్తకుండా 100 మీటర్ల పరిధి బయటే నియంత్రించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిమిత సంఖ్యలోనే అనుమతి: నామినేషన్ కేంద్రం 100 మీటర్ల పరిధిలోకి అనవసరపు వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని, నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నలుగురికి మించి ఎక్కువ మంది ఉండకూడదని స్పష్టం చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థులు, వారితో వచ్చిన వ్యక్తులు అక్కడే వేచి ఉండకుండా వెంటనే వెనుదిరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాలీల సమయాల్లో సమన్వయం: వివిధ రాజకీయ పార్టీలు ఒకే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేసేలా సమన్వయం చేసుకోవాలని, శాంతిభద్రతల సమస్యలు రాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ నిర్ణీత గడువులోగా ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు. నిరంతర డ్రోన్ నిఘా & కఠిన చర్యలు: భద్రతా పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగిస్తూ నిరంతరం నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అమలు: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. (144 సి.ఆర్.పి.సి) అమల్లో ఉన్నట్లు ఎస్పీ గారు పునరుద్ఘాటించారు. ప్రజలు, అభ్యర్థులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ​ఈ పర్యటనలో సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
1
66
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలు – జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్; ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ అనకాపల్లి, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. పోలీసులు అందించే భరోసాతోనే జిల్లా ప్రగతి – జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్: కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ – "సమాజంలో శాంతిభద్రతల రక్షణ కోసం ముఖపరిచయం లేని సాధారణ పౌరుల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే గొప్ప వృత్తి యూనిఫాం సర్వీస్. గడచిన రెండేళ్లలో అనకాపల్లి జిల్లా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాకు రూ.4 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మన పోలీసు విభాగం కల్పిస్తున్న పటిష్టమైన శాంతిభద్రతలు, రక్షణే. పెట్టుబడిదారులకు, ప్రజలకు భయం లేకుండా ముందుకు సాగేలా నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల కృషి ఎంతో గొప్పది. జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం, విద్యావ్యవస్థ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజం మరింత ప్రగతిపథంలో పయనిస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగస్ఫూర్తితో ప్రజాసేవలో ముందుంటాం – జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్: అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ – "1959 అక్టోబర్ 21న చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ రక్షణ కోసం పోరాడి అసువులు బాసిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల స్మారకార్థం ప్రతి ఏటా ఈ దినాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకరు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. నేడు లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (నక్సలిజం), ఉగ్రవాదం వంటి సమస్యలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు వంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అణచివేసేందుకు పోలీసు సిబ్బంది మరింత ప్రొఫెషనలిజంతో పనిచేయాలి. చట్టపరిధిలో తమ విధులను నిర్భయంగా, నిస్వార్థంగా నిర్వహించినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడంలో వారి కుటుంబ సభ్యుల పాత్ర, మద్దతు ఎంతో కీలకమైనవి. అమరుల కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది" అని తెలిపారు. ​ఈ సందర్భంగా 1983 నుంచి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ పరిధిలో వీరమరణం పొందిన 27 మంది అమరవీరుల వివరాలను, దేశవ్యాప్తంగా అమరులైన పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ మరియు ఎస్పీల చేతుల మీదుగా 14 మంది అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.10,000/- చొప్పున నగదు చెక్కులను, జ్ఞాపికలను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, డీఎస్పీలు శ్రీ పి.శ్రీనివాస రావు, శ్రీ పి.వి.వి. నరసింహారావు, శ్రీ వి.బాబ్జీరావు, పరిపాలనాధికారి శ్రీ సిహెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, ప్రేమ కుమార్, అశోక్ కుమార్, నాగేశ్వరరావు, రమేష్, రామకృష్ణారావు, మన్మధరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు మరియు కృష్ణదేవిపేట జడ్పీ హైస్కూల్ ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. @APPOLICE100
1
3
217
*కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ పూజ* *సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనకాపల్లి అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు దంపతులు* *జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు* *విశాఖపట్నం (కైలాసగిరి), అక్టోబర్ 20:* విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కైలాసగిరిలోని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఆయుధ పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించారు. తొలుత ఆయుధాగారంలో కొలువుదీరిన శ్రీ దుర్గాదేవి చిత్రపటానికి విశేష పూజలు చేసి, మంగళహారతులు సమర్పించారు. అనంతరం విధి నిర్వహణలో పోలీసులు వినియోగించే వివిధ రకాల అధునాతన ఆయుధాలు, తుపాకులు, జిమ్, ప్రత్యేక పోలీసు వాహనాలను పూలతో సర్వాంగసుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. *ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు మాట్లాడుతూ,* చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొన్నారు. సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఆయుధాలను గౌరవిస్తూ ప్రతి ఏటా ఆయుధ పూజ నిర్వహించడం పోలీసు శాఖలో ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ పర్వదినం జిల్లా ప్రజల, పోలీసు అధికారుల, సిబ్బంది కుటుంబాల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐలు) రామకృష్ణారావు, మన్మధరావు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఎస్‌ఐలు) ప్రసాద్, హరినాథ్, గంగాధర్ సహా పలువురు పోలీసు అధికారులు, ఏఆర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #AndhraPradeshStatePolice @APPOLICE100
1
132
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లావ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో ముమ్మర తనిఖీలు సమస్యాత్మక వ్యక్తులు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ హెచ్చరిక అనకాపల్లి, అక్టోబర్ 19: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే అనుమానాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల కదలికలను గుర్తించేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల వివరాలు: ఎలమంచిలి టౌన్: ఎలమంచిలి సీఐ ధనుంజయరావు, ఎస్ఐ ఉపేంద్రల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లాడ్జీల రిజిస్టర్లను, గదుల్లో బస చేసిన వారి వివరాలను పరిశీలించారు. అనకాపల్లి టౌన్: అనకాపల్లి టౌన్ ఎస్సై షేక్ జిలానీ మరియు సిబ్బంది పట్టణ పరిధిలోని అన్ని ప్రధాన లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. పాయకరావుపేట: పాయకరావుపేట ఎస్సై పురుషోత్తం ఆధ్వర్యంలో తాండవ జంక్షన్‌లోని జేపీ రెసిడెన్సీ లాడ్జ్, పడాలవాని లక్ష్మీపురంలోని స్వాగత్ లాడ్జీలతో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టారు. నర్సీపట్నం టౌన్: నర్సీపట్నం టౌన్ ఎస్సై ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో పట్టణంలోని లాడ్జీలను తనిఖీ చేశారు. ​ఈ తనిఖీలలో భాగంగా అధికారులు లాడ్జీల్లో బస చేస్తున్న వారి గుర్తింపు కార్డులు, బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు గానీ, అవాంఛనీయ కార్యకలాపాలు గానీ గుర్తించబడలేదు. లాడ్జ్ మరియు హోటల్ యజమానులకు పోలీసుల హెచ్చరికలు: ​లాడ్జీలు, హోటళ్లలో గదులు కేటాయించే సమయంలో విధిగా ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను పరిశీలించి, రిజిస్టర్లలో పూర్తి వివరాలను నమోదు చేయాలి. ​సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలి. ​ఎవరైనా కొత్తవారు, అనుమానాస్పద వ్యక్తులు బస చేసినా లేదా అనుమానాస్పద వస్తువులు కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112/100 కు సమాచారం అందించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. @APPOLICE100
1
1
3
688
అనకాపల్లి జిల్లాలో భారీ దొంగతనాల ముఠా గుట్టురట్టు – ముగ్గురు నిందితుల అరెస్ట్ సుమారు ₹80.33 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల సమష్టి కృషితో 28 కేసుల ఛేదన పరవాడ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు గారు ​ అధికారులు, సిబ్బంది ప్రతిభను ప్రశంసించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు పరవాడ, అక్టోబర్ 19: అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు దొంగతనాల కేసులను జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ బి.మోహన రావు గారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్) శ్రీ ఎల్.మోహన రావు గారు కేసు వివరాలను అధికారికంగా వెల్లడించారు. ​ కేసు నేపథ్యం: ​మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కన్నం రమేశ్ అనే వ్యక్తి తన ఇంట్లో దొంగతనం జరిగిందని తేది. 06.10.2026న ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నం. 137/2026 U/s 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ​ పోలీసుల నిఘా – సాంకేతికతతో నిందితుల పట్టివేత: ​జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో నిఘా ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తేది. 18-10-2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మునగపాక ఎస్సై పి.ప్రసాదరావు మరియు వారి సిబ్బంది అనకాపల్లి హైవే బస్ స్టాప్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా భారీగా బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ​ అరెస్టయిన నిందితుల వివరాలు: ​చేపల ఆనంద్ (28), తండ్రి: అమ్మోరు, నివాసం: గంగవరం, పెదగంట్యాడ మండలం, విశాఖపట్నం జిల్లా. చిత్తరపు అభిషేక్ (23), తండ్రి: సన్యాసిరావు, నివాసం: దొమ్మేటి వీధి, పెదగంట్యాడ మండలం, విశాఖపట్నం జిల్లా. నిమ్మడా దిలీప్ (20), తండ్రి: దివంగత శ్రవణ్ కుమార్, నివాసం: బాలచెరువు వీధి, పెదగంట్యాడ మండలం, విశాఖపట్నం జిల్లా. నేర చరిత్ర – నేరాల శైలి: ​నిందితులు ముగ్గురూ గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన పాత నేరస్థులు. వీరు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా బీరువాలు పగలగొట్టి ఆభరణాలు, నగదు చోరీ చేయడం, దుకాణాల షట్టర్లు తెరిచి దొంగతనాలకు పాల్పడటం చేసేవారు. నిందితులపై గతంలో విశాఖ, అనకాపల్లి పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 31 కేసులు నమోదై ఉన్నాయి (చేపల ఆనంద్‌పై 17 కేసులు, చిత్తరపు అభిషేక్‌పై 13 కేసులు, నిమ్మడా దిలీప్‌పై 1 కేసు). స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు (మొత్తం విలువ సుమారు ₹80,33,823/-): బంగారు ఆభరణాలు: 442.652 గ్రాములు (సుమారు 37.95 తులాలు) – విలువ సుమారు ₹66,72,093/- వెండి వస్తువులు/ఆభరణాలు: 6,361.504 గ్రాములు (సుమారు 6.362 కిలోలు) – విలువ సుమారు ₹13,71,730/- నగదు: ₹30,000/- ​ ఛేదించిన కేసులు: ​నిందితులను విచారించగా మునగపాక, నక్కపల్లి, రాంబిల్లి, పరవాడ, ఎలమంచిలి రూరల్, ఎలమంచిలి టౌన్, సబ్బవరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 28 దొంగతనాల కేసులకు సంబంధించిన సొత్తుగా గుర్తించి రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ గారి ప్రశంసలు – ప్రశంసా పత్రాల అందజేత: ​కేసును అత్యంత ప్రతిభావంతంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ సమయంలో ఛేదించిన పరవాడ డీఎస్పీ శ్రీ బి.మోహన రావు, ఎలమంచిలి సీఐ ధనుంజయరావు, పరవాడ సీఐ భాస్కర రావు, రాంబిల్లి సీఐ నర్సింగరావు, మునగపాక ఎస్సై పి.ప్రసాదరావులతో పాటు కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. మీడియా సమావేశం అనంతరం అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. @APPOLICE100
1
153
శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ అనకాపల్లి పట్నం, అక్టోబర్ 19: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, అనకాపల్లి గవరపాలెంలో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ​ఆలయానికి విచ్చేసిన ఐజీ గారికి ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర హారతిని స్వీకరించారు. అనంతరం ఆలయ మర్యాదలతో పండితుల వేదాశీర్వచనం మధ్య ఐజీ గోపీనాథ్ జట్టి గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, శ్రీ నూకాంబిక అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు మరియు అమ్మవారి దివ్య చిత్రపటాన్ని బహుకరించారు. ​ఈ కార్యక్రమంలో: ​పీలా నాగశ్రీను (గొల్ల బాబు) - దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ​ప్రేమ కుమార్ - అనకాపల్లి టౌన్ సీఐ ​నాగేశ్వరరావు - అనకాపల్లి ట్రాఫిక్ సీఐ ​ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. @APPOLICE100
3
148
గంజాయి అక్రమ రవాణాపై అనకాపల్లి జిల్లా పోలీసుల ఉక్కుపాదం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ రూ. 1.33 కోట్ల విలువైన 230 కేజీల గంజాయి, కార్లు, బైకులు మరియు నగదు స్వాధీనం పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు నర్సీపట్నం, అక్టోబర్ 19: నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ​అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఘటన వివరాలు: ​అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహీన్ సిన్హా గారు మరియు నర్సీపట్నం ఎస్డీపీఓ (SDPO) శ్రీ పి.శ్రీనివాస రావు గారికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) ఎల్.రేవతమ్మ గారు, ఎస్సై (SI) పి.రాజారావు మరియు వారి పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ​19-10-2026 తేదీ ఉదయం సుమారు 07:30 గంటల సమయంలో, నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ శివారు అడ్డదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా వస్తున్న ఒక ఎర్టిగా కారు మరియు దానికి పైలట్లుగా ఉన్న రెండు మోటార్ సైకిళ్లను అడ్డుకున్నారు. పోలీసుల తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 230 కేజీల గంజాయిని గుర్తించి, తరలిస్తున్న ఐదుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 71/2026 u/s 20(b)(ii)(C), 25 r/w 8(C) NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. ​ పట్టుబడిన నిందితుల వివరాలు: ​శశి కుమార్ (52), తండ్రి: దొరయికన్ను, వృత్తి: డ్రైవర్, అన్నై సేవకామి నగర్, రామనాథపురం, తంజావూరు *జిల్లా, తమిళనాడు (A-1). ​ పాంగి సుబ్బారావు @ చందు (21), తండ్రి: దుంబ్రి, కులం: ST-PTG, కిల్లంకోట పంచాయతీ, జి. మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా (A-2). వంతల చంటి బాబు (27), తండ్రి: బిర్సు, కులం: ST-PTG, అన్నవరం కాలనీ, చింతపల్లి మండలం, ASR జిల్లా (A-3). అమల రాజ్ (36), తండ్రి: ఇషిటోర్, వృత్తి: చేపల వేట, వెరూర్ గ్రామం, తమిళనాడు (A-4). మణికందన్ చంద్రకుమార్ @ రాహుల్ (22), తండ్రి: చంద్రకుమార్, శ్రీలంక శరణార్థుల శిబిరం (Refugee Camp), మరక్కాణం, విల్లుపురం జిల్లా, తమిళనాడు (A-5). ​నేర నేపథ్యం – రవాణా తీరు: ​A-1 (శశికుమార్) తమిళనాడుకు చెందిన ప్రధాన గంజాయి వ్యాపారి. ఏపీలోని ఏజెన్సీ మరియు ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నై, కోయంబత్తూరు, తంజావూరులతో పాటు శ్రీలంకకు తరలించి చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ భారీ లాభాలు గడించేవాడు. ​2024లో పుదుక్కోట్టై జిల్లా జైలులో A-1, A-3 (చంటిబాబు)లకు పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ సంప్రదించుకున్నారు. ​A-3 తన స్నేహితుడైన A-2 (పాంగి సుబ్బారావు)తో కలిసి ఒడిశాలోని జంతాపాయి గ్రామంలో కిలో రూ.5,000/- చొప్పున 230 కేజీల గంజాయిని కొనుగోలు చేసి జి.మాడుగుల మండలం అలగం గ్రామంలో దాచారు. ​అనంతరం A-1 తన అనుచరులైన A-4, A-5 లతో కలిసి పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ గల ఎర్టిగా కారులో వచ్చి గంజాయిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ​19-10-2026 తెల్లవారుజామున 10 ప్లాస్టిక్ గోనె సంచులలో నింపిన 230 కేజీల గంజాయిని ఎర్టిగా కారులో పెట్టుకుని, పోలీసుల నిఘా తప్పించేందుకు ముందుగా రెండు మోటార్ సైకిళ్లతో పైలటింగ్ చేస్తూ వస్తుండగా గబ్బాడ గ్రామ శివార్లలో పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు (మొత్తం విలువ: సుమారు రూ.1,33,70,000/-): గంజాయి: సుమారు 230 కేజీలు (విలువ రూ. 1,15,00,000/-) ​ఎర్టిగా కారు: PY02 S 0227 (విలువ రూ. 13,00,000/-) ​బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్: AP31 EH 7988 (విలువ రూ. 1,00,000/-) ​యమహా MT-15 మోటార్ సైకిల్: AP39 BL 8859 (విలువ రూ. 1,00,000/-) ​మొబైల్ ఫోన్లు: 5 (విలువ రూ. 2,50,000/-) ​నగదు: రూ.1,20,000/- సిబ్బందికి ప్రశంసలు: ​ఈ దాడిలో ప్రతిభ కనబరిచిన నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీమతి ఎల్.రేవతమ్మ, ఎస్సై పి.రాజారావు, ఎస్సై పి.రామారావు, ఎస్సై వి.రిషికేశ్వరరావులతో పాటు హెడ్ కానిస్టేబుల్ కొండబాబు, కానిస్టేబుళ్లు నవీన్, శివ, సాయి, ఆదినారాయణ, స్పెషల్ పార్టీ పీసీలు చిన్నారావు, సంతోష్ మరియు హోంగార్డులు రాము, దేవేంద్రలను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ గారు హెచ్చరించారు. @APPOLICE100
5
239
సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని నివారించిన అచ్యుతాపురం సీఐ – త్రుటిలో తప్పిన భారీ అగ్నిప్రమాదం రాత్రి గస్తీలో అప్రమత్తత ప్రదర్శించిన అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్ బృందం ఉల్లి లోడు లారీ టైర్లలో చెలరేగిన మంటలను సకాలంలో గుర్తించి ఆర్పివేత పోలీసుల చొరవను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన లారీ డ్రైవర్ అనకాపల్లి, అక్టోబర్ 19: రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సమయస్ఫూర్తి, అప్రమత్తత కారణంగా ఓ లారీకి సంభవించాల్సిన పెను అగ్నిప్రమాదం తప్పింది. ​వివరాల్లోకి వెళితే, అచ్యుతాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) చంద్రశేఖర్ గారు తమ సిబ్బందితో కలిసి రాత్రి గస్తీ విధుల్లో ఉండగా, తాళ్లపాలెం జంక్షన్ సమీపంలో తుని వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఓ ఉల్లి లోడు లారీ (AP 39 X 9429) వీల్ డ్రమ్ జామ్ (seize) అవ్వడం వల్ల వెనుక టైర్ల వద్ద ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగాయి. ​లారీ రన్నింగ్‌లో ఉండడం, పొగలు మంటలు వెనుక భాగంలో ఉండటంతో ఆ విషయాన్ని వాహన డ్రైవర్ గమనించలేకపోయారు. దీన్ని తక్షణమే గమనించిన సీఐ చంద్రశేఖర్ మరియు సిబ్బంది వెనువెంటనే లారీని వెంబడించి అప్రమత్తం చేసి సురక్షితంగా నిలిపివేయించారు. అనంతరం లారీ డ్రైవర్, క్లీనర్‌లతో కలిసి పోలీసులు వెంటనే నీటిని చల్లి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ​పోలీసులు సకాలంలో స్పందించి హెచ్చరించడం వల్ల లారీతో పాటు అందులోని విలువైన సరుకు పూర్తిగా దగ్ధం కాకుండా కాపాడగలిగారు. సరైన సమయంలో కాపాడి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసినందుకు లారీ డ్రైవర్, సహాయకుడు పోలీసు అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ​రాత్రి గస్తీ విధుల్లో విశేష అప్రమత్తత కనబరిచి, సమయస్ఫూర్తితో పెను ప్రమాదాన్ని నివారించిన అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్ గారిని, వారి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా రక్షణే ధ్యేయంగా అప్రమత్తంగా విధులు నిర్వహించే పోలీసుల సేవలు ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు. @APPOLICE100
111
రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం: అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసుల ‘ఫేస్ వాష్ అండ్ గో’ (Face Wash and Go) కార్యక్రమం అనకాపల్లి, అక్టోబర్ 19: రాత్రి సమయాలలో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, వాహనదారుల భద్రతను పెంపొందించేందుకు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాత్రి వేళల్లో గస్తీ విధులు నిర్వహిస్తూ, డ్రైవర్లు నిద్రమత్తు వల్ల ప్రమాదాల బారిన పడకుండా పలు జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్ల వద్ద ‘ఫేస్ వాష్ అండ్ గో’ (Face Wash and Go) కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ​రాత్రి వేళల్లో దూరప్రాంతాలకు ప్రయాణించే లారీలు, బస్సులు, వ్యాన్లు మరియు ఇతర వాహనాలను నిలిపి, డ్రైవర్లకు ముఖం కడుక్కోవడానికి నీరు అందించి వారిని అప్రమత్తం చేశారు. నిద్రమత్తుగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకుని వాహనాలు నడపాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలు & వివరాలు: అచ్యుతాపురం: అచ్యుతాపురం సిఐ చంద్రశేఖర్ గారి పర్యవేక్షణలో అచ్యుతాపురం 4 రోడ్ల జంక్షన్ వద్ద వాహనదారులకు ముఖం కడిగించి భద్రతా సూచనలు చేశారు. ఎలమంచలి రూరల్: రాత్రి గస్తీ విధులలో భాగంగా ఎలమంచలి రూరల్ ఎస్సై ఉపేంద్ర గారు రేగుపాలెం జంక్షన్ వద్ద వాహనాలను ఆపి ‘ఫేస్ వాష్ అండ్ గో’ నిర్వహించారు. ​ నక్కపల్లి: నక్కపల్లి ఎస్సై సన్నీబాబు గారి ఆధ్వర్యంలో వేంపాడు టోల్‌గేట్ వద్ద రాత్రి వేళల్లో ప్రయాణించే డ్రైవర్లను నిలిపి ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహించారు. దేవరపల్లి: దేవరపల్లి ఎస్సై సత్యనారాయణ గారు కశింకోట జంక్షన్ వద్ద ‘స్టాప్ అండ్ ఫేస్ వాష్’ కార్యక్రమం ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. ​రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిద్రమత్తు లేదా అలసటగా ఉన్నప్పుడు వాహనాలు నడపకుండా సురక్షిత ప్రదేశాల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ​#AndhraPradeshStatePolice @APPOLICE100
1
194
ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: ఎలమంచిలి టౌన్ ఎస్సై సావిత్రి ధర్మవరం, ఎన్టీఆర్ కాలనీలలో ప్రజలకు అవగాహన సదస్సులు ఎలమంచిలి, అక్టోబర్ 17: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, మరియు పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ బి.మోహన రావు గార్ల ఆదేశాల మేరకు, ఎలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ధనుంజయరావు పర్యవేక్షణలో ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మవరం మరియు ఎన్టీఆర్ కాలనీలలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎలమంచిలి టౌన్ ఎస్సై సావిత్రి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల సమయంలో ప్రజలంతా సంయమనం పాటిస్తూ శాంతియుత వాతావరణంలో మెలగాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు, తగాదాలు, వివాదాలకు తావులేకుండా సోదరభావంతో ఉండాలని స్పష్టం చేశారు. ​ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తించినా, వివాదాలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తక్షణ సహాయం కొరకు డయల్ 112 కు కాల్ చేసి సమాచారం తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ​ఈ అవగాహన సమావేశాల్లో స్థానిక కాలనీవాసులు, యువకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
1
106
ఎన్నికల కోడ్ ముగిసే వరకు ‘పీజీఆర్‌ఎస్’ (PGRS) రద్దు డిసెంబర్ 3 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిలిపివేత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలి: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ అనకాపల్లి, అక్టోబర్ 18: అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చిన దృష్ట్యా, ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ​జిల్లాలో మున్సిపల్, జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటంతో 2026 అక్టోబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ: ​భద్రతా విధులు: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత బందోబస్తు, భద్రతా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. కార్యక్రమం నిలిపివేత: ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, పోలీసు అధికారులు శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతల్లో ఉండటం వల్ల డిసెంబర్ 3వ తేదీ వరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించబడదు. ​ నిబంధనల అమలు: జిల్లాలోని అధికారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను, నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ​ప్రజలు, అర్జీదారులు ఈ మార్పును గమనించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. @APPOLICE100
141
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: అనకాపల్లి డీఎస్పీ శ్రీ పి.వి.వి.నరసింహారావు సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి | ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు అనకాపల్లి పట్టణం, అక్టోబర్ 18: ​స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా అనకాపల్లి సబ్-డివిజన్ పరిధిలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ శ్రీ పి.వి.వి. నరసింహారావు గారు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) నిబంధనల ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు తేది.14.10.2026 నుంచి క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన జారీ చేసిన కీలక ఆదేశాలు మరియు మార్గదర్శకాలు: సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: అనకాపల్లి డివిజన్ వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. పోలీస్ శాఖ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు నిర్వహించడం లేదా మైక్ సెట్లు/లౌడ్‌స్పీకర్లు వినియోగించడం చట్టరీత్యా నేరం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC): గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు మరియు కార్యకర్తలు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని తు.చ. తప్పకుండా పాటించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై అనధికారిక ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడ రాతలను అనుమతించబోము. ప్రలోభాలపై నిఘా: ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువుల పంపిణీకి పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తాము. అక్రమ రవాణా, నిల్వలపై ప్రత్యేక నిఘా బృందాలు (FST, SST) 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. శాంతిభద్రతల పరిరక్షణ: ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా సహించే ప్రసక్తే లేదు. రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుంది. ​"ప్రజాస్వామ్య పండుగలాంటి ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో, చట్టబద్ధంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాము." — శ్రీ పి.వి.వి. నరసింహారావు, @APPOLICE100
1
9
832
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ హెచ్చరిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ నర్సీపట్నం, కసింకోట పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లను హెచ్చరించిన పోలీసు అధికారులు అనకాపల్లి, అక్టోబర్ 17: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నర్సీపట్నం, కసింకోట పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్థులు మరియు చెడు నడత కలిగిన వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ​ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మాట్లాడుతూ — ​"రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షికంగా మరియు పారదర్శకంగా నిర్వహించడమే జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యం. ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, చట్టవ్యతిరేక లేదా సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదు. రౌడీ షీటర్లు తమ వైఖరిని మార్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలి. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ఘర్షణలు లేదా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ సహా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు." నర్సీపట్నం టౌన్: నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్, ఎస్సై ఉమామహేశ్వర్ స్థానిక రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి రాజకీయ వివాదాలు, గొడవలు మరియు అవాంఛనీయ చర్యల్లో పాలుపంచుకోవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. కసింకోట: అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పీ.వీ.వీ. నరసింహారావు గారి పర్యవేక్షణలో, కసింకోట ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవించాలని, ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు లేదా శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. @APPOLICE100
1
362
గంజాయి అక్రమ రవాణాదారులపై అనకాపల్లి జిల్లా పోలీసుల ఉక్కుపాదం: పాత నేరస్థుడిపై 'పిట్ ఎన్.డి.పి.ఎస్' (PIT NDPS) చట్టం ప్రయోగం — విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు పాయకరావుపేట, అక్టోబర్ 17: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు విక్రయాలను సమూలంగా నిర్మూలించే దిశగా అనకాపల్లి జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. వరుసగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న పాత నేరస్థుడిపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ‘పిట్ ఎన్.డి.పి.ఎస్’ (PIT NDPS - Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988) చట్టం కింద డిటెన్షన్ ఉత్తర్వులు అమలు చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడి వివరాలు: ​పేరు: నోట్ల చిన రామకృష్ణ (వయస్సు: 24 సంవత్సరాలు, వృత్తి: ఏసీ టెక్నీషియన్) ​చిరునామా: డి.నం.23-260, పీనారిపాలెం, నర్సీపట్నం టౌన్, అనకాపల్లి జిల్లా. ​ నేర చరిత్ర – నమోదైన కేసులు: ​నిందితుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గంజాయిని సేకరించి, అనకాపల్లి మరియు పొరుగు జిల్లాలకు అక్రమ రవాణా చేస్తూ విద్యార్థులు, యువతకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇతనిపై గతంలో నమోదైన కేసులు: పాయకరావుపేట పోలీస్ స్టేషన్: క్రైమ్ నం. 303/2021 (యూ/ఎస్ 20(b)(ii)(c), 25 r/w 8(c) NDPS Act) – 300 కేజీల గంజాయి స్వాధీనం. కోటనందూరు పోలీస్ స్టేషన్: క్రైమ్ నం. 84/2023 (యూ/ఎస్ 8(c) r/w 20(b)(ii)(C) NDPS Act) – 250 కేజీల గంజాయి స్వాధీనం. కొయ్యూరు పోలీస్ స్టేషన్: క్రైమ్ నం. 35/2024 (యూ/ఎస్ 20(b)(ii)(c), 25 r/w 8(c) NDPS Act) – 554.730 కేజీల గంజాయి స్వాధీనం. ​ఇలా మొత్తం 1,100 కేజీలకు పైగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉంటూ, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (రెవెన్యూ/ఎక్సైజ్ శాఖ) జి.ఓ.ఆర్టీ నం. 1006 ద్వారా నిందితుడిపై PIT NDPS చట్టం కింద డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు: ​పాయకరావుపేట సీఐ వినోద్ బాబు, జిల్లా ఎన్.డి.పి.ఎస్ (NDPS) సెల్ సీఐ పిల్లా రమేష్ మరియు పాయకరావుపేట ఎస్సై పురుషోత్తంల ఆధ్వర్యంలో పోలీసు బృందం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం పటిష్ట భద్రత నడుమ విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించి అధికారులకు అప్పగించారు. ​ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ: ​"యువత భవిష్యత్తును నాశనం చేస్తూ, సమాజ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న గంజాయి ముఠాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా కళాశాలల సమీపంలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, పదే పదే నేరాలకు పాల్పడే అలవాటున్న నేరస్థులపై కఠినమైన 'పిట్ ఎన్.డి.పి.ఎస్' (PIT NDPS) చట్టం అమలు చేస్తాం. గంజాయి రవాణా, నిల్వ లేదా విక్రయాల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భాగస్వాములయ్యే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలని, గంజాయి సమాచారం తెలిస్తే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు అందించాలని కోరుతున్నాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి." @APPOLICE100
1
380
“ప్రశాంతమైన ఎన్నికలే మన లక్ష్యం” – ఎన్నికల సన్నద్ధతపై విశాఖపట్నం రేంజ్ ఐజీపీ సమీక్ష* *విశాఖపట్నం, అక్టోబర్ 16, 2026:* డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్, ఆంధ్రప్రదేశ్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం రేంజ్ పోలీస్ అధికారులతో జరగనున్న సమీక్షా సమావేశానికి ముందస్తు సన్నద్ధత, స్థానిక సంస్థల ఎన్నికల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర అంశాలపై విశాఖపట్నం రేంజ్ ఐజీపీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల ఎస్పీలు, ఎస్‌డీపీఓలు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్, పోలవరం జిల్లా ఎస్పీ శ్రీ కె.చక్రవర్తి, అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర్ రెడ్డి, ఐపీఎస్‌లతో పాటు అన్ని సబ్‌ డివిజన్ల ఎస్‌డీపీఓలు పాల్గొన్నారు. డీజీపీ గారి సమీక్షా సమావేశంలో రేంజ్ పరిధిలోని పోలీసింగ్, ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణ, ముందస్తు నివారణ చర్యలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఐజీపీ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, చట్టాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల భద్రత, ముందస్తు చర్యలు ప్రతి జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన గ్రామాలను గుర్తించి, అవసరమైన పోలీస్ బలగాలు, అదనపు సిబ్బంది, రిజర్వ్ బలగాల మోహరింపునకు పక్కా ప్రణాళిక రూపొందించాలని ఐజీపీ ఆదేశించారు. హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచి, అవసరమైన బైండ్‌ఓవర్ తదితర చట్టపరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ నాన్‌ బెయిలబుల్ వారెంట్ల (NBWs) అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు రాజకీయ విభేదాలు, వర్గ ఘర్షణలు, ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని సేకరించి, సంబంధిత అధికారులతో తక్షణమే పంచుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అక్రమ మద్యం, ఆయుధాలపై ప్రత్యేక నిఘా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమ మద్యం వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఐజీపీ ఆదేశించారు. నాటుసారా తయారీ, నిల్వ, విక్రయం, అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచి, ముఖ్యంగా ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి జరిగే అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, అక్రమ ఆయుధాల తయారీ, నిల్వ, రవాణా, వినియోగంపై తనిఖీలు నిర్వహించి, వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రజలతో సమన్వయం సమస్యాత్మక గ్రామాలు, గతంలో ఎన్నికల ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పోలీస్ అధికారులు విస్తృతంగా పర్యటించాలని, ‘పల్లె నిద్ర’, ‘ఇంటింటికీ మీ పోలీస్’ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఐజీపీ సూచించారు. గ్రామ పెద్దలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి, స్థానిక సమస్యలు, వర్గ విభేదాలను ముందుగానే గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియా పర్యవేక్షణ, నేర నియంత్రణ ఎన్నికలకు సంబంధించిన తప్పుడు వార్తలు, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఐజీపీ ఆదేశించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్థానిక డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు ధృవీకరించని సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని, అవాంఛనీయ ఘటనల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని అవగాహన కల్పించాలని సూచించారు. చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే సమాచారంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే వ్యక్తులు, అలవాటైన నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచి నేరాల నివారణకు చర్యలు చేపట్టాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేరస్తులపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం – నిష్పక్షపాత పోలీసింగ్ ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ, ఎన్నికల, ఎక్సైజ్ తదితర శాఖలతో సమన్వయం కొనసాగిస్తూ, కీలక సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని ఐజీపీ సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది రాజకీయ ప్రభావాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #AndhraPradeshStatePolice @APPOLICE100
3
301