జై దుర్గా భవాని!
మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. పది రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం పొందడం సంతోషకరం. ఇదే సందర్భంలో దాదాపు 8 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించడం అమ్మ సేవలో అందరి సమష్టి కృషికి నిదర్శనం.
గతంతో పోలిస్తే దర్శనానికి పట్టే సమయం తగ్గడం, సేవల నాణ్యత పెరగడం అభినందనీయం. భక్తులకు సాధ్యమైనంత సులభంగా దర్శనం దక్కేలా, వారి సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ చేసిన ఏర్పాట్లపై భక్తుల నుంచి ఎంతో సంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రతి భక్తుడూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని, మంచి అనుభూతితో తిరిగి వెళ్లాలన్న మన సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టిన అందరికీ అభినందనలు.
ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన దేవాదాయ శాఖకు, జిల్లా యంత్రాంగానికి, ఆలయ అధికారులకు, అర్చకులకు, పోలీసులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. సహనంతో, క్రమశిక్షణతో సహకరించిన భక్తుల వల్లనే ఉత్సవాలు ఇంతగా విజయవంతం అయ్యాయి.
మన పుణ్యక్షేత్రాల పవిత్రతను, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిద్దాం. కనకదుర్గమ్మ తల్లి చల్లని దీవెనలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
జై దుర్గాభవాని!
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.
రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు మేం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
Deeply saddened by the tragic loss of lives in the stampede at a Durga Puja pandal in Kolkata. My heartfelt condolences to the bereaved families, and prayers for the speedy recovery of those injured. May the families find strength in this difficult hour.
ndtv.com/india-news/several-…
జై దుర్గా భవానీ!
దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నాను. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మకు ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించాను. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నాను.
నేటి దర్శన సమయంలో నాకు కలిగిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అటు అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తే... భక్తుల ఉత్సాహం, సానుకూల స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. దర్శనాలు, సేవల పట్ల భక్తుల్లో ఎంతో సంతృప్తి కనిపించింది.
ఒక్కరి రక్తదానం ఆపదలో ఉన్న మరో కుటుంబానికి జీవన ప్రదాత అవుతుంది. ప్రాణాపాయంలో ఉన్నవారికి పునర్జన్మనిస్తుంది. రక్తం అందక ఏ ఒక్క ప్రాణమూ ప్రమాదంలో పడకూడదనే సంకల్పంతో విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయం. సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సహా వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నాను. తలసేమియా చిన్నారులకు ఉచిత రక్తం అందించడం గొప్ప మానవీయ సేవ. విద్య, వైద్యం, మహిళా సాధికారత సహా ఎన్నో రంగాల్లో సేవలందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మరింత మందికి అండగా నిలవాలి. సంజీవని మొబైల్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేయడం స్ఫూర్తిదాయకం. ప్రతి సేవలో మానవత్వం, ప్రతి ప్రయత్నంలో ప్రాణ రక్షణే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@ManagingTrustee
@ntrtrust
Delighted to join Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji (@rashtrapatibhvn), at the inauguration of the National Saras Mela 2026 in #Vijayawada.
In a historic first, the Ministry of Rural Development is hosting the National SARAS Mela outside Delhi-NCR, bringing 650+ Self-Help Groups from across the nation to #AndhraPradesh.
Through Swayam AP, we are working to connect products made by our DWCRA women directly to wider e-commerce and global markets, helping them build thriving enterprises.
Our goal is to make every village a centre of enterprise and every woman a creator of wealth. This is how we move towards Swarna Andhra and contribute to Viksit Bharat.
#SarasMela2026
#SwayamAP
#AndhraPradesh
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ 17వ వార్షికోత్సవం, ఆంధ్రజ్యోతి పత్రిక 24వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ గారికి, జర్నలిస్టులకు, ఉద్యోగులకు, సిబ్బందికి హార్దిక శుభాకాంక్షలు. పాత్రికేయ విలువలకు కట్టుబడి, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం రాజీలేని నిబద్ధతతో కృషి చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ప్రస్థానం మరింత వెలుగొందాలని, పాఠకులకు, వీక్షకులకు, ప్రజలకు మరింత చేరువ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@abntelugutv
అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం. అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మానవతావాది దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం
నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకులు & చైర్మన్, పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు గారి మరణం విచారకరం. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జిల్లా అంతర్వేదిపాలెంలో జన్మించి ఎన్‌సీసీ సంస్థను స్థాపించి విజయవంతంగా నడిపించారు. నిబద్దత, నిజాయతీ గల దార్శనిక పారిశ్రామికవేత్తగా దేశ నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన అందించిన భాగస్వామ్యం చిరస్మరణీయం, స్ఫూర్తిమంతం. పారిశ్రామికవేత్తగానే కాకుండా ఎన్‌సీసీ ఫౌండేషన్‌తో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది వంటి వాటిల్లో పేదలకు ఆయన అండగా నిలిచారు. పర్యావరణం, గ్రామీణాభివృద్ధి వంటి సమాజ హిత కార్యక్రమాలు చేపట్టారు. ఎ.వి.ఎస్. రాజు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Participated in Vijayawada Utsav 2.0 with Tamil Nadu CM Thiru C. Joseph Vijay garu today. Extended my warm greetings to the people on the auspicious occasion of Navaratri. May this festive season bring happiness, prosperity and new beginnings to all!
@CMOTamilnadu
#VijayawadaUtsav2026
It was a pleasure to welcome the Hon’ble Chief Minister of Tamil Nadu, Thiru C. Joseph Vijay garu, in Vijayawada today. We had fruitful discussions on issues of mutual interest, particularly Chennai’s drinking water requirements through the Telugu Ganga Project and the ambitious Godavari–Cauvery river interlinking initiative.
Andhra Pradesh has already released 4.08 TMC of water to Chennai this year. Despite our own water constraints, we remain committed to supporting our neighbouring state, while balancing the needs of our people.
I firmly believe that water should be a source of cooperation, not conflict. With close coordination among states and the support of the Union Government, the Godavari–Cauvery river interlinking project can provide a lasting solution to water scarcity, transform agriculture and bring prosperity to lakhs of farmers across South India.
Together, we can turn shared water resources into shared prosperity.
@CMOTamilnadu
గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి, డోలీ మోతలకు చరమగీతం పాడేలా ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. తొలిదశను విజయవంతంగా పూర్తి చేసి, ఇప్పుడు ‘అడవితల్లి బాట 2.0’ ద్వారా మరో 1,341 ఆవాసాలకు రూ.2,052 కోట్లతో 1,976 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషకరం. ఇది కేవలం రహదారుల నిర్మాణం మాత్రమే కాదు… గిరిజనుల కష్టాలకు విముక్తి, అత్యవసర వైద్య సేవలకు భరోసా. ప్రతి గిరిజన గూడెం రహదారితో అనుసంధానమై అభివృద్ధి ఫలాలను అందుకునేలా సాగుతున్న ఈ మహత్తర యజ్ఞం మరింత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
@PawanKalyan
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి
•గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
•జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి
•స్థానిక ఎన్నికల్లో జన సైనికులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి
•గిరిజన గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
•ప్రజా అవసరాలను విస్మరించి.. పార్టీ రంగుల కోసం వందల కోట్ల ఖర్చు చేసింది
•రాజకీయాలకు అతీతంగా గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయించాము
• రహదారులు, ఉపాధి, వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నాం
•అడవితల్లి బాట 2.0 ద్వారా రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకారం
•రంపచోడవరం నియోజకవర్గం కాకవాడ గ్రామసభలో కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, జన సైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు, విజయం కోసం జనసేన పార్టీ, జనసైనికులు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలను గుర్తిస్తూ పొత్తు ధర్మానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జనసైనికుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం, కూటమి కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా కూటమిలోని ప్రతి నాయకుడు అండగా నిలవాలని కోరారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కాకవాడలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “2014లో కూటమికి మద్దతుగా నిలిచినప్పుడు ఏ ఒక్క జనసైనికుడు పదవులూ ఆశించలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి నిస్వార్థంగా పని చేశారు. పార్టీ కోసం, కూటమి కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ఎన్నో త్యాగాలు చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో కూడా జనసైనికులు, వీరమహిళలు రోడ్లపైకి వచ్చి తమ సంఘీభావాన్ని చాటారు. కష్టకాలంలో అండగా నిలిచిన వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ జనసైనికులు, వీరమహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. వారి త్యాగాలకు తగిన గౌరవం లభించాలి. పదవులు ఆశించకుండా అండగా నిలిచిన వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి.
• అడవితల్లి బాట లక్ష్యం అదే
గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి, వాటిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రహదారుల నిర్మాణం ద్వారా గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, రవాణా, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో పీఎం-జన్మన్, పీఎంజీఎస్‌వై-4, ఉపాధి హామీ పథకాల సమన్వయంతో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద 858 గిరిజన ఆవాసాలకు 1,662 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రూ.1,406 కోట్లతో పనులు చేపట్టాం. ఇదే స్ఫూర్తితో అడవితల్లి బాట 2.0 ద్వారా మరో 1,341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల మేర రహదారులు, 45 వంతెనల నిర్మాణం కోసం రూ.2,052 కోట్లతో మొత్తం 2,569 పనులను మంజూరు చేశాం.
2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంగా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలను సందర్శించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి ఎంత దూరంగా ఉన్నాయో అర్థం చేసుకున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాం. అయితే, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం సాధారణ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. కొండల మధ్య కిలోమీటర్ల మేర మార్గాలను ఏర్పాటు చేయడంతోపాటు, భారీ బండరాళ్లను తొలగించాలి. అవసరమైన చోట రాక్ కట్టింగ్, కంట్రోల్ బ్లాస్టింగ్ చేపట్టాలి. కొండ వాలులను స్థిరపరిచి, రహదారికి పటిష్ఠమైన పునాది వేసిన తర్వాత గ్రావెల్, ఇతర పొరలను ఏర్పాటు చేసి బీటీ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది.
•83 వేల మంది రైతులకు లబ్ధి
గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించి, వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధి హామీ, వీబీ-జీ రామ్ జీ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85 వేల ఎకరాల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి, సుమారు 83 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ సాగును ప్రోత్సహించడంతో పాటు, కాఫీ తోటలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ వంటి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. అలాగే, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు సుంకరమెట్ట కాఫీ తోటల్లో వుడెన్ బ్రిడ్జి, కానోపీ వాక్‌లను నిర్మించాం. మారేడుమిల్లిలో 11 హెక్టార్ల విస్తీర్ణంలో అరోమా కానోపీ వాక్, ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నాం. నల్లమలలో జంగిల్ సఫారీని అభివృద్ధి చేయడం ద్వారా చెంచు గిరిజన కుటుంబాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
మైదాన ప్రాంతాల్లో నివసించే బంజారా, యానాది, యెరుకుల గిరిజన ఆవాసాలకు కూడా రహదారి సౌకర్యం కల్పిస్తున్నాం. పల్లెపండుగ కార్యక్రమం కింద ఇప్పటికే 167 ఆవాసాలకు 111 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించాం. పల్లెపండుగ 3.0 ద్వారా మరో 84 ఆవాసాలకు 63.4 కిలోమీటర్ల రహదారుల నిర్మాణ పనులు చేపట్టాం. అలాగే, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో సీఎస్‌ఆర్ నిధులతో 25 అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద రూ.406 కోట్లతో 3,776 సింగిల్ విలేజ్ స్కీమ్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తంగా పల్లెపండుగ కార్యక్రమం ద్వారా సుమారు రూ.7,481 కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
•రహదారులు, మొబైల్ కనెక్టివిటీకి అనుమతులు
గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మొబైల్ కనెక్టివిటీ, పర్యాటక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, గిరిజన కుటుంబాల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అటవీ శాఖ నుంచి 555 రహదారి పనులు, 136 సెల్ టవర్ల ఏర్పాటు, 48 ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు మంజూరు చేశాం. మిగిలిన అటవీ అనుమతులు కూడా త్వరితగతిన లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. అరకులోని డుంబ్రిగుడ, కురిడి గ్రామాలను సందర్శించినప్పుడు సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న వారితో పాటు, తీవ్రమైన రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్న గిరిజన గర్భిణుల ఇబ్బందులను గుర్తించాం. అత్యవసర సమయాల్లో వారికి సకాలంలో రక్తం అందించాలనే లక్ష్యంతో అరకు ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.కోటి సీఎస్ఆర్ నిధులతో ప్రత్యేక బ్లడ్ బ్యాంకును నిర్మిస్తున్నాం.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచి, రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కంపోనెంట్ కింద రూ.68 కోట్లతో చేపట్టిన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 59 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల పరిధిలో 34 వేల మందికి పైగా అర్హులైన రైతులకు 38 రకాల, 3 లక్షలకు పైగా వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేయనున్నాం. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నాం.
•స్థానిక సమస్యల పరిష్కారానికి ఆదేశాలు
వేములకొండ, రాకోట, సువర్లవాడ, దారగూడెం, దబ్బబయలస, తిరుగతిరళ్ళు, కాకవాడ, చకలవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం గ్రామాల ప్రజలతో నిర్వహించిన మాటామంతీ కార్యక్రమంలో స్థానికులు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన సమస్యలు, అవసరాలను నా దృష్టికి తీసుకువచ్చారు. వాటన్నింటినీ మంజూరు చేస్తూ, సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టి, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశిస్తున్నాను. గిరిజనుల హక్కులను గౌరవిస్తూ, వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, అడవులను కాపాడే వారి జీవితాల్లో వెలుగులు నింపి, అభివృద్ధి ఫలాలను ప్రతి గిరిజన ఆవాసానికి చేర్చడమే కూటమి ప్రభుత్వ సంకల్పం.
•పార్టీ రంగులు వేసుకోవడానికి కోట్లు ఖర్చు చేశారు
2019–2024 మధ్య రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయో మనందరికీ తెలుసు. మన కళ్లముందే గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను శిలాఫలకాల ఏర్పాటు కోసం, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం కోసం, కోర్టుల ఆదేశాల తర్వాత ఆ రంగులను తొలగించి మళ్లీ కొత్త రంగులు వేయడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదే నిధులను సద్వినియోగం చేసి ఉంటే ఎన్నో గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించవచ్చు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు.
మనం నిర్మిస్తున్న రహదారులు నాణ్యతతో ఉన్నాయా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రజలపై ఉంది. కేవలం రోడ్లు వేయించడమే కాదు, అవి నాణ్యతతో నిర్మితమై, ఎక్కువకాలం ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి. ఎక్కడైనా నాణ్యతలో లోపాలు కనిపిస్తే వాటిని మా దృష్టికి తీసుకురండి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు సంపూర్ణ సహకారం అందిస్తే, మరింత బాధ్యతతో, మరింత ధైర్యంతో ముందుకు సాగగలం. వైఎస్సార్ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం. మేము అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత, వైసీపీ మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా అవసరమైన నిధులు అందేలా చర్యలు తీసుకున్నాను. ఎందుకంటే నాకు ముఖ్యమైన విషయం - ఏ పార్టీ బతకాలి అనేది కాదు వ్యవస్థ బతకాలి, గ్రామాలు బాగుపడాలి, ప్రజల జీవితాలు మెరుగుపడాలి. వ్యవస్థ బలంగా ఉంటేనే గ్రామాలకు రహదారులు వస్తాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజలకు జీవనోపాధి మెరుగుపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. అందుకే రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎక్కడికక్కడ లంచాలు తీసుకుంటూ, ఆధిపత్య అహంకారంతో ప్రజలను భయపెట్టే పరిస్థితులు ఉండకూడదు. తప్పును ప్రశ్నించే ధైర్యం ప్రజలకు ఉండాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను కూడా గుర్తించాలి. ధైర్యంగా ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి” అన్నారు. (1/3)
#AdaviThalliBata #AdaviThalliBata2
దుష్టశక్తులపై దైవశక్తి, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. నేటి నుంచి ప్రారంభమవుతున్న శరన్నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆరాధించడం మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి. అమ్మవారి కరుణాకటాక్షాలతో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా వర్ధిల్లాలి. ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
రాష్ట్ర ప్రజలందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.
500 టీఎంసీల పట్టిసీమ జలాలు... కృష్ణా డెల్టాకు సిరులు.
#Pattiseema
#AndhraPradesh
భాద్రపద బహుళ అమావాస్య ఆచారాల పరంగా అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజును మహాలయ అమావాస్య, సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మన ఆచారం. ఈ పవిత్రమైన రోజున మా పితృదేవతలకు తర్పణాలు సమర్పించాను.
రైతుల భూములకు భరోసా... వ్యవసాయానికి సాగునీటి భద్రత... ప్రజలకు మౌలిక వసతుల కల్పన... ఈ రోజు ప్రకాశం జిల్లాలో నా పర్యటన ఇలా ఎంతో సంతృప్తిగా సాగింది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న భూ సమస్యలకు పరిష్కారం చూపాను. 3,304 ఎకరాల భూములకు సంబంధించి భూ యజమానులకు హక్కులు కల్పించాను.
అలాగే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందించాను. అటు జిల్లా రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించే పాలేరు రిజర్వాయర్ పూర్తి చేసేలా రూ.166 కోట్లతో పనులు ప్రారంభించుకున్నాం.
ముప్పాళ్ల వద్ద రూ.28 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం... వీటితో ప్రకాశం జిల్లాకు సరికొత్త ప్రకాశం వస్తుందని ఆశిస్తున్నాను... పర్యటన విజయవంతం చేసిన ప్రజలు, నాయకులు, అధికారులు, ఉద్యోగులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు...
#PattadarPassbooks
#FarmersFriendlyGovt





















































